ETV Bharat / sports

సీఎస్కేపై పంజాబ్​ విజయం - మ్యాచ్​లో నమోదైన రికార్డులివే - IPL 2024 CSK VS PBKS

IPL 2024 CSK VS PBKS : ఐపీఎల్ 2024లో భాగంగా తాజాగా జరిగిన మ్యాచ్​లో చెన్నై సూపర్ కింగ్స్​పై పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. హోం గ్రౌండ్​లోనే చెన్నైను ఓడించింది. అయితే ఈ పోరులో పలు రికార్డులు నమోదయ్యాయి. అవేంటంటే?

.
.
author img

By ETV Bharat Telugu Team

Published : May 2, 2024, 8:00 AM IST

IPL 2024 CSK VS PBKS : ఐపీఎల్ 2024లో భాగంగా తాజాగా జరిగిన మ్యాచ్​లో చెన్నై సూపర్ కింగ్స్​పై పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. హోం గ్రౌండ్​లోనే చెన్నైను ఓడించింది. అయితే ఈ పోరులో పలు రికార్డులు నమోదయ్యాయి.

కెప్టెన్​గా రుతురాజ్ రికార్డ్ - ఈ మ్యాచ్‌లో రుతురాజ్ అర్ధ శతకంతో మెరిశాడు. 48 బంతులు ఎదుర్కొన్న అతడు 5 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 62 పరుగులు సాధించాడు. అలానే ఓ అరుదైన రికార్డును అందుకున్నాడు. ఒక ఐపీఎల్ సీజ‌న్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన చెన్నై కెప్టెన్‌గా గైక్వాడ్ నిలిచాడు. ఈ సీజన్​లో 10 మ్యాచ్‌లు ఆడి 509 ప‌రుగులు చేశాడు. గతంలో ఈ రికార్డు మాజీ కెప్టెన్​ ధోనీ పేరిట ఉండేది. అతడు 2013 సీజన్​లో 461 ప‌రుగులు చేశాడు. ఇప్పుడు తాజా సీజ‌న్‌లో రుతురాజ్ వల్ల ధోనీ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్ అయింది.

ధోనీ సిక్సర్ రికార్డ్​ - ఈ మ్యాచ్​లో ధోనీ ఆఖరి ఓవర్లో ఓ ఫోర్‌, సిక్స్‌ బాది 14 పరుగులు చేశాడు. చివరి బంతికి రనౌటయ్యాడు. అయితే మహీ ఈ సీజన్​ 2024లో 7 ఇన్నింగ్స్‌ల్లో నాటౌట్‌గా నిలిచాడు. అతడి వికెట్ ఏ బౌలర్‌కు దక్కలేదు. కానీ 8వ ఇన్నింగ్స్‌లో(తాజా మ్యాచ్​) మాత్రం వికెట్ కోల్పోయాడు. ఇన్నింగ్స్ చివరి బంతికి రెండు పరుగులు తీసే క్ర‌మంలోనే ధోనీ రనౌట్ అవ్వాల్సి వచ్చింది.

రెండో జట్టుగా పంజాబ్ కింగ్స్ - ఈ విజ‌యంతో పంజాబ్ జ‌ట్టు ఓ రికార్డ్ సాధించింది. సీఎస్కేపై ఎక్కువ సార్లు గెలిచిన రెండో జట్టుగా నిలిచింది. 2021 నుంచి 2024 వరకు వ‌రుస‌గా ఐదుసార్లు చెన్నైని ఓడించింది పంజాబ్ కింగ్స్. అంతకుముందు 2018 - 2019 వరకు ముంబయి ఐదుసార్లు సీఎస్కేపై గెలిచింది. దిల్లీ క్యాపిటల్స్​ 2020 -2021 మధ్యలో దిల్లీ క్యాపిటల్స్ నాలుగు సార్లు, 2021-2023 మధ్యలో రాజస్థాన్ రాయల్స్ చెన్నైపై నాలుగు విజయాలు సాధించాయి. కాగా, గత ఐదు మ్యాచుల్లో సీఎస్కేపై పంజాబ్​ వరుసగా 7 వికెట్లు, 4 వికెట్లు, 11 పరుగులు, 54 పరుగులు, 6 వికెట్ల తేడాతో గెలిచింది.

ఇకపోతే హోంగ్రౌండ్​లోనే సీఎస్కేను ముంబయి ఇండియన్స్​ 5 సార్లు ఓడించగా పంజాబ్ కింగ్స్ నాలుగు సార్లు ఓడించింది. కోల్​కతా నైట్​ రైడర్స్​ 3 సార్లు సీఎస్కేపై గెలిచింది.

టీ20 వరల్డ్‌ కప్‌ కోసం డ్రాప్ ఇన్ పిచ్‌లు - అసలు ఈ కొత్త టెక్నాలజీ ఏంటంటే? - ICC T20 World Cup 2024

చెన్నెకు పంజాబ్​ పంచ్​ - వరుసగా రెండో విజయం - IPL 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.