T20 World Cup 2024 : దాదాపు రెండు నెలల సుధీర్ఘ ప్రయాణం తర్వాత ఐపీఎల్ 2024 లీగ్ స్టేజ్ ముగిసింది. ప్లే ఆఫ్స్‌కు వేళైంది. మరో ఆరు రోజుల్లో ఈ సీజన్ విజేత ఎవరో కూడా తేలనుంది. ఇక ఈ మెగా లీగ్ ముగిశాక భారత ఆటగాళ్లు టీ20 వరల్డ్ కప్ కోసం సన్నద్ధమవ్వనున్నారు. ఈ క్రమంలో ఓ అసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.
అదేంటంటే, లీగ్ స్టేజ్ ముగిశాక పాయింట్ల టేబుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లకు ఓ ప్రత్యేకత ఉంది. వచ్చే నెల భారత్ తరఫున టీ20 వరల్డ్ కప్ ఆడబోయే 15 మంది ప్లేయర్స్‌లో ఒక్కరు కూడా అగ్రస్థానాల్లో నిలిచిన ఈ రెండు జట్లలో లేరు. ఒక్క కేకేఆర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న రింకూ సింగ్ మాత్రమే రిజర్వ్ ప్లేయర్‌గా నిలిచాడు. ఇక ఈ సీజన్లో చివరి స్థానంలో ఉన్న ముంబయి ఇండియన్స్‌లో మాత్రం అత్యధికంగా నలుగురు, దిల్లీ క్యాపిటల్స్‌లో ముగ్గురు ప్లేయర్ ఉన్నారు. ఇంకా ఈ సీజన్‌లోని మొత్తం నాలుగు జట్ల నుంచి ఒక్క ఇండియన్ ప్లేయర్ కూడా వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.
కోలకతా నైట్ రైడర్స్(KKR), సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH)తో పాటు గుజరాత్ టైటాన్స్(GT), లఖ్‌నవూ సూపర్ జెయింట్స్(LSG) నుంచి ఒక్కరూ లేరు. రాజస్థాన్ రాయల్స్ టీమ్ నుంచి జైశ్వాల్, సంజూ శాంసన్, యుజ్వేంద్ర చాహల్ ఉన్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి కోహ్లీ, సిరాజ్ చోటు దక్కించుకొన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ నుంచి శివమ్ దూబే, రవీంద్ర జడేజా వరల్డ్ కప్‌లో చోటు దక్కించుకున్నారు. దిల్లీ క్యాపిటల్స్ నుంచి రిషభ్ పంత్, పటేల్, కుల్దీప్ ఉన్నారు. ముంబయి ఇండియన్స్ నుంచి రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య, సూర్య కుమార్ యాదవ్, బుమ్రా జట్టులో ఉన్నారు.
కాగా, జూన్ 5 నుంచి ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024లో టీమ్ ఇండియా పోరాటం ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌ను ఐర్లాండ్ జట్టుతో ఆడనుంది. అనంతరం జూన్ 9వ తేదీన దాయాది పాకిస్థాన్ జట్టుతో తలపడనుంది.
'R' - ఈ నాలుగు జట్లలో కామన్ పాయింట్ గమనించారా? - IPL 2024 Play Offs
కోల్‌కతా వర్సెస్ సన్‌రైజర్స్ - క్వాలిఫైయర్ మ్యాచ్‌లో పరుగుల వీరులు వీరే! - IPL 2024