ETV Bharat / sports

ఐపీఎల్ ముందు ధావన్ ధనాధన్​ - 99 నాటౌట్​ - ప్రత్యర్థులు హడల్​!

IPL 2024 Sikhar Dhawan : ఐపీఎల్‌ 2024 సీజన్‌ ప్రారంభానికి ముందే పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ ధనాధన్ ఇన్నింగ్స్​ ఆడాడు. బ్యాట్​తో చెలరేగిపోయాడు. తాజాగా జరిగిన ఓ మ్యాచ్​లో కేవలం 51 బంతుల్లోనే 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 99 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

ఐపీఎల్ ముందు ధావన్ ధనా ధన్​ - 99 నాటౌట్​ - ప్రత్యర్థులు హడల్​ - !

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 7, 2024, 3:55 PM IST

Updated : Mar 7, 2024, 5:44 PM IST

IPL 2024 Sikhar Dhawan : ఐపీఎల్‌ 2024 సీజన్‌ ప్రారంభానికి ముందే పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ శిఖర్‌ ధవన్‌ సూపర్​ ఫామ్‌లోకి వచ్చేశాడు. తాజాగా డీవై పాటిల్‌ టీ20 టోర్న్​మెంట్​లో అతడు చెలరేగి ఆడాడు. డీవై పాటిల్‌ బ్లూ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు సీఏజీతో జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ఇలా రెచ్చిపోయి ఆడాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన గబ్బర్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు.​ కేవలం 51 బంతుల్లోనే 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 99 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ధావన్​ తాజా ప్రదర్శనతో ఐపీఎల్‌ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. గబ్బర్​ ఇదే భీకర్‌ ఫామ్‌ను కొనసాగిస్తే ప్రత్యర్థి జట్టుకు హడలే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ధావన్ ప్రదర్శన వల్ల ఫలితంగా డీవై పాటిల్‌ బ్లూ టీమ్​ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులను సాధించింది. ఇకపోతే ఈ జట్టులో ధావన్ మినహా ఇతర బ్యాటర్లు ఎవ్వరూ రాణించలేకపోయారు. ఓపెనర్‌ అభిజిత్‌ తోమర్‌ (20 బంతుల్లో 31 పరుగులు), అయాజ్‌ ఖాన్‌ (9 బంతుల్లో 16), పరిక్షిత్‌ (6 బంతుల్లో 11 నాటౌట్‌) నామామాత్రంగా ఆడారు. సీఏజీ బౌలర్లలో సన్వీర్‌ సింగ్‌, రిత్విక్‌ చటర్జీ చెరో రెండు వికెట్లు తీయగా, ప్రధాన్‌, అంకిత్‌ శర్మ తలో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఏజీ 19.1 ఓవర్లలోనే 4 వికెట్ల నష్టానికి కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. వరుణ్‌ లవండే (70) హాఫ్​ సెంచరీతో మెరిశాడు. సన్వీర్‌ సింగ్‌ (48), ఆబిద్‌ ముస్తాక్‌ (17) నాటౌట్​గా నిలిచారు. ఈ ముగ్గురు కలిసి సీఏజీకి విజయాన్ని అందించారు. సీఏజీలో మిగతా వారు సంజయ్‌ 11, సేనాపతి 4, సచిన్‌ బేబీ 20 నామమాత్రపు పరుగులు చేశారు. బ్లూ జట్టు బౌలర్లలో విపుల్‌ కృష్ణన్‌ 2, కర్ష్ కొఠారి ఓ వికెట్‌ తీశారు. ఇక ఈ విజయంతో సీఏజీ సెమీ ఫైనల్​కు అర్హత సాధించింది. అలానే నేడు జరిగిన మరో క్వార్టర్‌ ఫైనల్​లో ఇండియన్‌ అయిల్‌ టీమ్​ టాటా స్పోర్ట్స్‌ క్లబ్‌పై విజయం సాధించి సెమీస్‌కు అర్హత సాధించింది.

ఇంగ్లాండ్​తో ఐదో మ్యాచ్​ - రికార్డ్స్​ బ్రేక్ చేసిన రోహిత్, యశస్వి, కుల్దీప్​

ఐదో టెస్ట్ తొలి రోజు ఆట పూర్తి - మనోళ్లు దంచేశారు

Last Updated : Mar 7, 2024, 5:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.