IPL 2024 Rajasthan Royals VS Mumbai Indians : ఐపీఎల్-2024లో ముంబయి ఇండియన్స్ తలరాత మారేలా కనిపించట్లేదు. మళ్లీ అదే కథ రిపీట్ అయింది. ముంబయి వరుసగా మూడో ఓటమిని ఖాతాలో వేసుకుంది. తాజాగా తమ హోం గ్రౌండ్ వాంఖడేలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ 6 వికెట్ల తేడాతో ఓడిపోయి విమర్శల పాలైంది. అయితే ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం కెప్టెన్ హార్దిక్ పాండ్య స్పందించాడు. ఈ ఓటమి చాలా బాధగా ఉందని తెలిపాడు. ఆరంభాన్ని తాము అనుకున్నట్లుగా ప్రారంభించలేకపోయామని పేర్కొన్నాడు.
"ఇది కష్టమైన రాత్రి. మ్యాచ్‌లో ఓడిపోవడం చాలా బాధగా ఉంది. ఆరంభం అనుకున్నట్లుగా మొదలు పెట్టలేకపోయాం. నేను బ్యాటింగ్ దిగాక ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురు దాడి చేయాలనుకున్నా. నేను తిలక్ క్రీజులో ఉన్న సమయంలో 150 నుంచి 160 పరుగులకు స్కోర్ చేస్తామని అనుకున్నా. కానీ నా వికెట్ కోల్పోయాక రాజస్థాన్ తిరిగి మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. నేను మరి కొన్ని ఓవర్లు క్రీజులో ఉండి ఆడాల్సింది. ఈ రోజు వికెట్ ఈ విధంగా ఉంటుందని అస్సలు ఊహించలేదు. ఊహించిన దాని కన్నా భిన్నంగా ఉంది. దీన్ని ఓ సాకుగా చెప్పాలనకోవడం లేదు. ఎందుకంటే ఒక బ్యాటర్‌గా ఎలాంటి వికెట్‌పైనైనా ఆడేందుకు రెడీగా ఉండాలి. ఏదైమైనప్పటికి ప్రత్యర్ధి బౌలర్లు మంచి ప్రదర్శన చేశారు. మేము అనుకున్న విధంగా ఫలితాలు రావడం లేదు. కానీ ఓ జట్టుగా మాపై మాకు పూర్తి నమ్మకం ఉంది. మేం మరింత మంచి ప్రదర్శన చేస్తాం అనే ఆత్మవిశ్వాసం ఉంది. ఇలాంటి సమయంలోనే మరింత ధైర్యంతో ముందుకు వెళ్లాలి. తర్వాతి మ్యాచుల్లో కమ్‌బ్యాక్ ఇస్తామని భావిస్తున్నాను" అని హార్దిక్ పేర్కొన్నాడు.
కాగా, ఈ మ్యాచ్‌లో ముంబయి బ్యాటింగ్ లైనప్‌లో దారుణంగా విఫలమైంది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి రాజస్థాన్ బౌలర్ల దెబ్బకు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 125 పరుగులు మాత్రమే సాధించింది. బౌల్ట్ (3/22), చాహల్ (3/11), బర్గర్ (2/32) ముంబయి పతనాన్ని శాసించారు. అనంతరం 126 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో రియాన్ పరాగ్ (54 నాటౌట్; 39 బంతుల్లో 5×4, 3×6) మెరుపులు మెరిపించడంతో రాజస్తాన్ 15.3 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
బౌలింగ్‌తో చెలరేగిన రాజస్థాన్ ప్లేయర్లు - ముంబయి హ్యాట్రిక్ ఓటమి - MI VS RR IPL 2024
'కెప్టెన్సీ అంటే కాఫీ తాగినంతా ఈజీ కాదు'- హార్దిక్‌పై నెటిజన్లు ఫైర్ - Hardik Pandya Captain IPL