ETV Bharat / sports

అన్​స్టాపబుల్ 'రూట్ '- సంగక్కర రికార్డ్ బ్రేక్- ఖాతాలో మరో మైల్​స్టోన్ - Eng vs SL Test Series

author img

By ETV Bharat Sports Team

Published : Sep 8, 2024, 9:28 PM IST

Joe Root Test Records: ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ టెస్టుల్లో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలో తాజాగా మరో అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు.

Joe Root Test Records
Joe Root Test Records (Source: Associated Press)

Joe Root Test Records: ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ టెస్టుల్లో మరో అరుదైన ఘనత అందుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక పరుగులు బాదిన ఆరో బ్యాటర్​గా రికార్డ్ సాధించాడు. ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న మూడో మ్యాచ్​లో రూట్ ఈ మైలురాయి అందుకున్నాడు.​ రెండో ఇన్నింగ్స్​లో 11 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రూట్ ఫీట్ సాధించాడు. ఈ క్రమంలో శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర (12400 పరుగులు)ను రూట్ (12402 పరుగులు) అధిగమించాడు. కాగా, టెస్టుల్లో ఇప్పటివరకు 146 మ్యాచ్​లు ఆడిన రూట్ 12402 పరుగులు చేశాడు. అందులో 34 సెంచరీలు, 64 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక సుదీర్ఘ ఫార్మట్ క్రికెట్​లో క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ (15921 పరుగులు) టాప్​లో ఉన్నాడు.

టెస్టుల్లో అత్యధిక పరుగుల వీరులు

ప్లేయర్జట్టుమ్యాచ్​లుపరుగులుసెంచరీలు
సచిన్ తెందూల్కర్భారత్ 20015921 51
రికీ పాంటింగ్ఆస్ట్రేలియా16813378 41
జాక్ కలీస్సౌతాఫ్రికా 1661328945
రాహుల్ ద్రవిడ్ భారత్1641328836
అలిస్టర్ కుక్ ఇంగ్లాండ్16112474 33
జో రూట్ఇంగ్లాండ్146 12402 34

ఇక ఈ ఇన్నింగ్స్​లో రూట్ 12 పరుగులకే పెవిలియన్ చేరాడు. అయితే మరో 83 పరుగులు బాదితే కుక్​ను కూడా రూట్ అధిగమించి టెస్టుల్లో అత్యధిక పరుగులు బాదిన ఐదో బ్యాటర్​గా అవతరిస్తాడు. ఇంగ్లాండ్ వచ్చే నెలలోనే పాకిస్థాన్​తో టెస్టు సిరీస్ ఆడనున్న నేపథ్యంలో రూట్​ త్వరలోనే ఆ మైలురాయి కూడా అందుకోవడం లాంఛనమే.

టెస్టుల్లో రూట్ మార్క్
కాగా, కొంతకాలంగా సుదీర్ఘ ఫార్మాట్ క్రికెట్​లో రూట్ అదరగొడుతున్నాడు. టెస్టుల్లో తనదైన మార్క్ చూపిస్తూ పరుగుల వరద పారిస్తున్నాడు. ఇదే సిరీస్​లో టెస్టుల్లో అత్యధిక సెంచరీలు బాదిన ఇంగ్లాండ్ క్రికెటర్​గా కుక్ (33) ను అధిగమించి టాప్​లో నిలిచాడు. ఇక ప్రస్తుత సిరీస్​లోనూ అత్యధిక పరుగులు బాదిన బ్యాటర్​గా కొనసాగుతున్నాడు. రూట్ 6 ఇన్నింగ్స్​లో 75 సగటుతో 375 పరుగులు చేశాడు. ఇందులో 2 శతకాలు ఉన్నాయి.

ఇక మ్యాచ్ విషయానికొస్తే, సెకండ్ ఇన్నింగ్స్​లో ఇంగ్లాండ్ 156 పరుగులకే ఆలౌటైంది. జెమ్మి స్మిత్ (67 పరుగులు) హాఫ్ సెంచరీతో రాణించగా, డాన్ లారెన్స్ (35 పరుగులు) ఆకట్టుకున్నాడు. శ్రీలంక బౌలర్లలో లహిరు కుమార 4, విశ్వ ఫెర్నాండో 3, అశిత ఫెర్నాండో 2, మిలాన్ రత్నయకె 1 వికెట్ దక్కించున్నారు. దీంతో శ్రీలంక టార్గెట్ 219 పరుగులు అయ్యింది.

ప్రతి పరుగుకు ఓ కథ ఉంటుంది: జో రూట్ - Joe Root Test

కోహ్లీ - రూట్‌లో బెస్ట్​ ఎవరు? గణాంకాలు ఏం చెబుతున్నాయ్​? - Virat Kohli vs Joe Root

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.