ETV Bharat / sports

టాప్​-10 నుంచి కోహ్లీ, పంత్ ఔట్​​ - బౌలింగ్​లో బుమ్రా డౌన్​, దూసుకెళ్లిన రబాడ

ఐసీసీ ర్యాంకింగ్స్ రిలీజ్- టాప్​లోకి దూసుకెళ్లిన రబాడ- టాప్​ 10నుంచి పంత్, విరాట్ ఔట్

ICC Rankings 2024
ICC Rankings 2024 (Source: Getty Images)
author img

By ETV Bharat Sports Team

Published : 4 hours ago

Updated : 3 hours ago

ICC Rankings 2024 : సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసొ రబాడ ఐసీసీ తాజా ర్యాంకింగ్స్​లో సత్తా చాటాడు. ఏకంగా మూడు స్థానాలు ఎగబాకి టాప్ ప్లేస్​కు చేరుకున్నాడు. ప్రస్తుతం రబాడ 860 రేటింగ్స్​తో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మరోవైపు టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ముడు స్థానాలు కోల్పోయి (846 రేటింగ్స్​) ముడో ప్లేస్​కు పడిపోయాడు. ​ఆసీస్ స్టార్ పేసర్ జోష్ హేజిల్​వుడ్ ఒక స్థానం మెరుగుపర్చుకొని (847 రేటింగ్స్) రెండో ప్లేస్​ దక్కించుకున్నాడు. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సైతం రెండు స్థానాలు దిగజారాడు. 831 రేటింగ్స్​తో నాలుగో స్థానానికి పడిపోయాడు.

టాప్ 5 బౌలర్లు

  • కగిసొ రబాడా (సౌతాఫ్రికా)- 860 రేటింగ్స్
  • జోష్ హేజిల్​వుడ్ (ఆస్ట్రేలియా)- 847 రేటింగ్స్
  • జస్ప్రీత్ బుమ్రా (భారత్)- 846 రేటింగ్స్
  • రవిచంద్రన్ అశ్విన్ (భారత్)- 831 రేటింగ్స్
  • ప్యాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా)- 820 రేటింగ్స్

ఇక బ్యాటింగ్ విభాగంలో టీమ్ఇండియా యంగ్ ప్లేయర్ యశస్వీ జైశ్వాల్ ఒక స్థానం మెరుగుపర్చుకున్నాడు. 790 రేటింగ్స్​తో మూడో స్థానం దక్కించుకున్నాడు. ఇంగ్లాండ్ సీనియర్ ప్లేయర్ జో రూట్ (903 రేటింగ్స్) టాప్ ప్లేస్​లోనే ఉన్నాడు. కేన్ విలియమ్సన్ (813 రేటింగ్స్) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక రిషభ్ పంత్ ఐదు స్థానాలు, విరాట్ కోహ్లీ ఆరు స్థానాలు కోల్పోయి టాప్- 10 నుంచి బయటకు వెళ్లిపోయారు. ప్రస్తుతం పంత్ (708) 11వ, కోహ్లీ (688) 14వ స్థానాల్లో ఉన్నారు.

టాప్ 5 బ్యాటర్లు

  • జో రూట్ (ఇంగ్లాండ్)- 903 రేటింగ్స్
  • కేన్ విలియమ్సన్ (న్యూలిలాండ్)- 813 రేటింగ్స్
  • యశస్వీ జైశ్వాల్ (భారత్)- 790 రేటింగ్స్
  • హ్యారీ బ్రూక్ (ఇంగ్లాండ్)- 778 రేటింగ్స్
  • స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా)- 757 రేటింగ్స్

మరోవైపు పాకిస్థాన్ బ్యాటర్ సౌద్ షకీల్ ఏకంగా 20స్థానాలు మెరుగుపర్చుకొని టాప్ 10లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల ఇంగ్లాండ్​పై భారీ సెంచరీ సాధించిన షకీల్ (724) 7వ స్థానం దక్కించుకున్నాడు. టీమ్ఇండియాతో జరుగుతున్న టెస్టు సిరీస్​లో అదరగొడుతున్న కివీస్ బ్యాటర్ రచిన్ రవీంద్ర ఎనిమిది స్థానాలు ఎగబాకి పదో ప్లేస్​లో కొనసాగుతున్నాడు.

రబాడ అరుదైన ఘనత- తొలి బౌలర్​గా రికార్డ్​

విరాట్​ను అధిగమించిన పంత్- టెస్టు ర్యాంకింగ్స్ రిలీజ్

Last Updated : 3 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.