ETV Bharat / sports

IPL ఆరెంజ్ క్యాప్- టాప్​లో వార్నర్- విరాట్, గేల్ ఎన్నిసార్లంటే?​ - IPL Orange Cap List All Season

IPL Orange Cap List All Season: ఐపీఎల్‎లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లకు ఆరెంజ్ క్యాప్ ఇస్తారు. ఐపీఎల్ మొదటి సీజన్ నుంచి ఇప్పటివరకు ఏయే బ్యాటర్​ ఈ ప్రత్యేక గౌరవాన్ని అందుకున్నారో చూద్దాం.

IPL Orange Cap List All Season
IPL Orange Cap List All Season
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 18, 2024, 7:06 PM IST

IPL Orange Cap List All Season: ఐపీఎల్ అంటేనే పరుగుల వరద. ఎదుర్కొనే ప్రతి బంతిని బౌండరీ లైన్ దాటించడమే లక్ష్యంగా బ్యాటర్లు క్రీజులో అడుగుపెడుతుంటారు. అలా ఇప్పటివరకూ అనేక మంది బ్యాటర్లు పరుగుల వరద పారించి తమ టాలెంట్​ను ప్రపంచానికి పరిచయం చేశారు. అలా టోర్నీలో అత్యధిక పరుగుల వరద పారించిన బ్యాటర్లకు ఐపీఎల్ బోర్డు ఆరెంజ్ క్యాప్ ఇస్తుంటుంది. క్యాప్​తో పాటు ప్లేయర్ అదనంగా రూ.10 లక్షలు అందుకుంటారు. అలా గడిచిన 16 సీజన్​లలో ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అత్యధికంగా మూడుసార్లు ఈ క్యాప్ సాధించాడు. మరి 2008 నుంచి 2023 వరకు ఆరెంజ్ క్యాప్ అందుకున్న బ్యాటర్లు ఎవరో తెలుసుకుందాం.

  • షాన్ మార్ష్: 2008లో జరిగిన తొలి ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ (అప్పటి కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌)కు చెందిన షాన్ మార్ష్ తొలి సీజన్​లో ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. దీంతో ఐపీఎల్​లో తొలి ఆరెంజ్ క్యాప్ ఆందుకున్న బ్యాటర్​గా మార్ష్ రికార్డు కొట్టాడు. మార్ష్ 2008లో 616 పరుగులు సాధించాడు..
  • మాథ్యూ హెడెన్: 2009లో చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన మాథ్యూ హెడెన్ రెండో సీజన్​ టాప్ స్కోరర్​గా నిలిచాడు. అతడు 572 పరుగులు బాదాడు.
  • సచిన్ తెందూల్కర్: ఐపీఎల్ 2010 ఎడిషన్​లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ అదరగొట్టాడు. తన కెప్టెన్సీలోనే ముంబయి ఇండియన్స్​ను ఫైనల్ చేర్చాడు. కానీ, ఫైనల్​లో చెన్నై చేతిలో ముంబయి ఓడి రన్నరప్​తో సరిపెట్టుకుంది. ఇక ఈ సీజన్​లో సచిన్ అందరికంటే ఎక్కువ పరుగులు నమోదు చేశాడు. 2010లో సచిన్ 618 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ విజేతగా నిలిచాడు.
  • క్రిస్ గేల్: యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ 2011, 2012 వరుస సీజన్​లలో ఆరెండ్ క్యాప్ గెలుచుకున్న ఏకైక ప్లేయర్​గా రికార్డ్ కొట్టాడు. గేల్ 2011లో 608 పరుగులు, 2012లో 733 పరుగులు చేసి వరుస సీజన్​లలో ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు.
  • మైక్ హస్సీ: ఐపీఎల్ 2013లో ఆస్ట్రేలియాకు చెందిన మైక్ హస్సీ ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. సీజన్‌లో 733 పరుగులు చేశాడు.
  • రాబిన్ ఉతప్ప: 2014లో కేకేఆర్ తరఫున ప్రాతినిధ్యం వహించిన రాబిన్ ఉతప్ప టోర్నీలో పరుగుల వరద పారించాడు. ఈ సీజన్​లో కేకేఆర్ ట్రోఫీ నెగ్గడంలో కీలక పాత్ర పోషించిన ఉతప్ప టాప్ రన్​ స్కోరర్​గా నిలిచాడు. ఈ సీజన్‌లో రాబిన్ 660 పరుగులు చేశాడు.
  • డేవిడ్ వార్నర్: 2015లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడిన డేవిడ్ వార్నర్ 562 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు.
  • విరాట్ కోహ్లీ: ఐపీఎల్ 2016లో విరాట్ కోహ్లీ 973 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు ఏ బ్యాటర్​ కూడా ఒక సీజన్‌లో ఇన్ని పరుగులు చేయలేదు. ఈ సీజన్‌లో విరాట్ 152 స్ట్రైక్ రేట్‌తో 81 పరుగుల సగటుతో పరుగులు చేశాడు.
  • డేవిడ్ వార్నర్: ఐపీఎల్ 2017లో డేవిడ్ వార్నర్ 641 పరుగులు చేసి రెండోసారి ఆరెంజ్ క్యాప్‌ అందుకున్నాడు.
  • కేన్ విలియమ్సన్: న్యూజిలాండ్ ఆటగాడు ఐపీఎల్ 2018లో మంచి బ్యాటింగ్ ప్రదర్శన చేశాడు. 735 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు.
  • డేవిడ్ వార్నర్: ఐపీఎల్ 2019లో డేవిడ్ వార్నర్ 692 పరుగులు చేసి ముచ్చటగా మూడోసారి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు.
  • కేఎల్ రాహుల్: ఐపీఎల్ 2020లో కేఎల్ రాహుల్ 670 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్‌ను గెలుచుకున్నాడు.
  • రుతురాజ్ గైక్వాడ్: ఐపీఎల్ 2021 చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన రుతురాజ్ గైక్వాడ్ పేరిట ఉంది. అతను 635 పరుగులు చేశాడు.
  • జాస్ బట్లర్: ఇంగ్లీష్ ఆటగాడు జాస్ బట్లర్ 2022ఐపీఎల్ లీగ్ లో 863 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ ని అందుకున్నాడు.
  • శుభ్ మన్ గిల్: గుజరాత్ టైటాన్స్ కు చెందిన ఓపెనర్, యంగ్ బ్యాటర్ శుభ్ మన్ గిల్ 2023 ఐపీఎల్ లీగ్ లో 17 మ్యాచులలో 890పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ ను గెలుచుకున్నాడు.
    • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఈ క్రికెటర్లకు ఫుల్ టాలెంట్- అది మాత్రం కలిసి రాలేదు!

వీళ్లంతా టాప్​ క్లాస్ క్రికెటర్లు- అయినా ఐపీఎల్​కు నో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.