ETV Bharat / sports

12 పరుగులకే ఆలౌట్- T20 హిస్టరీలో రెండో అత్యల్ప స్కోర్ - Lowest Total In T20 History - LOWEST TOTAL IN T20 HISTORY

Lowest Total In T20 History: టీ20 క్రికెట్ చరిత్రలో రెండో అత్యల్ప స్కోర్ నమోదైంది. జపాన్​తో బుధవారం జరిగిన మ్యాచ్​లో మంగోలియా 12 పరుగులకే ఆలౌటైంది.

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 8, 2024, 7:40 PM IST

Updated : May 8, 2024, 8:04 PM IST

Lowest Total In T20 History: టీ20 క్రికెట్ చరిత్రలో రెండో అత్యల్ప స్కోర్ నమోదైంది. జపాన్- మంగోలియా (Japan vs Mangolia) మధ్య బుధవారం జరిగిన మ్యాచ్​లో ఈ అరుదైన ఫీట్ నమోదైంది. తొలుత బ్యాటింగ్ చేసిన జపాన్ జట్టు 217 పరుగులు స్కోర్ చేసింది. దీంతో 218 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన మంగోలియా టీమ్​ 8.2 ఓవర్లలోనే 12 పరుగులు చేసి కుప్పకూలింది.ఆ జట్టులో ఏకంగా ఆరుగురు బ్యాటర్లు తమ పరుగుల ఖాతా తెరవకుండానే వరుసగా ఔటై పెవిలియన్ చేరారు. దీంతో ప్రస్తుతం జరిగిన ఈ ఇన్నింగ్స్​ టీ20 హిస్టరీలోనే రెండో అత్యల్ప స్కోర్​గా చరిత్రకెక్కింది.

కాగా, తొలిసారిగా ఐల్ ఆఫ్ మ్యాన్ జట్టు 2023 ఫిబ్రవరిలో స్పెయిన్​ (Isle of Man's vs Spain)తో జరిగిన మ్యాచ్​లో 8.4 ఓవర్లలో 10 పరుగులకే ఆలౌటైంది. ఇది టీ20 చరిత్రలో తొలి అత్యల్ప స్కోర్. ఇక ఓవర్ల పరంగా చూసుకుంటే ఇది రెండో అతి చిన్న ఇన్నింగ్స్​ కావడం విశేషం. ఈ మ్యాచ్​లో మంగోలియా ఇన్నింగ్స్ 8.2 ఓవర్లలోనే ముగిసింది. 2023లో నైజీరియా- రవాండ (Rwanda vs Nigeria) మ్యాచ్​లో నమోదైంది. ఈ మ్యాచ్​లో రవాండ 6.1 ఓవర్లలో 24 పరుగులు చేసి ఆలౌటైంది. ఇక పరుగుల పరంగా టీ20 చరిత్రలో ఇది నాలుగో అతిపెద్ద విజయం. 2023 ఆసియా గేమ్స్​లో ఇదే మంగోలియాపై నేపాల్ 273 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్​లో మంగోలియా 13.1 ఓవర్లలో 41 పరుగులుక కుప్పకూలింది.

టీ20ల్లో అతిపెద్ద విజయాలు (పరుగుల పరంగా)

  • నేపాల్ vs మంగోలియా- 273 పరుగులు (2023, నేపాల్ విజయం)
  • చెక్ రిపబ్లిక్ vs టర్కీ- 257 పరుగులు (2019, చెక్ రిపబ్లిక్ విజయం)
  • కెనడా vs పనామా- 208 పరుగులు (2021, కెనడా విజయం)
  • జపాన్ vs మంగోలియా- 205 పరుగులు (2024, జపాన్ విజయం)
  • మలేసియా vs థాయిలాండ్- 194 పరుగులు (2023, మలేసియా విజయం)

43 ఏళ్ల వయసులో వరల్డ్​ కప్​ - ఉగాండా, స్కాట్లాండ్ జట్ల ప్రకటన - T20 WorldCup 2024

IPLకు హైబ్రిడ్ పిచ్​​ రెడీ- దీనివల్ల లాభాలేంటో తెలుసా? - IPL 2024

Last Updated : May 8, 2024, 8:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.