ETV Bharat / sports

'ఆ ట్రిక్​తో ​నన్నేం చేయలేరు - నేను మీకు అలాగే బదులిస్తాను '

Jasprit Bumrah England Series : టెస్ట్ సిరీస్​లో విజయం సాధించేందుకు భారత్​, ఇంగ్లాండ్ జట్లు తలపడనున్న నేపథ్యంలో టీమ్ఇండియా స్టార్​ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లాండ్ జట్టుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇంతకీ అతడు ఏమన్నాడంటే ?

Jasprit Bumrah England Series
Jasprit Bumrah England Series
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 23, 2024, 12:35 PM IST

Jasprit Bumrah England Series : సొంత‌గ‌డ్డ‌పై జరగనున్న ఐదు రోజుల టెస్ట్ సిరీస్​ కోసం భార‌త జ‌ట్టు సర్వం సిద్ధమవుతోంది. ఈ సారి ఎలాగైనా ఇంగ్లాండ్​ జట్టును ఓడించాలని కసితో ప్రాక్టీస్​ చేస్తోంది. మ‌రో రెండు రోజుల్లో హైద‌రాబాద్‌ వేదికగా జరగనున్న టెస్ట్​ కోసం ఇప్పటికే ఉప్పల్​ స్టేడియానికి చేరుకుంది. అయితే ఈ మ్యాచ్​కు ముందు టీమ్ఇండియా స్టార్​ పేసర్​ జ‌స్ప్రీత్ బుమ్రా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఇంగ్లాండ్ ప్లేయర్లు బాజ్ బాల్ ఆట‌తో త‌న‌పై పైచేయి సాధించ‌లేర‌ంటూ ధీమా వ్యక్తం చేశాడు.

"బాజ్ బాల్ ఆట‌తో చెల‌రేగుతున్న ఇంగ్లాండ్​ జట్టుకు అభినంద‌న‌లు. అయితే ఓ బౌల‌ర్‌గా నేనెప్పుడూ పైచేయి సాధించేందుకు ప్ర‌య‌త్నిస్తాను. వాళ్లు దూకుడుగా ఆడి న‌న్ను అల‌సిపోయేలా చేయలేరు. ఎందుకంటే వాళ్ల‌కు నేను వికెట్లు ప‌డ‌గొట్టి బ‌దులిస్తాను. గ్రౌండ్​లో దిగిన ప్ర‌తిసారి ప‌రిస్థితుల‌ను నాకు అనుకూలంగా ఎలా మ‌ల‌చుకోవాలన్న విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తాను" అంటూ బుమ్రా పేర్కొన్నాడు. ఇక ఈ స్టార్ క్రికెటర్​ ఇప్ప‌టివ‌ర‌కు టెస్టుల్లో 21.21 స‌గ‌టుతో 140 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

మరోవైపు 2022లో నిర్వ‌హించిన 2021 ఐదో టెస్టులో జానీ బెయిర్‌స్టో సెంచ‌రీతో చెలరేగిపోయాడు. ఆ మ్యాచ్​లో 83-5 ద‌శ‌లో ఉన్న ఇంగ్లాండ్​ 375 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. ఇప్పుడు ఆ ఓట‌మికి ప్ర‌తీకారం తీర్చుకునేందుకు బుమ్రా ఎదురుచూస్తున్నాడు. అయితే ఇంగ్లాండ్ జట్టు కూడా ఏ మాత్రం తగ్గకుండా తమ ప్లాన్స్​తో పటిష్టంగా ఉంది.

ఇక జ‌న‌వ‌రి 25న జరగనున్న తొలి టెస్టులో భాగంగా టీమ్ఇండియా తుది జట్టులో కీలక మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. తొలి రెండు టెస్టుల‌కు విరాట్ కోహ్లీ దూరం కావ‌డం కూడా టీమ్ఇండియాకు కాస్త ప్రతికూలాంశంగా మారనుంది. అయితే శుభ్‌మ‌న్ గిల్, య‌శ‌స్వీ జైస్వాల్, శ్రేయ‌స్ అయ్య‌ర్‌ల లాంటి యంగ్​స్టర్స్​ తమ మెరుపులతో జట్టును గెలిపించాల్సి ఉంటుందంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక బౌలింగ్ టీమ్​లో మ‌హ్మ‌ద్ ష‌మీ గైర్హాజరీలో సిరాజ్, ముకేశ్ కుమార్‌ల‌తో క‌లిసి బుమ్రా బౌలింగ్ యూనిట్‌ను ఎలా న‌డిపిస్తాడన్నది ఆసక్తికంగా మారింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.