ETV Bharat / sports

రాహుల్, అతియా సర్​ప్రైజ్​ - సినిమాటిక్​ టచ్​తో పెళ్లి వీడియో! - కేఎల్ రాహుల్ అతియా శెట్టి

KL Rahul Wedding Video : స్టార్​ కపుల్ కేఎల్​ రాహుల్​, అతియా శెట్టి తాజాగా తమ ఫస్ట్ వెడ్డింగ్​ యానివర్సరీని గ్రాండ్​గా చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తమ ఫ్యాన్స్​కు ఓ సర్​ప్రైజ్ ఇచ్చారు. తమ వెడ్డింగ్ వీడియోను షేర్ చేసి అబ్బురపరిచారు.

KL Rahul Wedding Video
KL Rahul Wedding Video
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 24, 2024, 7:35 AM IST

Updated : Jan 24, 2024, 8:45 AM IST

KL Rahul Wedding Video : టీమ్ఇండియా స్టార్ వికెట్ కీపర్​ కేఎల్​ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టి వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట గతేడాది పెద్దల సమక్షంలో ఒకటయ్యారు. అతి కొద్దిమంది మధ్యలో గ్రాండ్​గా జరిగిన ఈ వేడుకలు అప్పట్లో టాక్ ఆఫ్​ ద టౌన్​గా నిలిచింది. అయితే తాజాగా ఈ వెడ్డింగ్​కు సంబంధించిన వీడియోను ఈ జంట నెట్టింట షేర్​ చేసింది. తమ ఫస్ట్ వెడ్డింగ్​ యానివర్సరీ సందర్భంగా ఆ మధరుమైన క్షణాలను తమ అభిమానులకు చూపించింది. సినిమాటిక్​ లెవెల్​లో ఎంతో క్యూట్​గా ఉన్న ఆ వీడియో ప్రస్తుతం నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది.

KL Rahul Athiya Shetty Marriage : 2019లోనే ఈ జంట ప్రేమలో ఉన్నట్లు పలు వార్తలు హల్​చల్​ చేశాయి. అయితే ఈ ఇద్దరూ ఆ రూమర్స్​ను కొట్టిపారేశారు. ఆ తర్వాత కొంత కాలానికి తమ రిలేషన్​షిప్​ గురించి ఓపెనప్​ అయ్యారు. ఆ తర్వాత భారత్‌లో పాటు విదేశాల్లో ఈ జంట తిరిగారు. రాహుల్‌తో కలిసి పలు టోర్నీలోకు అతియా వెళ్లింది. ఐపీఎల్​కు కూడా వచ్చి అతడికి సపోర్ట్ చేసింది. ఇలా పలు ఈవెంట్లలోనూ ఈ జంట కలియతిరిగారు. అలా కొంత కాలం ప్రేమలో ఉన్న ఈ జంట 2023లో పెద్దలు, సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు.

KL Rahul Career : ఇక రాహుల్​ కెరీర్​ విషయానికి వస్తే గాయం కారణంగా క్రికెట్​కు దూరమైన రాహుల్​, ఆ తర్వాత శస్త్రచికిత్స తీసుకుని తిరిగి ఫామ్​లోకి వచ్చాడు. శిక్షణ తీసుకుని తిరిగి జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ స్టార్​ వికెట్ కీపర్​ ఆసియా కప్​తో పాటు 2023 వన్డే వరల్డ్​ కప్​లో పరుగుల వరద పారించి సత్తా చాటాడు. తాజాగా జరిగిన సౌతాఫ్రికా టూర్​లోనూ సెంచరీ కొట్టి ట్రోలర్స్​కు తన బ్యాట్​తో సమాధానం చెప్పాడు. కీలక ఇన్నింగ్స్​ ఆడుతూ జట్టుకు అండగా నిలుస్తున్నాడు.

Last Updated : Jan 24, 2024, 8:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.