Irfan Pathan Wife Photo: టీమ్ఇండియా మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ తొలిసారి తన భార్య సఫా బేగ్ (Safa Baig)ను ప్రపంచానికి పరిచయం చేశాడు. పెళ్లైన ఎనిమిదేళ్లకు ఆమె ఫేస్ రివీల్ చేశాడు. వారి వివాహ వార్షికోత్సవం (Wedding Anniversary) సందర్భంగా, ఆమెతో కలిసి ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 'నువ్వు చాలా బాధ్యతలు తీసుకున్నావు. నాకు ఓ మిత్రుడిలా, కమెడియన్‌గా, నా పిల్లలకు తల్లిగా కీలకంగా వ్యవహరిస్తున్నావు. నువ్వు భార్యగా నా జీవితంలోకి రావడం అదృష్టంగా భావిస్తా. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు మై లవ్' అని పోస్ట్‌కు రాసుకొచ్చాడు.
Irfan Pathan Marriage: ఇర్ఫాన్ పఠాన్ సౌదీ అరేబియాకు చెందిన ఓ వ్యాపారవేత్త కుమార్తె సనా బేగ్‌ను 2016లో వివాహం చేసుకున్నాడు. వారికి ఇమ్రాన్, సులేమాన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే గతంలో ఇర్ఫాన్ ఎప్పుడు ఫ్యామిలీ ఫొటోలు షేర్ చేసినా తన భార్య ఫేస్ మాత్రం కవర్ చేసి ఉండేది. ఫిబ్రవరి 03న వారి వెడ్డింగ్ డే కావడం వల్ల ఆమె ఫొటోను షేర్ చేశాడు. ఇక ఈ క్యూట్ కపుల్‌కు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ విషెస్ తెలుపుతున్నారు.
-
Infinite roles mastered by one soul – mood booster, comedian, troublemaker, and the constant companion, friend, and mother of my children. In this beautiful journey, I cherish you as my wife. Happy 8th my love ❤️ pic.twitter.com/qAUW8ndFAJ
— Irfan Pathan (@IrfanPathan) February 3, 2024
Irfan Pathan International Career: ఇర్ఫాన్ 2003లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. దాదాపు 10ఏళ్లు టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించాడు. భారత్ 2007 టీ20 వరల్డ్‌కప్ గెలవడంలో ఇర్ఫాన్ కీలకంగా వ్యవహరించాడు. తన కెరీర్లో 29 టెస్టు, 120 వన్డే, 24 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇర్ఫాన్ టెస్టుల్లో 100 వికెట్లతో పాటు 1105 పరుగులు చేశాడు. అటు పరిమిత ఓవర్ల క్రికెట్ (వన్డే)లో 173 వికెట్లు, 1544 పరుగులు చేశాడు. టీ20ల్లో బ్యాటింగ్‌లో పెద్దగా ప్రభావం చూపని ఇర్ఫాన్ 28 వికెట్లు పడగొట్టాడు. టెస్టు క్రికెట్‌కు 2008లో వీడ్కోలు పలికిన ఇర్ఫాన్, వన్డే, టీ20 ఫార్మాట్‌కు 2012లో గుడ్‌బై చెప్పాడు. ఆ తర్వాత కొన్నేళ్లపాటు ఐపీఎల్ ఆడిన ఇర్ఫాన్ ప్రస్తుతం కామెంటరీ విభాగంలో కొనసాగుతున్నాడు.
'టీమ్ఇండియాలో ఆ మార్పులు అవసరం- అప్పుడే బ్యాటింగ్ బ్యాలెన్స్!'