IPL 2024 PlayOffs List : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ ప్రారంభానికి కొద్ది రోజులే ఉన్న నేపథ్యంలో ఇప్పటివరకు ఈ మెగాలీగ్‌లో అత్యథికంగా ప్లేఆఫ్స్‌కు వెళ్లిన జట్లు ఏంటో చూద్దాం.
Chennai Super Kings : ఐపీఎల్లో ఎక్కువ సార్లు ప్లేఆఫ్స్ చేరిన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ ఉంది. 14 సీజన్లలో బరిలోకి దిగి 12సార్లు ప్లేఆఫ్స్‌కు చేరింది.అత్యధిక (10) సార్లు ఫైనల్స్ ఆడిన రికార్డ్ చెన్నైదే. 2010, 2011, 2018, 2021, 2023 ట్రోఫీని గెలుచుకుంది. ఐదుసార్లు 2008, 2012, 2013, 2015, 2019 రన్నరప్‌గా నిలిచింది.
Mumbai Indians : 16 సీజన్లలో బరిలోకి దిగిన ముంబయి ఇండియన్స్ 10సార్లు ప్లేఆఫ్స్‌కు, ఆరుసార్లు ఫైనల్స్‌కు అర్హత సాధించింది. 2013, 2015, 2017, 2019, 2020లో ట్రోఫీని ముద్దాడింది. ఈ ఐదు కూడా రోహిత్ కెప్టెన్సీలోనివే కావడం విశేషం.
Royal Challengers Bangalore : ఆర్సీబీకి ఎంత క్రేజ్ ఉన్నా ఆ జట్టు మాత్రం ఇప్పటివరకు టైటిల్‌ను అందుకోలేదు. 16 సీజన్లలో బరిలోకి దిగి ఎనిమిదిసార్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. మూడుసార్లు ఫైనల్స్‌కు వెళ్లింది. 2009, 2011, 2016 రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
Kolkata Knight Riders : ఇప్పటివరకు ఈ జట్టు 16 సీజన్లు ఆడి 7 సార్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. మూడుసార్లు ఫైనల్స్‌కు వెళ్లి రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచి ట్రోఫీని ముద్దాడింది. 2012 గంభీర్ సారథ్యంలో, 2014లో టైటిల్‌ను అందుకుంది. 2021లో సీఎస్కే చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది.
-
Ten tables. 1⃣ Choice
— IndianPremierLeague (@IPL) March 10, 2024
Which table would you pick 👀#TATAIPL pic.twitter.com/vSFVrbIOiY
Sunrisers Hyderabad : ఈ జట్టు ఇప్పటివరకు 11 సీజన్లలో పాల్గొని ఆరుసార్లు ప్లేఆఫ్స్‌కు వెళ్లింది. 2016 ఫైనల్‌లో ఆర్సీబీపై గెలిచి తొలిసారి ట్రోఫీని అందుకుంది. 2018లో అద్భుతంగా ఆడి ఫైనల్ చేరినా రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 2020లో 3వ స్థానం, 2013, 2017, 2019లో 4వ స్థానంలో నిలిచింది.
Delhi Capitals : ఇప్పటివరకు 16 సీజన్లలో ఆడిన ఈ జట్టు ఆరు సార్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఒక్కసారి 2020లో ఫైనల్‌కు చేరింది. అందులో ముంబయిపై ఓడి రన్నరప్‌గా నిలిచింది. 2009, 2012, 2019, 2021లో 3వ స్థానం, 2008లో 4వ స్థానంలో నిలిచింది.
ఇక ఇతర జట్లలో అత్యధికంగా రాజస్థాన్ రాయల్స్ 14 సీజన్లలో ఐదుసార్లు ప్లేఆఫ్స్‌కు, గుజరాత్ టైటాన్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ఆడిన రెండు సీజన్లలోనూ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి. ఇక పంజాబ్ కింగ్స్ 16 సీజన్లలో ఆడి కేవలం రెండుసార్లు మాత్రమే ప్లేఆఫ్స్‌కు వెళ్లింది.