IPL 2024 Royal Challengers Banglore Play offs : ప్రతి ఐపీఎల్ సీజన్‌లో భారీ అంచనాలతో బరిలోకి దిగి అభిమానులను తీవ్రంగా నిరాశపరిచే జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ సీజన్‌లో ఇదే పని చేసింది. ఇప్పటి వరకు ఆడిన ఎనిమిది మ్యాచుల్లో ఏడింటిలో ఓడింది. ఆదివారం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లోనూ చివరి బంతి వరకూ పోరాడినా ఫలితంగ దక్కలేదు. ఒక్క పరుగు తేడాతో ఓటమి బాధ చూసింది. దీంతో ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకునే మొదటి జట్టుగా ఆర్సీబీ నిలిచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. టాప్-4లోకి ఈ జట్టు నిలవాలంటే అద్భుతాలు జరగాల్సిందే. ఈ నేపథ్యంలో జట్టు సమీకరణాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
భారీ తేడాతో అన్నీ గెలిస్తేనే - ఆర్సీబీ ఇప్పటి వరకు 8 మ్యాచ్‌ల్లో ఆడింది. కేవలం పంజాబ్ కింగ్స్‌పై మాత్రమే విజయం సాధించింది. దీంతో పాయింట్స్ టేబుల్లో చివరి స్థానంలో నిలిచింది. సాధారణంగా ఈ మెగా లీగ్‌లో 16 పాయింట్లు (8 విజయాలు) సాధించిన టీమ్స్‌కు ప్లేఆఫ్స్ చేరేందుకు ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతం ఆర్సీబీ ఇంకా ఆరు మ్యాచులు ఆడాలి. ఒకవేళ ఈ ఆరు మ్యాచుల్లో గెలిచినా 14 పాయింట్లే జట్టు ఖాతాలోకి వస్తాయి. అదే సమయంలో ఇతర జట్లు కూడా చివరికి ఇవే పాయింట్లతో ఉంటే అప్పుడు ఆర్సీబీ ముందడుగు వేసే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ నెట్ రన్‌రేట్ కూడా కీలకం అవుతుంది. అంటే నెక్ట్స్ ఆడబోయే మ్యాచుల్లో బెంగళూరు జట్టు గెలవడమే కాదు భారీ తేడాతో ప్రత్యర్థి జట్టును ఓడించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆ జట్టు రన్‌రేట్ మైనస్‌లో (-1.046) ఉంది. ఇది ఆ జట్టుకు ప్రతికూలాంశమే. అయితే ఇదే సమయంలో ఇతర టీమ్స్ రిజల్ట్స్ తనకు అనుకూలంగా కలిసి రావాలి. అప్పుడే ఆర్సీబీలో టాప్ 4లో నిలిచే ఛాన్స్ ఉంటుంది.
ఆ జట్లతో సవాలే - బెంగళూరు తన నెక్ట్స్ మ్యాచుల్లో సన్‌రైజర్స్, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్‌లతో పోటీపడనుంది. వీటిలో సన్‌రైజర్స్ ఇప్పటికే రికార్డు స్థాయి స్కోర్లను నమోదు చేసి ఆర్సీబీకి బెంబేలెత్తించింది. చెన్నై కూడా బలంగా ఉంది. మిగతా జట్లను తక్కువగా అంచనా వేయలేం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ టీమ్స్‌ను ఆర్సీబీ ఎలా ఎదుర్కొంటుందో.
జట్టు లోపాలు - జట్టు నిండా స్టార్ బ్యాటర్లే ఉన్నా కూడా నిలకడలేమీ సమస్యను ఎదుర్కొంటున్నారు. అతిపెద్ద సమస్య బౌలింగ్. బంతితో ప్రత్యర్థి జట్టును ఆపలేకపోతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆర్సీబీ వరుస విజయాలను, అది కూడా భారీ తేడాతో ఎలా పుంజుకుంటుందో అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
IPLలో వరుస జరిమానాలు- ఈసారి ఇద్దరు కెప్టెన్లకు ఎఫెక్ట్! - IPL 2024