Joe Root VS Steve Smith : ఆధునిక టెస్ట్ క్రికెట్‌పై చెరగని ముద్ర వేసిన ఆటగాళ్ళలో ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ ఒకడు. ఎప్పటికప్పుడు తన ఆటతో అబ్బురపరిచే రూట్ తాజాగా లార్డ్స్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో అద్భుత సెంచరీ చేశాడు. ఈ నేపథ్యంలో మరోసారి జో రూట్, స్టీవ్ స్మిత్‌లలో ఎవరు ఉత్తమం అనే అంశంపై చర్చ మొదలైంది. అయితే ఈ విషయాన్ని అంత తేలిగ్గా నిర్ధారించలేం. ఇద్దరు ఆటగాళ్ల గణాంకాలు చూసినా ఈ విషయం స్పష్టమవుతుంది. అయితే స్టీవ్ స్మిత్ కంటే రూట్ గొప్ప బ్యాటర్ అని కొంతమంది క్రీడా విశ్లేషకుల వాదన. మరి స్టీవ్ స్మిత్ కన్నా రూటే బెస్ట్ బ్యాటర్ అని చెప్పే మూడు ప్రధాన కారణాలను ఓసారి చూద్దాం.
1. పరిస్థితులకు తగ్గట్టు స్థిరత్వంగా - జో రూట్ క్రికెట్‌లోని అన్ని ఫార్మట్‌లలో ఉత్తమంగా రాణిస్తున్నాడు. స్టీవ్ స్మిత్ టెస్ట్ క్రికెట్‌లో అసాధారణమైన నైపుణ్యాన్ని కనబరిచినప్పటికీ, రూట్ టెస్ట్‌లతో పాటు వన్డేలు, టీ 20ల్లోనూ తన క్లాసికల్ బ్యాటింగ్‌తో అలరిస్తున్నాడు. రూట్ క్లాసికల్, మోడ్రన్ బ్యాటింగ్ టెక్నిక్ పరిస్థితికి తగ్గట్టు ఆడేలా చేస్తాయి. క్లిష్ట పరిస్థితుల్లోనూ రూట్ ఎన్నో కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. సెంచరీబలు బాదాడు. స్పిన్‌కు అనుకూలించే ఉపఖండ పిచ్‌ల నుంచి స్వింగ్‌కు అనుకూలించే ఇంగ్లాండ్ పిచ్‌ల వరకు రూట్, శతకాలతో తన బ్యాటింగ్ పదనును చాటి చెప్పాడు. ఈ శతకాలు రూట్ నైపుణ్యాన్ని మాత్రమే కాకుండా అతని మానసిక దృఢత్వాన్ని కూడా తెలియజేస్తోంది.
2. నాయకత్వం - జో రూట్ సారథిగానూ తనదైన ముద్ర వేశాడు. జట్టును నడిపించే సామర్థ్యం తనకు ఉందని చాటి చెప్పాడు. కెప్టెన్‌గా ఉన్నప్పుడు కూడా ఒత్తిడికి లోనుకాకుండా రూట్ కొన్ని అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. రూట్ కెప్టెన్సీని, స్మిత్ సారథ్యాన్ని పోలిస్తే స్మిత్ కెప్టెన్‌గా విఫలమైనట్లు కొంతమంది వాదన. వ్యక్తిగత మైలురాళ్ళు కూడా రూట్ వైపే నిలుస్తున్నాయి. రూట్ నాయకత్వంలో ఇంగ్లాండ్ కేవలం మ్యాచులు గెలవడం మాత్రమే కాకుండా జట్టులో ఆత్మస్థైర్యం కూడా పెరిగింది. ఇంగ్లాండ్ జట్టు బాజ్‌బాల్ ' వ్యూహంలో రూట్ కీలక పాత్ర పోషించాడు. ఓపిగ్గా, అవసరమైనప్పుడు వేగంగా ఆడగల సామర్థ్యం రూట్‌కు ఉంది.
3. పరుగులు - ముఖ్యంగా క్లిష్టమైన పరిస్థితుల్లో రూట్ కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. టెస్టుల్లో 12 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఇంగ్లాండ్ జట్టుకు అవసరమైనప్పుడు , ఏ పరిస్థితిలోనైనా , ఎలాంటి ప్రత్యర్థిపైనైనా పరుగుల చేయగల సామర్థ్యం రూట్‌కు ఉంది. స్మిత్ టెస్టుల్లో 9వేల పరుగులు చేశాడు. అతడు కూడా కీలక సమయాల్లో రాణించాడు. ఇక స్మిత్ బ్యాటింగ్ టెక్నిక్, నైపుణ్యం, అద్భుత ఇన్నింగ్స్‌లు మర్చిపోలేనివి. అతడు కూడా మంచి రికార్డులే సాధించాడు. కాకపోతే రూట్ మెరుగైన ప్రదర్శన, అన్నీ ఫార్మాట్లలోనూ పరిస్థితికి తగ్గట్టుగా స్థిరత్వం, జట్టుకు అందించే సహకారం, నాయకత్వం, అతడిని చాలా మంది మదిలో గ్రేట్ బ్యాటర్‌గా నిలిపాయి!
జో రూట్ టెస్ట్ సెంచరీ - ఆ ముగ్గురి రికార్డులను బ్రేక్ చేసిన స్టార్ బ్యాటర్ - Joe Root Test Century