IPL 2024 CSK : మరో రోజులో ఐపీఎల్ 2024 సీజన్ గ్రాండ్‌గా ప్రారంభంకానుంది. సీఎస్కే - ఆర్సీబీ మ్యాచ్‌తో పోరు ప్రారంభంకానుంది. ధోనీ సారథ్యంలో చెన్నై బరిలోకి దిగనుంది. అయితే ఈ మెగా లీగ్‌లో ఏకంగా పది సార్లు ఫైనల్ చేరి ఐదు టైటిళ్లు సాధించిన జట్టు సీఎస్కే. ఇప్పుడు మరో ట్రోఫీ లక్ష్యంగా ఎంట్రీ ఇస్తోంది.
బలాల విషయానికొస్తే - జట్టు అతి పెద్ద బలం కెప్టెన్ ధోనీనే. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా అతడి సామర్థ్యం తెలిసిందే. బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. రుతురాజ్, రచిన్ రవీంద్ర, శివమ్ దూబె, డరిల్ మిచెల్, మొయిన్ అలీ, జడేజా, రహానె వంటి వారు ఉన్నారు. దీపక్ చాహర్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సమీర్ రిజ్వీ, శార్దూల్ ఠాకూర్ కూడా బ్యాట్‌తో మంచిగా రాణించగలరు. బౌలింగ్ అంత అద్భుతంగా లేకపోయినా చెన్నై పిచ్ పరిస్థితులను మంచిగా ఉపయోగించుకునే బౌలర్లు ఉన్నారు. జడేజా, మొయిన్ అలీ, శాంట్నర్, తీక్షణ రూపంలో మంచి స్పిన్నర్లు ఉన్నారు. శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్‌పాండే, దీపక్ చాహర్, హంగార్గేకర్, ముకేశ్ చౌదరిలతో కూడిన పేస్ విభాగం గట్టిగానే కనిపిస్తోంది. రచిన్ రవీంద్ర కూడా బాల్‌తో రాణించగలడు. తెలుగుకుర్రాళ్లు అవనీశ్ రావు, షేక్ రషీద్ మంచిగా రాణించాలని ఆరాటపడుతున్నారు.
బలహీనతల విషయానికొస్తే కీలక ఓపెనింగ్ బ్యాటర్ డెవాన్ కాన్వే గాయం వల్ల సగం మ్యాచ్‌లకు దూరం. గత సీజన్లో అతడు 16 మ్యాచ్‌ల్లో 51.69 యావరేజ్‌తో 672 రన్స్ సాధించాడు. శివమ్ దూబె ఫిట్‌నెస్ సమస్యను ఎదుర్కొంటున్నాడు. రహానె పేలవ ఫామ్‌లో ఉన్నాడు. ధోనీకి సర్జరీ జరిగింది. ఎలా ఆడతాడో చూడాలి. కీలక ఫాస్ట్‌బౌలర్ పతిరన గాయం వల్ల దూరమయ్యే ఛాన్స్ ఉంది. అతడి స్థానంలో మరొకడు కనిపించడం లేదు. బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ కూడా గాయం వల్ల ఇబ్బంది పడుతున్నాడు.
-
We have arrived! Here are the stories on which the Kings Arena stands!🦁📹
— Chennai Super Kings (@ChennaiIPL) March 20, 2024
Watch the first episode of All Things Yellove exclusively out now on our website! 🥳#WhistlePodu #AllThingsYellove 🦁💛
స్వదేశీ ఆటగాళ్లు : ధోనీ, శివమ్ దూబె, జడేజా, హంగార్గేకర్, శార్దూల్ ఠాకూర్, అజయ్ మండల్, నిశాంత్ సింధు, రహానె, షేక్ రషీద్, రుతురాజ్ గైక్వాడ్, అవనీష్ రావు, సమీర్ రిజ్వీ, తుషార్ దేశ్‌పాండే, దీపక్ చాహర్, సిమర్‌జీత్ సింగ్, ప్రశాంత్ సోలంకి, ముకేశ్ చౌదరి
విదేశీయులు : డరిల్ మిచెల్, రచిన్ రవీంద్ర, శాంట్నర్, తీక్షణ, మొయిన్ అలీ, పతిరన, ముస్తాఫిజుర్.
ఐపీఎల్ ఫైనల్ ఓడిన కెప్టెన్లు గుర్తున్నారా?- లిస్ట్‌లో సచిన్, విరాట్ ఇంకా ఎవరంటే?