IPL 2024 Sunrisers Hyderabad VS Royal Challengers Banglore : ఐపీఎల్ 2024లో భాగంగా తాజాగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమి చెందింది. 35 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఆరు ఓటముల తర్వాత ఎట్టకేలకు బెంగళూరు ఈ సీజన్లో రెండో విజయాన్ని సాధించింది.
207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 171 పరుగులు మాత్రమే చేసింది. షబాజ్ అహ్మద్(37 బంతుల్లో 1 ఫోర్ 1 సిక్స్ సాయంతో 40*) టాప్ స్కోర్‌గా నిలిచాడు. పాట్ కమిన్స్(15 బంతుల్లో 1 ఫోర్ 3 సిక్స్‌ల సాయంతో 31 పరుగులు), అభిషేక్ శర్మ(13 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్స్‌ల సాయంతో 31 పరుగులు) రాణించారు. అబ్దుల్ సమద్(10), మర్క్రమ్(7), ట్రావిస్ హెడ్(1), భువనేశ్వర్ కుమార్(13) విఫలమయ్యారు. చివర్లో జయదేవ్ ఉనద్కత్(8*) పరుగులు చేశారు. స్వప్నిల్ సింగ్ 2, కర్ణ్ శర్మ 2, కెమరూన్ గ్రీన్ 2, .యశ్ దయల్, విల్ జాక్స్ చెరో వికెట్ తీశారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 206 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(51) హాఫ్ సెంచరీ బాదాడు. రజత్ పాటిదార్ 20 బంతుల్లో 50 పరుగులు మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. బౌలర్లపై విరుచుకుపడుతూ తద్వారా ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన రెండో ప్లేయర్‌గా రాబిన్ ఉతప్ప సరసన రజిత్ నిలిచాడు. కామెరూన్ గ్రీన్ 20 బంతుల్లో 37 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ 12 బంతుల్లో 25 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ చివర్లో వచ్చిన ఇంఫాక్ట్ ప్లేయర్ స్వప్నిల్ సింగ్ 12 పరుగులు చేశాడు. కార్తీక్ 11 పరుగులు చేశాడు. హైదరాబాద్ బౌలర్లలో జయదేవ్ ఉనద్కత్ మూడు వికెట్లు తీశాడు. టి నటరాజన్ 2, పాట్ కమిన్స్, మయాంక్ మార్కండే తలో వికెట్ తీశారు.
కోహ్లీ అరుదైన రికార్డ్ - ఐపీఎల్ చరిత్రలోనే ఏకైక క్రికెటర్‌గా - IPL 2024 SRH VS RCB