IPL 2024 Jersy Colours : ఐపీఎల్ సమరం మొదలయ్యేందుకు మరో నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ అద్బుతమైన మెగా లీగ్ మొదటి మ్యాచ్‌లో(మార్చి 22) చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తలపడనున్నాయి. అయితే ఈ ఐపీఎల్ ప్రారంభానికి ముందే పంజాబ్ కింగ్స్ కొత్త జెర్సీని రీసెంట్గా చండీగఢ్‌లోని ఎలాంటే మాల్లో విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్, జట్టు యజమాని ప్రీతి జింటా కూడా పాల్గొన్నారు.
అయితే తాాజా సీజన్ కోసం తమ పాత జెర్సీని మార్చి కొత్తది తీసుకురావడంపై పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు ప్రీతి జింటా. 2009 నుంచి 2013 వరకు రెడ్ అండ్ గ్రే కలర్ మిక్సింగ్‌తో ఉన్న తమ పాత జెర్సీని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ఎందుకు బ్యాన్ చేసిందో ప్రీతి జింటా వివరించారు. వైట్ అండ్ గ్రే సిల్వర్ మిక్సింగ్ కలర్ బాల్ కలర్‌ను పోలి ఉండటంతోనే బీసీసీఐ తమ పాత జెర్సీని నిషేధించిందని తెలిపారు. అలానే ఇతర ఫ్రాంఛైజీలు కూడా తమ జెర్సీలపై ఈ రంగులు ఉండకుండా ఉండేలా బీసీసీఐ నిర్ణయం తీసుకుందని చెప్పారు. అందుకే తమ ఫ్రాంచైజీ పాత జెర్సీ కలర్‌ను మార్చాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఇప్పుడు కొత్త జెర్సీ పూర్తిగా రెడ్ కలర్లోకి మారినట్లు తెలిపారు. ఈ రెడ్ కలర్ జెర్సీనే ధరించి తమ ఆటగాళ్లు మైదానంలోకి అడుగుపెట్టనున్నట్లు చెప్పారు.
ఇక ఈ లీగ్‌లో పంజాబ్ కింగ్స్ రాణించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు ప్రీతి జింటా. మార్చి 23న మొహాలీలోని మహారాజా యదవీందర్ సింగ్ ఇంటర్నేషన్ క్రికెట్ స్డేడియంలో దిల్లీ క్యాపిటల్స్‌తో పంజాబ్ కింగ్స్ బరిలోకి దిగుతుంది. ఇకపోతే ఐపీఎల్ 2024 సీజన్ వేలంలో పంజాబ్ కింగ్స్ చాలా మంది ఆటగాళ్లను జట్టులోకి చేర్చుకుంది. ఎందుకంటే గత సీజన్లో పంజాబ్ కింగ్స్ అంతగా రాణించలేదు. ప్లేఆఫ్స్ కూడా అర్హత సాధించలేదు. కనీసం ఈ సీజన్లో అయినా పంజాబ్ కింగ్స్ కచ్చితంగా ట్రోఫీని గెలుచుకుంటుందని ప్రీతి ఆశాభావం వ్యక్తం చేశారు.
-
Our threads, our pride! ❤️#SherSquad, describe saddi navi jersey with an emoji. ⤵️#SaddaPunjab #PunjabKings #JazbaHaiPunjabi pic.twitter.com/dIVsT1acPE
— Punjab Kings (@PunjabKingsIPL) March 17, 2024
WPL 2024 'ఇకపై అలా అనండి' - ఫ్యాన్స్‌కు కెప్టెన్ స్మృతి మంధాన సందేశం