ETV Bharat / sports

అంపైర్‌తో పెద్ద గొడవ - సంజూకు భారీ జరిమానా - IPL 2024 - IPL 2024

IPL 2024 Sanju Samson Fined : దిల్లీ క్యాపిటల్స్​తో జరిగిన మ్యాచ్​లో అంపైర్ గొడవ పడటంపై ఆర్ఆర్​ కెప్టెన్​ సంజూ శాంసన్​కు భారీ జరిమానా పడింది. పూర్తి వివరాలు స్టోరీలో.

Source ANI
IPL 2024 Sanju Samson (Source ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : May 8, 2024, 11:10 AM IST

Updated : May 8, 2024, 11:16 AM IST

IPL 2024 Sanju Samson Fined : ఐపీఎల్‌ 17వ సీజన్‌లో భాగంగా దిల్లీ క్యాపిటల్స్​తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్​లో రాజస్థాన్‌ రాయల్స్​ 20 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. కెప్టెన్ సంజూ శాంసన్ (86) ఒక్కడే తన బ్యాట్​తో పోరాడాడు. కానీ వివాదాస్పద ఔట్​తో క్రీజును విడిచాడు. దీంతో రాజస్థాన్‌ ఓటమి బాధ తప్పలేదు. అయితే తన ఔట్ నిర్ణయంపై అంపైర్‌తో వాగ్వాదం చేశాడు.

అయితే మ్యాచ్​ అనంతరం ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ ఈ వివాదాన్ని పరిగణలోకి తీసుకుని సంజూ శాంసన్‌కు భారీ జరిమానా విధించింది. ఈ మేరకు ఓ కీలక ప్రకటనను జారీ చేసింది. "రాజస్థాన్‌ రాయల్స్​ కెప్టెన్‌ సంజూపై మ్యాచ్‌ ఫీజ్‌లో 30 శాతం ఫైన్ విధించాం. ఐపీఎల్ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ను అతడు ఉల్లంఘించడమే ఇందుకు కారణం. అతడు ఆర్టికల్ 2.8 లెవల్‌ 1 నేరానికి పాల్పడినట్లు తేలింది. మ్యాచ్‌ రిఫరీ నిర్ణయం మేరకే ఈ జరిమానాను విధించడం జరిగింది" అని కమిటీ వెల్లడించింది.

అసలేం జరిగిందంటే? - క్రీజులో దూకుడుగా ఆడిన సంజూ ముకేశ్‌ కుమార్‌ వేసిన 16వ ఓవర్లో షార్ట్‌ పిచ్‌ బాల్​ను లాంగాన్‌ వైపు సిక్సర్‌ బాదేందుకు ట్రై చేశాడు. అయితే బౌండరీ లైన్‌ వద్ద ఉన్న హోప్‌ బంతిని క్యాచ్​ను పట్టుకున్నాడు. అయితే క్యాచ్‌ పట్టగానే అతడి ఎడమ పాదం బౌండరీ హద్దును తాకింది. అంటే దాదాపుగా తాకినట్లు రీప్లేలో కనిపించింది. అతడి షూకు, బౌండరీ లైన్​కు మధ్య అస్సలు ఖాళీనే కనిపించలేదు. కానీ రీప్లే చూసి మూడో అంపైర్‌ ఔట్ ప్రకటించాడు. బాల్​ బౌండరీ హద్దును తాకిందన చెప్పడానికి స్పష్టమైన ఆధారం కనిపించలేదు. దీంతో సంజూ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అంపైర్‌తో వాదించాడు. కానీ ఫలితం దక్కలేదు. వాస్తవానికి అప్పటికే రాజస్థాన్‌ రాయల్స్​ స్కోరు 162 . మరో 26 బంతుల్లో 60 పరుగులు చేయాల్సి ఉంది. కానీ సంజూ తర్వాత వచ్చినోళ్లను దిల్లీ బౌలర్లు కట్టడి చేయడంతో చివరికి రాయల్స్​ 20 పరుగుల తేడాతో ఓడిపోవాల్సి వచ్చింది.

చాహ‌ల్ అదిరే రికార్డ్​ - టీ20 క్రికెట్​లో తొలి భారత బౌలర్​గా - IPL 2024 Chahal

శాంసన్ మెరిసినా - రాజస్థాన్​పై దిల్లీదే విజయం - IPL 2024

Last Updated : May 8, 2024, 11:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.