ETV Bharat / sports

ఓ వైపు ఆసక్తి - మరోవైపు టెన్షన్​ - సీఎస్కే కొత్త కెప్టెన్ అతడేనా? - dhoni new role ipl 2024

IPL 2024 Dhoni Retirement : ధోనీ న్యూ రోల్ ట్వీట్​తో అభిమానుల్లో ఓ వైపు టెన్షన్​ మరోవైపు ఆసక్తి విపరీతంగా పెరిగిపోతుంది. అతడి బ్యాటర్​, కెప్టెన్​గా గుడ్​బై చెప్పేసి మెంటార్​గా బాధ్యతలు చేపట్టనున్నాడని బయట కథనాలు వస్తున్నాయి. కొత్త కెప్టెన్​గా యంగ్ ఓపెనర్ పేరు వినిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

సీఎస్కే కొత్త కెప్టెన్ అతడేనా?
సీఎస్కే కొత్త కెప్టెన్ అతడేనా?
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 5, 2024, 1:43 PM IST

Updated : Mar 5, 2024, 2:21 PM IST

IPL 2024 Dhoni Retirement : ఐపీఎల్‌ 2024 సీజన్‌కు ముందు టీమ్​ ఇండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథి ఎం ఎస్‌ ధోనీ సంచలన నిర్ణయం తీసుకోనున్నాడా? అంటే అవుననే అనుమానమే క్రికెట్ వర్గాల్లో బాగా ఎక్కువ వినిపిస్తోంది. ఎందుకంటే అతడు కొత్త సీజన్​లో న్యూ రోల్ అంటూ తాజాగా సోషల్‌ మీడియాలో చేసిన పోస్టు ఈ వార్తలకు మరింత ఊతమిస్తోంది. అతడు బ్యాటర్​గా, కెప్టెన్​గా ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పాలని డిసైడ్ అయినట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికే తన డెసిషన్​ను చెన్నై యాజమాన్యానికి చెప్పినట్లు క్రికెట్ వర్గాల్లో మాటలు వినిపిస్తున్నాయి. ఇకపై మహీ సీఎస్‌కే మెంటార్‌గా సరికొత్త బాధ్యతలు చేపట్టనున్నట్లు ఇంగ్లీష్ మీడియాల్లో కథనాలు కూడా వస్తున్నాయి.

దీంతో ఇప్పుడంతా మహీ ఏ పాత్రలో కనిపించనున్నాడా అని సీఎస్కే, ధోనీ ఫ్యాన్స్​ తెగ ఆలోచించేస్తున్నారు. అందరిలోనూ ఆసక్తి ఎక్కువైపోతుందా. పైగా ధోనీ మాత్రమే కాదు చైన్నై సూపర్ కింగ్స్ కూడా చేసిన ట్వీట్​తో అభిమానుల్లో మరింత సస్పెన్స్‌ పెరిగింది. యాజమాన్యం ఏమో కొత్త పాత్రలో లియో అంటూ రాసుకొచ్చింది. దీంతో ఈ సీజన్‌లో మహీ మెంటార్‌గా కొత్త బాధ్యతలు చేపట్టనున్నాడని అంతా ఫిక్సైపోతున్నారు.

కాగా, చెన్నై జట్టు ఇప్పటికే చెపాక్ స్టేడియంలో ట్రెయినింగ్ క్యాంప్‌ను ప్రారంభించింది. అయితే మహీ మాత్రం ఇంకా ఈ ట్రెయినింగ్ క్యాంప్‌లో చేరలేదని అంటున్నారు. ఇవన్నీ కూడా ఐపీఎల్‌కు ధోనీ గుడ్‌బై చెప్పే సూచనలుగా ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ మహీ కెప్టెన్​గా తప్పుకుంటే అతడి స్థానంలో యువ ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని కూడా జోరుగా ప్రచరాం సాగుతోంది. చూడాలి మరి ఏం జరగబోతుందా, మహీ కొత్త రోల్ ఏంటో?

ఇకపోతే మార్చి 22 నుంచి ఐపీఎల్‌ - 2024 సీజన్‌ మొదలు కానుంది. తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ -రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. ఇందులో గెలిచి మంచి శుభారంభం చెయ్యాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి.

ధోని కెప్టెన్సీ వదిలేస్తున్నాడా? న్యూ రోల్‌ అంటూ ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌

తెలుగు స్టార్ షట్లర్​ సాయి ప్రణీత్‌ సాధించిన రికార్డులివే

Last Updated : Mar 5, 2024, 2:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.