IPL 2024 Rajasthan Royals Sanju Samson Love Story : రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ఐపీఎల్ 2024లో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. తమ జట్టును కూడా విజయాల బాట పట్టిస్తున్నాడు. అలానే త్వరలోనే ప్రారంభం కానున్న టీ20 వరల్ట్‌కప్ కోసం జట్టులోనూ చోటు సంపాదించుకున్నాడు. అయితే ప్రతి విజయం వెనుక ఒక అలుపెరగని కృషి ఎలా అయితే ఉంటుందో. అలాగే ప్రతి మగాడి విజయం వెనక వెన్నంటి నడిచే ఒక మహిళ కూడా ఉంటుందని అంటుంటారు. మరి శాంసన్ వెనక శాంతంగా ఉండి ప్రోత్సహించే మహిళా అతడి భార్య చారులత శాంసనే. ఓ సారి ఈ జంట ప్రేమ కథను తెలుసుకుందాం.
కాలేజీ కలిపింది ఇద్దరినీ - చారులత స్వస్థలం కేరళలోని తిరువనంతపురం. ఆమె చదువంతా అక్కడే పూర్తి చేసింది. డిగ్రీ బీఎస్సీ కెమిస్ట్రీ చేయడానికి మార్ ఇవానోయిస్ కాలేజీలో చేరింది. అక్కడే ఆమెకు సంజు పరిచయం అయ్యాడు. సోషల్ మీడియా ద్వారా ఇద్దరూ బాగా దగ్గరయ్యారు. ఫేస్ బుక్‌లో చారులత ప్రొఫైల్ చూసిన సంజు ఆమెకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి దగ్గరయ్యాడు. డిగ్రీ పూర్తయ్యాక చారులత లయోలా కాలేజ్ ఆఫ్ సోషల్ సైన్సెస్ నుంచి హ్యూమన్ రిసోర్సెస్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది.
ఐదేళ్ల పాటు ప్రేమించుకుని - కాలేజీలు మారినా వారి మధ్య ప్రేమ అలానే సాగింది. అలా 5 సంవత్సరాల పాటు ప్రేమించుకుని, ఆ తర్వాత ఇళ్ళల్లో ఒప్పించి ఒకటయ్యారు చారులత, సంజు. 2018లో డిసెంబర్ 22న వివాహం చేసుకున్నారు. అయితే వీరిద్దరిలో ఒకరు హిందూ, మరొకరు క్రిస్టియన్ కావడంతో రెండు మతాల పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. అయితే ఫేస్ బుక్ సహాయంతో సంజుతో స్నేహాన్ని పెంచుకున్న చారులత సోషల్ మీడియాలో మాత్రం పెద్దగా యాక్టివ్ గా ఉండరు. తన వ్యక్తిగత విషయాలను అతి తక్కువగా మీడియాతో పంచుకుంటుంటారు. కాగా, చారులత తండ్రి, B. రమేశ్ కుమార్, ప్రముఖ మలయాళ వార్తాపత్రికలో చీఫ్ న్యూస్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆమె తల్లి రాజశ్రీ రమేశ్ LIC ఇండియాలో ఉద్యోగం చేస్తున్నారు. చారులత కూడా వ్యాపారవేత్తగా రాణించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇకపోతే ప్రస్తుతం జరుగుతున్న ఐపిఎల్ 17 వ సీజన్లో సంజూ అదరగొడుతున్నాడు. శాంసన్ కెప్టెన్సీలో రాజస్థాన్ సేన మొత్తం 10 మ్యాచులలో 8 విజయాలతో పాయింట్ల(16 పాయింట్లు) పట్టికలో రెండో స్థానంలో ఉంది.
సంజూ శాంసన్ - ది సైలెంట్ ఫైటర్ - T20 world cup 2024
చెన్నై కెప్టెన్సీని రిజెక్ట్ చేసిన సంజూ ? వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అశ్విన్