IPL 2024 RAJASTHAN ROYALS VS MUMBAI INDIANS : ఐపీఎల్ 2024లో భాగంగా తాజాగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ గెలిచింది. ముంబయి ఇండియన్స్ పై 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. యశస్వి జైశ్వాల్(60 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్స్‌ల సాయంతో 104 పరుగులు) ఒక్కడే సెంచరీతో చెలరేగడంతో 179 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ ఈజీగా ఛేదించింది. 18.4 ఓవర్లలో వికెట్ కోల్పోయి 183 పరుగులు చేసింది. జాస్ బట్లర్(25 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 35), సంజు శాంసన్(28 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 38 పరుగులు) చేశారు. ముంబయి బౌలర్లలో పీయూష్ చావ్లా ఓ వికెట్ దక్కించుకున్నాడు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. ముంబయి బ్యాటర్లలో తిలక్ వర్మ(45 బంతుల్లో 5 ఫోర్ల 3 సిక్స్‌ల సాయంతో 65) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. నెహాల్ వధేరా(24 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 49) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. నబి(23), సూర్య కుమార్ యాదవ్(10), రోహిత్ శర్మ (6), హార్దిక్ పాండ్య(10) స్కోర్ చేశారు. రాజస్థాన్ బౌలర్లలో సందీప్ శర్మ ఐదు వికెట్లతో అదిరే ప్రదర్శన చేశాడు. బౌల్ట్ 2, అవేశ్ ఖాన్, చాహల్ తలో వికెట్ దక్కించుకున్నారు.
తొలి బౌలర్‌గా చాహల్ రికార్డ్ - ఈ మ్యాచ్‌లో యుజ్వేంద్ర చాహల్ అరుదైన ఘనతను సాధించాడు. ఐపీఎల్‌లో 200 వికెట్ల మైలు రాయిని అందుకున్న తొలి బౌలర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో నబీని ఔట్ చేసి ఈ అరుదైన మార్క్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇకపోతే ఈ మెగా లీగ్‌లో ఇప్పటివరకు 152 మ్యాచ్‌లు ఆడి 7.70 ఎకానమీతో 200 వికెట్లు తీశాడు చాహల్. చాహల్ తర్వాతి స్ధానంలో వెస్టిండీస్ మాజీ క్రికెటర్ డ్వేన్ బ్రావో(183 వికెట్లు) ఉన్నాడు. కాగా, చాహల్ తన అద్బుతమైన ప్రదర్శనతో టీ20 వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉందని క్రికెట్ అభిమానులు అంటున్నారు..
దిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్ - ఆ స్టార్ ఆల్‌రౌండర్ దూరం - IPL 2024
ఫీల్డ్ అంపైర్‌తో గొడవ - కోహ్లీకి గట్టి షాకిచ్చిన ఐపీఎల్ బాసులు! - IPL 2024 RCB VS KKR