ETV Bharat / sports

IPLలో హై వోల్టేజ్ మ్యాచ్​లు- ఈ జట్ల మధ్య పోరు కిక్కే వేరప్ప - IPL Top Rivalries Mi vs Csk

IPL Top Rivalries: ప్రపంచ క్రికెట్​లో కొన్ని జట్ల మధ్య పోరుకు వేరే లెవెల్ క్రేజ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్​లో కూడా కొన్ని జట్ల మధ్య మ్యాచ్​లు ఫుల్ మజానిస్తాయి. ఈ మ్యాచ్​లకు ఫ్యాన్​ బేస్ కూడా ఎక్కువే.

IPL Top Rivalriesat
IPL Top Rivalries
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 16, 2024, 2:02 PM IST

IPL Top Rivalries: ఐపీఎల్ ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్. ఈ లీగ్​లో ఆడాలని ప్రతీ క్రికెటర్ ఆరాటపడుతుంటాడు. కేవలం ఆట మాత్రమే కాదు కాసులు కురిపిస్తుంది అందుకే దీనికి ఓ రేంజ్ ఉంది. ఐపీఎల్ మ్యాచ్ స్టార్ట్ అయ్యిందంటే చాలు స్టేడియంలో ప్రేక్షకుల సందడి మమూలుగా ఉండదు. చప్పట్లు, కేరింతలతో మార్మోగుతుంది. ప్రతిఏటా 10 జట్లు ఒకదానితో ఒకటి రెండుసార్లు తలపడతాయి. ఇందులో మొదటి 4 జట్లు ప్లేఆఫ్ కు అర్హత సాధిస్తాయి. అయితే కొన్ని మ్యాచులు సరదాగా అనిపించినా, టోర్నీలో మరికొన్ని జట్లు మాత్రం భీకర పోటీని తలపిస్తాయి. ఆలా ఐపీఎల్ లీగ్ చరిత్రలో టాప్- 3 ప్రత్యర్థులుగా ఉన్న జట్లు ఏవో చూద్దాం.

ముంబయి ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్: ముంబయి ఇండియన్స్- చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఐపీఎల్​లో అత్యంత ఎక్కువ ఫ్యాన్ బేస్ కలిగిన జట్లు. అటు బ్రాండ్​లో గానీ, ఇటు ఆటలో కానీ ఈ జట్లకు తిరుగులేదు. ఇక ఐపీఎల్ హిస్టరీలో రోహిత్, ధోనీ అత్యంత సక్సెస్​ఫుల్ కెప్టెన్లు. వీరి మధ్య మ్యాచ్​ అంటే ఫ్యాన్స్​కు పూనకాలే. ఇరు జట్ల కెప్టెన్లు రోహిత్ శర్మ, ఎంఎస్ ధోని వ్యూహాత్మక గేమ్​ ప్లాన్​తో మ్యాచ్​ను మరింత ఆసక్తిగా మారుస్తారు. ఇప్పటి వరకూ ఈ రెండు జట్ల మధ్య జరిగిన అనేక మ్యాచ్​లు ప్రేక్షకును మునివేళ్లపై నిలబెట్టాయి.

బంతి బంతికి అభిమానుల్లో నరాలు తెగె ఉత్కంఠను రేకెత్తిస్తూ సాగే ముంబయి- చెన్నై మ్యాచ్​లకు వ్యూవర్​షిప్​ కూడా ఎక్కువే. ఇంకా కొన్ని సార్లు ఇరు జట్లకు చెందిన స్టార్ ప్లేయర్ల మధ్య గొడవుల జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ధోని దెబ్బకు ప్రత్యర్థి జట్టు వణికిపోతుంది. కానీ, చెన్నై సూపర్ కింగ్స్​ను ముంబయి ఏకంగా 20సార్లు చిత్తుగా ఓడించింది. ఐపీఎల్​ చరిత్రలో చెన్నైను ఏ జట్టు కూడా ఇన్నిసార్లు ఓడించలేదు. ఈ రెండు జట్ల మధ్య యుద్ధం ఎప్పటికీ తారాస్థాయిలోనే ఉంటుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఐపీఎల్ చరిత్రలో కోల్​కతా నైట్ రైడర్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మధ్య మ్యాచ్​కు సపరేట్ ఫ్యాన్​బేస్ ఉంటుంది. ఈ రెండు జట్లు తలపడుతున్నాయంటే మైదానంలో వాతావరణం హీటెక్కాల్సిందే. గతంలో గంభీర్ కేకేఆర్​కు ప్రాతినిధ్యం వహించిన సమయంలో ఆర్​సీబీతో మ్యాచ్​ పవర్​ప్యాక్డ్​గా ఉండేది.

స్టార్ ప్లేయర్లు గంభీర్- విరాట్ మధ్య కూడా మైదానంలో పరుమార్లు వివాదం జరిగింది. దీంతో ఈ రెండు జట్లు ఎప్పుడు తలపడ్డా, ఫ్యాన్స్​ దీన్ని హై వోల్టేజ్ మ్యాచ్​లాగా భావిస్తారు. గతంలో ఆర్​సీబీని ఐపీఎల్​ చరిత్రలోనే అతి తక్కువ స్కోర్ (49)​కే ఆలౌట్ చేసిన ఘనత కూడా కేకేఆర్​దే. ఇక గంభీర్ కేకేఆర్​ను వదిలి వెళ్లిన తర్వాత ఆర్​సీబీతో మ్యాచ్​లు కాస్త సాధారణంగానే జరిగాయి. అయితే గంభీర్ మళ్లీ కేకేఆర్​తో చేరడం వల్ల ఈసారి కూడా ఆర్​సీబీతో మ్యాచ్​ ఫ్యాన్స్​కు ఫుల్ కిక్ ఇస్తుంది.

IPL 2023 : తడబడిన ముంబయి ఇండియన్స్​.. 13 ఏళ్ల తర్వాత చెన్నై విక్టరీ!

IPL 2022 MI vs CSK: ఐపీఎల్​ నుంచి చెన్నై ఔట్.. ముంబయి చేతిలో ఓటమి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.