ETV Bharat / sports

ఐపీఎల్ ఫైనల్​ ఓడిన కెప్టెన్లు గుర్తున్నారా?- లిస్ట్​లో సచిన్, విరాట్ ఇంకా ఎవరంటే? - IPL Final Lose Captains ms dhoni

IPL Final Lose Captains: ఐపీఎల్​లో గడిచిన 16 సీజన్​లలో పలువురు కెప్టెన్లు ఆయా జట్లకు టైటిల్ అందించారు. అయితే ఏ ఆటలోనైనా గెలిచిన కెప్టెన్ అందరికీ గుర్తుంటాడు. కానీ, ఓడిన కెప్టెన్​కు ఎవరూ పట్టించుకోరు. ఈ క్రమంలో ఐపీఎల్​లో ఇప్పటివరకు ఫైనల్ మ్యాచ్ ఓడిన కెప్టెన్​లు ఎవరో తెలుసుకుందాం.

IPL LOSING CAPTAINS
IPL LOSING CAPTAINS
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 21, 2024, 10:48 AM IST

IPL Final Lose Captains: 2024 ఐపీఎల్ కప్పు ఎవరు గెలుస్తారు? ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తోంది. దీంతో టోర్నీ ప్రారంభానికి ముందే ఫ్యాన్ పోల్స్ (Fan Polls) ప్రారంభమయ్యాయి. అభిమానులు, విశ్లేషకులు తమ తమ అభిప్రాయాల్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. అయితే లీగ్ ఫైనల్‌ మ్యాచ్‌ వరకు ఈ చర్చ ఇలాగే కొనసాగుతుంది. ఇక చివరికి విజేత ఖరారయ్యాక అందరి దృష్టి గెలిచిన కెప్టెన్​పైనే ఉంటుంది.

కానీ, టైటిల్‌కి ఒక్కడ అడుగు దూరంలో నిలిచిపోయిన రన్నరప్‌ జట్టు గురించి, కెప్టెన్​ గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అసలు మాట్లాడుకోరు కూడా. కానీ, టోర్నీలో వాళ్లు కూడా అత్యుత్తమ ప్రదర్శన కనబరిస్తేనే తుదిపోరు దాకా వచ్చారని అందరూ మర్చిపోతారు. అలా ​గడిచిన 16 సీజన్​లలో ఫైనల్ మ్యాచ్ ఓడిన కెప్టెన్లు ఎవరో తెలుసా?

  • ఎంస్‌ ధోని (CSK): ఐపీఎల్​లో అత్యంత సక్సెస్​ఫుల్ కెప్టెన్​లలో ధోనీ టాప్​లో ఉంటాడు. ఇప్పటివరకూ చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా ధోని ఐదుసార్లు ఐపీఎల్‌ టైటిల్‌ నెగ్గాడు. కానీ, అన్నేసార్లు (5) ఫైనల్​లో ఓడిపోయాడు కూడా. ధోనీ 2008లో రాజస్థాన్ రాయల్స్, 2012లో కేకేఆర్, 2013, 2015, 2019లో మూడుసార్లు ముంబయి ఇండియన్స్ చేతిలో ఓడిపోయాడు.
  • అనిల్ కుంబ్లే (RCB): అనిల్ కుంబ్లే 2009 ఐపీఎల్‌ సీజన్‌లో RCB కెప్టెన్‌గా వ్యవహరించాడు. దురదృష్టవశాత్తు డెక్కన్ ఛార్జర్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో ఆర్సీబీ ఓడిపోయింది.
  • సచిన్ తెందూల్కర్ (MI): ఐపీఎల్ 2010 ఫైనల్‌లో సచిన్ తెందూల్కర్ నేతృత్వంలోని ముంబయి ఇండియన్స్ 22 పరుగుల తేడాతో చెన్నై చేతిలో ఓడిపోయింది.
  • డేనియల్ వెటోరి(RCB): 2011 సీజన్‌లో RCBకి కెప్టెన్‌ డేనియల్ వెటోరి. CSKతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆర్సీబీ ఏకంగా 58 పరుగుల తేడాతో ఓడిపోయింది.
  • జార్జ్ బెయిలీ (PBKS): 2014ఫైనల్​లో పంజాబ్- కేకేఆర్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్​లో కోల్​కతా 3 వికెట్ల తేడాతో నెగ్గి రెండోసారి ఐపీఎల్ ఛాంపియన్​గా నిలిచింది. అప్పటి కేకేఆర్​కు గంభీర్ కెప్టెన్​ కాగా, పంజాబ్ జట్టుకు జార్జ్ బెయిలీ నాయత్వం వహించాడు.
  • విరాట్ కోహ్లి (RCB): 2016 సీజన్‌లో RCBకి విరాట్ కోహ్లి కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ సీజన్‌ ఫైనల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఎనిమిది పరుగుల తేడాతో RCBపై విజయం సాధించింది.
  • కేన్ విలియమ్సన్ (SRH): కేన్ విలియమ్సన్ 2018లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌, సన్‌రైజర్స్‌ ఫైనల్‌ చేరాయి. అయితే హైదరాబాద్‌పై చెన్నై 8 వికెట్ల భారీ తేడాతో గెలిచింది.
  • శ్రేయాస్ అయ్యర్‌(DC): 2020లో శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్‌ ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఆకట్టుకునే ప్రదర్శన చేసినప్పటికీ ముంబయి ఇండియన్స్‌ చేతిలో ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్‌లో ముంబై 5 వికెట్లు తేడాతో గెలిచింది.
  • ఇయాన్ మోర్గాన్ (KKR): 2021 సీజన్‌లో మోర్గాన్‌ నేతృత్వంలోని కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, చెన్నైతో ఫైనల్‌లో తలపడింది. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 27 పరుగుల తేడాతో కప్పు గెలిచింది.
  • సంజు శాంసన్ (RR): 2022లో సంజూ శాంసన్ కెప్టెన్సీలో రాజస్థాన్ రాయల్స్‌ ఫైనల్‌కి చేరింది. మొదటిసారి ఫైనల్‌ ఆడిన గుజరాత్‌ టైటాన్స్‌ ఏకంగా ఏడు వికెట్ల తేడాతో రాజస్థాన్‌ని ఓడించి, కప్పు గెలిచింది.
  • హార్దిక్ పాండ్యా (GT): IPL 2023 సీజన్‌లోనూ పాండ్యా కెప్టెన్సీలో గుజరాత్‌ టైటాన్స్‌ ఫైనల్‌ ఆడింది. DLS పద్ధతిలో CSK చేతిలో ఓడిపోయారు.
    • " class="align-text-top noRightClick twitterSection" data="">

IPL 2024 టైటిల్‌ వేటకు 10 టీమ్స్‌ కెప్టెన్లు రెడీ - ఎవరి సక్సెస్‌ రేటు ఎంత?

మొట్టమొదటి ఐపీఎల్‌ టైటిల్‌ గెలిచిన ఛాంపియన్స్‌ - ఇప్పుడు ఎక్కడున్నారంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.