Kohli on Dhoni Retirement : చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఐపీఎల్ రిటైర్‌మెంట్‌పై చాలా కాలంగా రూమర్స్ వస్తున్నాయి. తాజాగా కోహ్లీ కామెంట్స్ ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూరుస్తున్నాయి. నేడు మే 18న ప్లేఆఫ్స్ కోసం చెన్నై, బెంగళూరు తలపడుతున్న నేపథ్యంలో విరాట్ ఈ కామెంట్స్ చేశాడు. గత 16 ఏళ్లుగా తామిద్దరు చాలాసార్లు డ్రెస్సింగ్ రూమ్‌ను షేర్ చేసుకున్నామని, ధోనీతో ఆడడం ఇదే చివరిసారి అవ్వొచ్చు ఏమోనని కోహ్లీ చెప్పాడు.
"భారత్‌లోని ఏ స్టేడియంలోనైనా ధోనీ ఆడటం అభిమానులకు పెద్ద విషయం. నేను, అతను కలిసి బహుశా ఆడటం ఇదే చివరి సారి కావొచ్చు. చెప్పలేం ఏదైనా జరగొచ్చు. అతడు మరి కొనసాగుతాడో? లేదో? ఎవరికి తెలుసు. మాకు చాలా గొప్ప మొమరీస్ ఉన్నాయి. భారతదేశానికి గొప్ప పార్ట్‌నర్‌షిప్‌లు నెలకొల్పాం. మేం ఇద్దరం కలిసి ఆడటాన్ని అభిమానులు ఎంజాయ్ చేస్తారు. చాలా ప్రత్యేకంగా భావిస్తారు." అని విరాట్ పేర్కొన్నాడు. కాగా, మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన 2019 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌లో కోహ్లీ, ధోనీ చివరిసారిగా కలిసి ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడారు.
- విమర్శలపై స్పందన
విమర్శలను ఎదుర్కోవడం గురించి కూడా కోహ్లీ మాట్లాడాడు. "42 ఏళ్ల ధోనీకి కూడా తన జట్టును గెలిపించడంలో ప్రత్యేక పద్ధతులు ఉన్నాయి. చాలా మంది మహీ ఎందుకు గేమ్‌ని 20వ ఓవర్ లేదా 50వ ఓవర్‌కు తీసుకెళ్తాడు అంటారు. కానీ ఇలానే మహీ ఇండియాకి ఎన్నో మ్యాచ్‌లు గెలిపించాడు. ఏం చేస్తున్నామో తెలిసిన ఏకైక వ్యక్తి మహీ. మ్యాచ్‌ను చివరి బాల్ వరకు తీసుకెళ్తే తన జట్టును గెలిపించగలనని అతనికి తెలుసు." అని విరాట్ చెప్పాడు. - ప్లేఆఫ్స్‌కి ఎవరు?
పాయింట్స్ టేబుల్‌లో చెన్నై 14 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. 12 పాయింట్లతో ఆర్సీబీ ఏడో స్థానంలో ఉంది. రెండు జట్లు ప్లేఆఫ్స్‌లో తమ బెర్త్‌ను బుక్ చేసుకోవాలని చూస్తున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాప్ 4లో చేరాలంటే చెన్నైని 18 పరుగుల తేడాతో ఓడించాలి లేదా 11 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించాలి. చెన్నైకి ఈ సమీకరణాలు అవసరం లేదు. మ్యాచ్ గెలిస్తే నేరుగా ప్లేఆఫ్స్‌కు చేరుతుంది.-
Qatar Airways Postcard 🎫
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 18, 2024
Game Day hugs to fuel the fire 🔥🫂#PlayBold #ನಮ್ಮRCB #IPL2024 #RCBxQatarAirways @qatarairways pic.twitter.com/CkP1w4nFCk
-
ఆ రోజే అమెరికాకు టీమ్ ఇండియా ప్లేయర్స్! - T20 World Cup 2024
కీలక పోరు - వాతావరణ పరిస్థితి ఎలా ఉండనుందంటే? - IPL 2024 CSK VS RCB