IPL 2024 Full Schedule : బీసీసీఐ తాజాగా ఐపీఎల్ 17వ సీజన్‌కు సంబంధించిన ఫుల్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఇప్పటికే తొలి విడత షెడ్యూల్‌ను అమలు చేయగా, రెండో షెడ్యూల్‌ను కూడా తాజాగా వెల్లడించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో క్వాలిఫయర్ - 1 (మే 21న), ఎలిమినేటర్ (మే 24న) నిర్వహించనున్నారు. ఇక ఈ లీగ్ ఫైనల్ చెన్నై వేదికగా జరగనుంది.
ప్రస్తుత సీజన్‌లో ప్లే ఆఫ్స్‌తో ఓవరాల్‌గా 74 మ్యాచ్‌లు జరగాల్సి ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా రెండో విడత షెడ్యూల్‌ను ప్రకటించారు. ఇక ఈ మ్యాచ్‌లు ఏప్రిల్ 8 నుంచి ప్రారంభం కానున్నాయి. అందులో భాగంగా తొలి మ్యాచ్ చెన్నై, కోల్‌కతా జట్లు తలపడనున్నాయి.
అయితే గతంలో ఐపీఎల్ 2024 రెండో షెడ్యూల్ యూఏఈలో జరుగుతుందన్న వార్తలు వచ్చాయి. సార్వత్రిక ఎన్నికల కారణంగా ఆ వేదికను బీసీసీఐ ఎంచుకున్నట్లు రూమర్స్ వచ్చాయి. అయితే అందులో వాస్తవాలు లేవని మిగతా మ్యాచ్‌లు కూడా భారత్‌లోనే జరగనున్నట్లు బీసీసీఐ సెక్రటరీ జై షాతో పాటు ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ దుమాల్ తేల్చిచెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఐపిఎల్ నిర్వహణకు ఎలాంటి అడ్డంకులు చెప్పలేదని, దాని కోసమే మిగతా మ్యాచ్‌లను కూడా స్వదేశంలోనే నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
-
The wait is finally over! 😍
— Star Sports (@StarSportsIndia) March 25, 2024
Here's the complete TATA #IPL2024 schedule! Mark your calendars 📅 and don't miss out on the non-stop cricket excitement 🔥
Tune-in to #IPLOnStar, LIVE, Only on Star Sports pic.twitter.com/9XopOFs6ir
ధోనీ కోసమే ఫైనల్స్ :
దిగ్గజ ఆటగాడు ఎం.ఎస్. ధోనీకి ఘన వీడ్కోలు పలికేందుకే 2024 ఐపీఎల్ ఫైనల్‌ను చెన్నైలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించిందని అభిమానులు అంటున్నారు. ధోనీ ఇప్పటికే కెప్టెన్సీకి వీడ్కోలు చెప్పేశాడని మహీ వయస్సు కూడా 42 ఏళ్లని కొందరు గుర్తు చేస్తున్నారు. ఆ ప్రకారం ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ అని అతనికి ఘన వీడ్కోలు పలికేందుకే ఐపీఎల్ మ్యాచ్‌లను ఫిక్స్ చేసి చెన్నై జట్టు ఫైనల్ సొంత మైదానంలో ఆడేలా బీసీసీఐ ప్లాన్ చేస్తోందని కామెంట్లు పెడుతున్నారు.
హైదరాబాద్ వేదికగా జరగనున్న మ్యాచులు ఇవే :
ముంబయి vs హైదరాబాద్ - మార్చి 27
చెన్నై vs హైదరాబాద్ - ఏప్రిల్ 5
బెంగుళూరు vs హైదరాబాద్ - ఏప్రిల్ 25
రాజస్థాన్ vs హైదరాబాద్ - మే 2
లఖ్‌నవూ vs హైదరాబాద్- మే 8
గుజరాత్ vs హైదరాబాద్- మే 16
పంజాబ్ vs హైదరాబాద్ - మే 19
ప్లేఆఫ్స్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఇవే
క్వాలిఫయర్-1 మే 21 - అహ్మదాబాద్
ఎలిమినేటర్ మ్యాచ్ - మే 22 - అహ్మదాబాద్
క్వాలిఫయర్-2 - మే 24- చెన్నై
ఫైనల్ - మే 26 - చెన్నై
ఉత్కంఠ పోరులో ముంబయిపై టైటాన్స్ విజయం - GT VS MI IPL 2024
'అదే మా ఓటమికి కారణం - తిలక్ నిర్ణయమే సరైనది' : హార్దిక్ పాండ్య - IPL 2024 MI VS GT