Jay Shah Resign ACC: బీసీసీఐ కార్యదర్శి జై షా ఆసియా క్రికెట్ కౌన్సిల్ (Asian Cricket Council) ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. నవంబర్‌లో జరిగే ఐసీసీ (International Cricket Council) ఛైర్మన్ పదవికి జై షా పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అందుకే జై షా ఏసీసీ పదవిని వదులుకోనున్నారట. ప్రస్తుతం న్యూజిలాండ్‌కు చెందిన గ్రెగ్ బార్కలే ఐసీసీ ఛైర్మన్‌గా ఉన్నారు. ఆయన 2020 నవంబర్‌లో ఈ బాధ్యతలు చేపట్టారు. ఒకవేళ జై షా ఐసీసీ ఛైర్మన్‌గా ఎంపికైతే, ఈ ప్రతిష్ఠాత్మక పదవి చేపట్టిన మూడో భారతీయుడిగా జై షా రికార్డులకెక్కుతారు. ఇదివరకు భారత్ నుంచి ఎన్ శ్రీనివాసన్, శశాంక్ మనోహర్ ఐసీసీ ఛైర్మన్లుగా వ్యవహరించారు.
అయితే జనవరి 30, 31 రెండు రోజులపాటు ఇండోనేసియా బాలిలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (Annual General Meetings) సమావేశం ఉంది. ఈ సమావేశానికి జై షా సహా బోర్డు మెంబర్లు, హాజరై బ్రాడ్‌కాస్టింగ్ హక్కు (Broadcasting Rights)ల గురించి చర్చించనున్నారు. ఇక ఈ మీటింగ్‌లోనే జై షా పదవి వ్యవహారంపై కూడా ఓ క్లారిటీ రానుంది. కాగా, ఈ మీటింగ్‌లో 2025 ఆసియాకప్ వేదికపై కూడా ఓ స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది.
-
Jay Shah set to run for the post of ICC Chairman in November. (Cricbuzz). pic.twitter.com/I4c5TIQi4d
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 30, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">Jay Shah set to run for the post of ICC Chairman in November. (Cricbuzz). pic.twitter.com/I4c5TIQi4d
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 30, 2024Jay Shah set to run for the post of ICC Chairman in November. (Cricbuzz). pic.twitter.com/I4c5TIQi4d
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 30, 2024
Jay Shah Career: 2009లో జై షా అహ్మదాబాద్ క్రికెట్ బోర్డులో ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా, ఆ తర్వాత 2013లో గుజరాత్ క్రికెట్ బోర్డు జాయింట్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇక 2015లో బీసీసీఐలోకి ఎంటర్ అయ్యారై కొన్నేళ్లపాటు ఫైనాన్స్, మార్కెటింగ్ కమిటీ వ్యవహారాలు చూసుకున్నారు. ఆ తర్వాత 2019 లో బీసీసీఐ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన జై షా, 2021 జనవరిలో ఏసీసీ ప్రెసిడెంట్‌గా నియామకం అయ్యారు. ప్రస్తుతం జై షా ఐసీసీలో అత్యంత కీలకమైన ఆర్థిక, వాణిజ్య వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌గా ఉన్నారు. ఇక 2023 సంవత్సరానికిగాను జై షా స్పోర్ట్స్ బిజినెస్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కించుకున్నారు.
జై షాపై రణతుంగ అనుచిత వ్యాఖ్యలు- ఖండించిన శ్రీలంక ప్రభుత్వం
భలే ఛాన్స్ కొట్టిన జై షా.. ICCలో కీలక పదవి..రూ.వేల కోట్ల లావాదేవీలు!