IPL Starts Not Selected World Cup: ప్రపంచంలోని రిచెస్ట్ స్పోర్ట్స్ లీగ్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) ఒకటి. లీగ్‌లో స్టార్ ప్లేయర్‌ల శాలరీ రూ.కోట్లలో ఉంటుంది. ఇండియన్ క్రికెట్ స్టార్లు చాలా మంది రూ.10 కోట్లకు పైగా అందుకుంటున్నారు. అయినా కొంత మంది ప్లేయర్‌లు 2024 టీ20 వరల్డ్‌కప్ ఆడే అవకాశం సంపాదించలేకపోయారు. ఆ ప్లేయర్‌లు ఎవరంటే?
శ్రేయస్ అయ్యర్: కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ రూ.12.25 కోట్ల ఐపీఎల్ శాలరీ అందుకుంటున్నాడు. 2021, 2022 వరల్డ్‌కప్ ఎడిషన్లలో కూడా అయ్యర్ బ్యాకప్ ఆప్షన్‌గా స్క్వాడ్‌లో ఉన్నాడు. కానీ, ఈ ఏడాది ఆ అవకాశం రాలేదు.
కేఎల్ రాహుల్: ఐపీఎల్ 2024లోనే అత్యంత ఖరీదైన భారత ఆటగాడు కేఎల్ రాహుల్. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా ఉన్న రాహుల్, ఫ్రాంచైజీ నుంచి రూ.17 కోట్లు అందుకుంటున్నాడు. 2022 టీ20 ప్రపంచకప్‌లో రాహుల్ భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ ఏడాది జరగనున్న టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి సెలక్ట్ కాలేదు.
ఇషాన్ కిషన్: ముంబయి ఇండియన్స్ జట్టులో అత్యంత ఖరీదైన ఆటగాళ్లలో ఇషాన్ కిషన్ ఒకడు. ఫ్రాంచైజీ నుంచి ఏకంగా రూ.15.25 కోట్ల శాలరీ అందుకుంటున్నాడు. అతడు 2021 టీ20 ప్రపంచకప్ ఆడాడు. గత సంవత్సరం ఆసియా కప్, వన్డే ప్రపంచ కప్ జట్టులోనూ సభ్యుడు. కానీ, 2024 టీ20 ప్రపంచకప్‌కి సెలక్టర్లు ఇషాన్‌ను దూరం పెట్టారు.
దీపక్ చాహర్: ఐపీఎల్ 2024 మినీ వేలానికి ముందు సీఎస్కే దీపక్ చాహర్‌ను రూ.14 కోట్లకు అట్టిపెట్టుకుంది. సీఎస్కేలో భారీ మొత్తంలో శాలరీ పొందుతున్న ప్లేయర్‌లలో చాహర్ ఒకడు. ఇంతటి ఖరీదైన, టాలెంటెడ్ పేస్ బౌలర్ 2024 టీ20 వరల్డ్‌కప్‌కి ఎంపిక కాలేదు.
హర్షల్ పటేల్: ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్ ఆల్ రౌండర్ హర్షల్ పటేల్ రాణిస్తున్నాడు. గత ఏడాది జరిగిన మినీ వేలంలో పంజాబ్ రూ.11.75 కోట్లకు హర్షల్ పటేల్‌ని కొనుగోలు చేసింది. పటేల్ టీ20 వరల్డ్ కప్ 2022లో భారత జట్టులో సభ్యుడు. కానీ, ఈసారి హర్షల్ పటేల్‌కు పొట్టికప్‌లో చోటు దక్కలేదు.
టీమ్‌ఇండియా జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), శివమ్ దూబె, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
విరాట్‌పై ఆందోళనా? కోహ్లీ స్ట్రైక్‌రేట్‌పై రోహిత్, అగార్కర్ రియాక్షన్ ఇదే! - T20 World Cup 2024
'నలుగురు స్పిన్నర్లు కావాల్సిందే- ఎందుకో అక్కడ క్లారిటీ ఇస్తా'- రోహిత్ శర్మ - T20 Wordl Cup 2024