ETV Bharat / sports

ఆండర్సన్ సూపర్ డైవ్​ - 41 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే - ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్

James Anderson England Series : భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్యలో నాలుగో టెస్ట్ ఎంతో ఉత్కంఠగా సాగుతోంది. అయితే ఇదే వేదికగా ఇంగ్లాండ్ ప్లేయర్ జేమ్స్ ఆండర్సన్ పట్టిన ఓ క్యాచ్​ ఇప్పుడు నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. ఇంతకీ అదేంటంటే ?

James Anderson England Series
James Anderson England Series
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 26, 2024, 12:43 PM IST

Updated : Feb 26, 2024, 3:56 PM IST

James Anderson England Series : రాంచీ వేదికగా ఇంగ్లాండ్​తో జరుగుతున్న నాలుగో టెస్టు ఎంతో ఉత్కంఠగా సాగుతోంది. 40/0 పరుగుల ఓవర్‌ నైట్‌ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన రోహిత్​ సేన, కాసేపటికే పెవిలియన్ బాట పట్టింది. యశస్వీ జైశ్వాల్‌(37), రోహిత్‌ శర్మ(55), రజిత్‌ పాటిదార్‌(0) ఇలా ముగ్గురూ వరుసగా ఔటయ్యారు. అయితే జైస్వాల్​ను ఇంగ్లాండ్ సీనియర్ ప్లేయర్ జేమ్స్​ ఆండర్సన్ ఔట్​ చేసిన తీరు అందరినీ ఆకట్టుకుంది.

టీమ్ఇండియా సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో ​ 17 ఓవర్‌లో ఇంగ్లాండ్ ప్లేయర్ జో రూట్‌ వేసిన మూడో బంతిని జైశ్వాల్‌ ఆఫ్‌ సైడ్‌ దిశగా భారీ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బాల్​ కాస్త టర్న్‌ ఎక్కువగా కావడం వల్ల ఎడ్జ్‌ అది తీసుకుని బ్యాక్‌వర్డ్ పాయింట్‌ దిశగా దూసుకెళ్లింది. దీంతో బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో ఉన్న ఆండర్సన్​ ఒక్కసారిగా ఫుల్‌ లెంగ్త్‌ డైవ్‌ చేస్తూ సూపర్​గా క్యాచ్​ పట్టాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు, ఈ స్టన్నింగ్​ క్యాచ్​కు ఫిదా అవుతున్నారు. 41 ఏళ్ల వయసలోనూ ఆండర్స్​లో ఎనర్జీ ఏ మాత్రం తగ్గలేదని కామెంట్లు పెడుతున్నారు.

మ్యాచ్​ సాగిందిలా :
నాలుగో రోజులో ఓవర్‌ నైట్‌ 40/0 స్కోరుతో లక్ష్యఛేదనను ప్రారంభించిన టీమ్ఇండియా తొలుత మంచి ఫామ్​లోనే కనిపించింది. అయితే యశస్వి జైస్వాల్ కొట్టిన బాల్​ను అండర్సన్‌ సూపర్ డైవ్​లో ముందుకు దూకి అందుకొన్నాడు. దీంతో తొలి వికెట్‌ సమయానికి ఓపెనర్లు 84 పరుగులు జోడించినట్లైంది. మొదటి వికెట్​ పడ్డాక ఆచితూచి ఆడిన రోహిత్ శర్మ కాసేపటికీ హాఫ్‌ సెంచరీ చేసి వెనుతిరిగాడు. దీంతో లంచ్ బ్రేక్ సమయానికి 118/3 స్కోరుగా నమోదైంది. అయితే బ్రేక్ తర్వాత షోయబ్‌ బషీర్‌ ఒకే ఓవర్‌లో రవీంద్ర జడేజా, సర్ఫరాజ్‌ ఖాన్‌ ఔటై పెవిలియన్​కు చేరుకున్నారు. అయితే ఇంగ్లాండ్ స్పిన్నర్లు వేసిన బంతులను కట్టుదిట్టంగా ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చారు ధ్రువ్- గిల్. దీంతో నాలుగో టెస్ట్​​ టీమ్ఇండియా వశమైంది.

90 పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్ - ధ్రువ్ 'సెల్యూట్'​ వెనక కారణం ఏంటంటే ?

నాలుగో టెస్ట్​ తొలి ఇన్నింగ్స్​ - భారత్ ఆలౌట్​ - ధ్రువ్‌ జురెల్ ధనాధన్ ఇన్నింగ్స్​!

Last Updated : Feb 26, 2024, 3:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.