IPL Auction 2025 Teams Purse Value : ఇండియన్ ప్రీమియర్ లీగ్- ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమ ప్లేయర్ల రిటెన్షన్ లిస్ట్‌లను గురువారం అధికారికంగా ప్రకటించాయి. మొత్తం 10 జట్లు 46 మంది ప్లేయర్లను అట్టిపెట్టుకున్నాయి. అందులో కోల్‌కతా, రాజస్థాన్ జట్లు గరిష్ఠంగా ఆరు రిటెన్షన్ల పూర్తి కోటాను ఉపయోగించుకున్నాయి. పంజాబ్ జట్టు తక్కువ సంఖ్యలో ఇద్దరిని మాత్రమే అట్టిపెట్టుకుంది. దీంతో పంజాబ్ వద్ద అన్ని జట్ట కంటే అత్యధికంగా రూ. 110.50 కోట్లు ఉన్నాయి. ఇక ఐదుగురు క్యాప్డ్ ప్లేయర్లు సహా ఆరుగురిని రిటైన్ చేసుకున్న రాజస్థాన్ రాయల్స్ రూ.41 కోట్ల అతి తక్కువ పర్స్‌తో వేలంలోకి దిగనుంది. ఐపీఎల్ 2025 వేలంలో పాల్గొన్న ఫ్రాంచైజీల పర్స్ వ్యాల్యులు ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.
IPL 2025 - టీమ్స్ పర్స్ వ్యాల్యూ
ఫ్రాంచైజీ | పర్స్ వ్యాల్యూ | ఆర్టీఎమ్ కార్డ్ |
పంజాబ్ కింగ్స్ | రూ. 110.5 కోట్లు | 4 |
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు | రూ. 83 కోట్లు | 3 |
దిల్లీ క్యాపిటల్స్ | రూ. 76.25 కోట్లు | 2 |
లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ | రూ. 69 కోట్లు | 1 |
గుజరాత్ టైటాన్స్ | రూ. 69 కోట్లు | 1 |
చెన్నై సూపర్ కింగ్స్ | రూ. 55 కోట్లు | 0 |
కోల్‌కతా నైట్‌రైడర్స్ | రూ. 51 కోట్లు | 1 |
ముంబయి ఇండియన్స్ | రూ. 45 కోట్లు | 1 |
సన్‌రైజర్స్ హైదరాబాద్ | రూ. 45 కోట్లు | 1 |
రాజస్థాన్ రాయల్స్ | రూ. 41 కోట్లు | 0 |
అదరగొట్టిన హైదరాబాద్ ఆటగాడు!
కాగా, రిటెన్షన్‌లో హైదరాబాద్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ (రూ.23 కోట్లు) అత్యధిక ధర దక్కించుకున్నాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని బెంగళూరు టీమ్ (రూ.21 కోట్లు) రిటైన్ చేసుకుంది. ఇక ముంబయి స్టార్ రోహిత్ శర్మ (రూ.16.30 కోట్లు), చెన్నై మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా (రూ.4 కోట్లు) అందుకోనున్నారు. అయితే రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌ను ఆయా జట్లు రిటైన్ చేసుకోలేదు. ఇక మ్యాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్, సిరాజ్‌లను ఆర్సీబీ వదులుకుంది. నవంబర్ రెండు లేదా మూడో వారంలో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది.
The wait is over and the retentions are 𝙃𝙀𝙍𝙀! 🔥
— IndianPremierLeague (@IPL) October 31, 2024
Here are all the players retained by the 🔟 teams ahead of the #TATAIPL Auction 💪
What do you make of the retention choices 🤔 pic.twitter.com/VCd0REe5Ea
2025 IPL రిటెన్షన్ లిస్ట్ ఔట్- మెగా వేలంలోకి ఐదుగురు కెప్టెన్లు!
భారత్ X న్యూజిలాండ్ : ఈసారి సత్తా చాటాల్సిందే- కళ్లన్నీ రోహిత్, విరాట్‌పైనే!