ETV Bharat / sports

IPL 2024 టైటిల్‌ వేటకు 10 టీమ్స్‌ కెప్టెన్లు రెడీ - ఎవరి సక్సెస్‌ రేటు ఎంత?

IPL 2024 Captains Win Percentage : ఐపీఎల్ 2024కి కొద్ది రోజులు ఉందనగా, దాదాపు అన్ని ఫ్రాంచైజీలు తమ కెప్టెన్‌లను అనౌన్స్‌ చేశాయి. కొన్ని టీమ్‌లను పాత కెప్టెన్‌లే నడిపించనుండగా, మరి కొన్ని టీమ్‌లకు కొత్త సారథులు వచ్చారు. ఈ ఐపీఎల్‌లో పోటీ పడుతున్న పది జట్ల కెప్టెన్‌లు ఎవరు? ఎన్నిసార్లు తమ టీమ్‌ను ఫైనల్‌కు చేర్చారు? వీరి సక్సెస్‌ రేటు ఎంత? వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం.

IPL 2024 టైటిల్‌ వేటకు 10 టీమ్స్‌ కెప్టెన్లు రెడీ - ఎవరి సక్సెస్‌ రేటు ఎంత?
IPL 2024 టైటిల్‌ వేటకు 10 టీమ్స్‌ కెప్టెన్లు రెడీ - ఎవరి సక్సెస్‌ రేటు ఎంత?
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 21, 2024, 6:39 AM IST

IPL 2024 Captains Win Percentage : మరో రోజులో ఐపీఎల్ 2024 సీజన్ గ్రాండ్​గా ప్రారంభం కానుంది. ఐపీఎల్ 2024కు కొద్ది రోజులు ఉందనగా, దాదాపు అన్ని ఫ్రాంచైజీలు తమ కెప్టెన్‌లను అనౌన్స్‌ చేశాయి. కొన్ని టీమ్‌లను పాత కెప్టెన్‌లే నడిపించనుండగా, మరి కొన్ని టీమ్‌లకు కొత్త సారథులు వచ్చారు. ఈ ఐపీఎల్‌లో పోటీ పడుతున్న పది జట్ల కెప్టెన్‌లు ఎవరు? ఎన్నిసార్లు తమ టీమ్‌ను ఫైనల్‌కు చేర్చారు? వీరి సక్సెస్‌ రేటు ఎంత? వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం.

  • చెన్నై సూపర్ కింగ్స్: ఎంఎస్ ధోనీ

ఐపీఎల్ హిస్టరీలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్‌ అయిన చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఈ సీజన్‌లో కూడా ధోనీ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. కెప్టెన్‌ కూల్‌ ఇప్పటి వరకు చెన్నైకు ఐదు టైటిల్స్‌ అందించాడు. అలానే ఐదు ఫైనల్స్‌ ఓడిపోయాడు. మొత్తం ఐపీఎల్‌ మ్యాచ్‌లలో ధోని కెప్టెన్సీలో సక్సెస్‌ రేటు 59.19గా ఉంది. మొత్తం ధోని 225 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా ఉన్నాడు.

  • దిల్లీ క్యాపిటల్స్: రిషబ్ పంత్

ఐపీఎల్‌ 17వ సీజన్‌లో దిల్లీ క్యాపిటల్స్‌కు రిషబ్‌ పంత్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. 2021లో రెగ్యులర్‌ కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ గాయంతో ఐపీఎల్‌ నుంచి వైదొలగడంతో పంత్‌ కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు. 2022లో కూడా కెప్టెన్‌గా కొనసాగాడు. ఆ తర్వాత కార్‌ యాక్సిడెంట్‌లో గాయపడి క్రికెట్‌కి దూరమయ్యాడు. ఇప్పుడు తిరిగి ఢిల్లీ కెప్టెన్‌గా బరిలో దిగుతున్నాడు. రిషబ్‌ పంత్‌ నేతృత్వంలో ఢిల్లీ ఒక్కసారి కూడా ఫైనల్ చేరలేదు. అయితే ఐపీఎల్‌లో కెప్టెన్‌గా రిషబ్‌ పంత్ సక్సెస్‌ రేటు 55 శాతంగా ఉంది. పంత్‌ ఇప్పటి వరకు కేవలం 30 మ్యాచ్‌లకే కెప్టెన్సీ చేశాడు.

  • గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్‌ గిల్

గుజరాత్‌ టైటాన్స్‌ నుంచి హార్దిక్‌ పాండ్యా ముంబయి ఇండియన్స్‌కు వెళ్లిపోవడంతో శుభ్‌మన్‌ గిల్ కెప్టెన్‌ అయ్యాడు. మొదటిసారి ఐపీఎల్‌ టీమ్‌కు గిల్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

  • కోల్‌కతా నైట్ రైడర్స్: శ్రేయాస్ అయ్యర్

2024 IPL సీజన్‌కు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) శ్రేయాస్ అయ్యర్‌ను తిరిగి తమ కెప్టెన్‌గా నియమించుకుంది. అయ్యర్ గాయంతో దూరమైన తర్వాత 2023 సీజన్‌కు నితీష్ రాణా కెప్టెన్‌గా ఉన్నాడు. ఇప్పటి వరకు అయ్యర్‌ కెప్టెన్సీలో 2020లో దిల్లీ, 2021లో కేకేఆర్‌ ఐపీఎల్‌ ఫైనల్స్‌ ఆడాయి. రెండింట్లోనూ అయ్యర్‌కు ఓటమి తప్పలేదు. ఐపీఎల్ మ్యాచ్‌లలో అయ్యర్‌ సక్సెస్‌ రేటు 50.9 శాతంగా ఉంది. అయర్‌ ఇప్పటి వరకు 55 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.

  • లఖ్​నవూ సూపర్ జెయింట్: కేఎల్ రాహుల్

ఈ సీజన్‌లో కూడా కేఎల్ రాహుల్ లఖ్​నవూ సూపర్ జెయింట్స్ (LSG)కి కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. 2020, 2021 ఐపీఎల్‌ సీజన్‌లో రాహుల్‌ పంజాబ్‌ కింగ్స్‌ ఎలెవన్‌కి కెప్టెన్‌గా ఉన్నాడు. ఆ తర్వాత 2022 నుంచి లక్నోకి కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇప్పటి వరకు రాహుల్ కెప్టెన్సీలో ఏ జట్టు ఫైనల్ చేరలేదు. రాహుల్‌ మొత్తం 51 ఐపీఎల్ మ్యాచ్‌లకు కెప్టెన్సీ చేశాడు, అతని సక్సెస్‌ రేటు 50.98 శాతం.

  • ముంబయి ఇండియన్స్: హార్దిక్ పాండ్యా

2024 ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌కు పాండ్యా కొత్తగా కెప్టెన్‌ అయ్యాడు. అంతకు ముందు గుజరాత్‌ని 2022, 2023 సీజన్‌లో వరుసగా ఫైనల్‌కి చేర్చాడు. 2022లో విజయం సాధించగా, 2023లో ఓటమి పాలయ్యాడు. పాండ్యా మొత్తం 31 ఐపీఎల్‌ మ్యాచ్‌లకు కెప్టెన్సీ చేయగా, అతని సక్సెస్‌ రేటు 73.33గా ఉంది.

  • పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్

పంజాబ్ కింగ్స్ 2024 IPL సీజన్‌కు శిఖర్ ధావన్‌ను కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. 2013లో శిఖర్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. ఆ తర్వాత 2022-23ల 15వ సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ అయ్యాడు. ధావన్‌ కెప్టెన్సీలో ఏ టీమ్ ఐపీఎల్‌ ఫైనల్ ఆడలేదు. ధావన్‌ కెప్టెన్సీ సక్సెస్‌ రేటు 39.28 శాతంగా ఉంది. మొత్తం 28 ఐపీఎల్ మ్యాచ్‌లకు సారథిగా ఉన్నాడు.

  • రాజస్థాన్ రాయల్స్: సంజు శాంసన్

రాజస్థాన్ రాయల్స్ 2024 IPL సీజన్‌లోనూ సంజూ శాంసన్ కెప్టెన్సీలో బరిలో దిగుతోంది. 2021 నుంచి ఇప్పటి వరకు శాంసన్‌ రాజస్థాన్‌ని నడిపిస్తున్నాడు. మొత్తం 45 మ్యాచ్‌లకు సారథిగా వ్యవహరించగా, సక్సెస్‌ రేటు 48.88 శాతంగా ఉంది. శాంసన్‌ నేతృత్వంలో రాజస్థాన్‌ 2022లో ఫైనల్‌ చేరింది. గుజరాత్‌ చేతిలో ఓడిపోయింది.

  • రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డు ప్లెసిస్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కెప్టెన్‌గా ఫాఫ్ డు ప్లెసిస్ కొనసాగుతున్నాడు. 2022 నుంచి ఆర్సీబీని నడిపిస్తున్నాడు. ఇప్పటి వరకు ఫైనల్ చేరలేదు. డు ప్లెసిస్‌ మొత్తం 27 మ్యాచ్‌లకు కెప్టెన్సీ చేయగా, సక్సెస్‌ రేటు 51.85గా ఉంది.

  • IPL 2024 Captains Win Percentage

సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)ను ప్రస్తుత సీజన్‌లో పాట్‌ కమిన్స్‌ ముందుకు నడిపిస్తున్నాడు. మొదటి సారి కమిన్స్‌ ఐపీఎల్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

ఐపీఎల్​లో ఛీర్​ లీడర్సే స్పెషల్ అట్రాక్షన్​ - ఒక్కో మ్యాచ్​కు ఎంత సంపాదిస్తున్నారంటే?

మొట్టమొదటి ఐపీఎల్‌ టైటిల్‌ గెలిచిన ఛాంపియన్స్‌ - ఇప్పుడు ఎక్కడున్నారంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.