IPL 2024 CSK Dhoni NO.9 Batting : ప్రస్తుత సీజన్లో ధోనీ లోయర్ ఆర్డ్లో వస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్గా నెం.9 స్థాయనంలో బ్యాటింగ్ కూడా చేశాడు. దీంతో ఫ్యాన్స్ నిరాశకు గురౌతున్నారు. బ్యాటింగ్ ఆర్డర్‌లో మహీ వీలైనంత వెనక్కి జరుగుతున్నాడని విమర్శలు చేస్తున్నారు. మాజీలు కూడా ఇదే అభిప్రాయపడుతున్నారు. మహీ బ్యాటింగ్‌లో ముందుకు రాలేకపోతే అతడిని వైదొలిగించి ఓ అదనపు బౌలర్‌ను ఆడించాల్సిందని మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు.
అయితే తాజాగా మహీ చివర్లో బ్యాటింగ్ ఎందుకు వస్తున్నాడో తెలిసింది. తప్పనిసరి పరిస్థితిలోనే ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌లో వెనక్కు వెళ్లినట్లు అంటున్నారు. ఈ ఐపీఎల్‌లో మొదటి నుంచి అతడు తొడ కండర గాయంతోనే ఆడుతున్నాడట. అందుకే అతడు ఎక్కువ సేపు పరిగెత్తలేకే ఆఖరిలో వస్తున్నాడని సీఎస్కే వర్గాలు తెలిపాయి.
వాస్తవానికి ఈ ఐపీఎల్ మొదలవ్వక ముందు నుంచే మహీ గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. కానీ టీమ్‌లో రెండో వికెట్ కీపర్ డేవిడ్ కాన్వే కూడా గాయపడటం వల్ల తప్పనిసరి స్థితిలో మహీనే బరిలోకి దిగాల్సి వచ్చిందట. అందుకే ఓవైపు మందులు వాడుతూనే వీలైనంతగా తక్కువ పరిగెత్తేలా మహీ జాగ్రత్తలు తీసుకుంటూ ఆడుతున్నాడని తెలిసింది. "మేం మా బి టీమ్‌తోనే బరిలోకి దిగుతున్నాం. మహీని విమర్శించే వారికి అతడు జట్టు కోసం చేస్తున్న త్యాగం గురించి తెలీదు" అని సీఎస్కే వర్గాలు పేర్కొన్నాయి.
గత ఐపీఎల్‌లోనూ మోకాలి గాయంతోనే మహీ ఆడి కప్పును గెలిచాడు. అనంతరం సీజన్ పూర్తయ్యాక సర్జరీ చేయించుకున్నాడు. ప్రస్తుతం అది పూర్తిగా నయమైపోయింది. కానీ కండర గాయం మాత్రం కాస్త ఇబ్బంది పెడుతోంది. అందుకే అతడు చురుగ్గా బ్యాటింగ్‌లో ముందుకు రాలేకపోతున్నాడు. ప్రాక్టీస్‌లో కూడా ధోనీ పరుగెత్తట్లేదు. కేవలం బంతిని బలంగా బాదడంపైనే ఫోకస్ పెడుతున్నాడు.
CSK Points Table : ఇకపోతే సీఎస్కే ప్రస్తుతం 11 మ్యాచులు ఆడి ఆరు విజయాలు సాధించింది. పాయింట్ల పట్టికలో 12 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది.
-
Dharamshala checklist ✅
— Chennai Super Kings (@ChennaiIPL) May 7, 2024
You see 🏔️
You click 📸#WhistlePodu #Yellove🦁💛 pic.twitter.com/qfS1GEIbJP
కోల్‌కతా ప్లేయర్స్‌కు తప్పని తిప్పలు - రెండు సార్లు ఫ్లైట్ దారి మళ్లింపు! - IPL 2024 KKR
రోహిత్‌కు ఏమైంది? - కలవరపెడుతున్న హిట్ మ్యాన్ ఫామ్! - IPL 2024 Rohit sharma