ETV Bharat / sports

సగానికిపైగా మ్యాచులు పూర్తి - ఎవరు టాప్​లో ఉన్నారంటే? - IPL 2024 - IPL 2024

IPL 2024 Most Runs and Wickets : ఐపీఎల్‌ 2024లో సగానికి పైగా మ్యాచ్‌లు అయిపోయాయి. కేవలం ఒకే ఒక్క ఓటమితో రాజస్థాన్‌ టేబుల్‌ టాప్‌ పొజిషన్‌లో ఉంది. కేవలం ఒకే ఒక్క గెలుపుతో ఆర్సీబీ టేబుల్‌ అట్టడుగున ఉంది. ఈ నేపథ్యంలో ప్లే ఆఫ్స్​ రేసుతో పాటు ఎక్కువ రన్స్​ ఎవరు చేశారు? ఎక్కువ వికెట్లు ఎవరు తీశాడు? వంటి వివరాలను తెలుసుకుందాం.

.
.
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 23, 2024, 7:05 PM IST

IPL 2024 Most Runs and Wickets : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 17వ సీజన్‌ రికార్డుల మీద రికార్డులు క్రియేట్‌ చేస్తూ, ప్రతి మ్యాచ్‌కు ఉత్కంఠ పెంచుతూ సాగుతోంది. అప్పుడే లీగ్‌లో 38 మ్యాచ్‌లు పూర్తయిపోయాయి. ప్రస్తుత సీజన్‌లో లీగ్‌ దశలోనే 70 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. అదనంగా క్వాలిఫయర్స్‌, ఎలిమినేటర్‌, ఫైనల్స్‌ ఉన్నాయి. ఇప్పుడు 39వ మ్యాచ్‌లో ఏప్రిల్‌ 23న లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడుతున్నాయి. లీగ్‌లో దాదాపు సగానికి పైగా మ్యాచ్‌లు పూర్తయినా ఇప్పటికీ ప్లేఆఫ్స్‌ ఆడే టీమ్‌లపై స్పష్టమైన అవగాహన రాలేదు.

  • ఏ టీమ్‌ ఎక్కడుంది?
    అయితే ప్రస్తుతం పాయింట్స్‌ టేబుల్‌ను పరిశీలిస్తే ప్లే ఆఫ్స్‌ బెర్తులపై ఓ అవగాహనకు రావచ్చు. ప్రస్తుతం రాజస్థాన్‌ రాయల్స్‌ 14 పాయింట్లతో టాప్‌ పొజిషన్‌లో ఉంది. ఆర్‌ఆర్‌ ఆడిన 8 మ్యాచ్‌లలో ఏకంగా 7 విజయాలు అందుకుంది. తర్వాత 10 పాయింట్లతో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ రెండో స్థానంలో ఉంది. కేకేఆర్‌ ఆడిన 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు అందుకుంది. కేకేఆర్‌తో సమానంగా సన్‌రైజర్స్‌ కూడా 10 పాయింట్లు సాధించినా, నెట్‌ రన్‌రేటు తక్కువగా ఉండటంతో మూడో పొజిషన్‌లో ఉంది. సన్‌రైజర్స్‌ కూడా 7 మ్యాచ్‌లలో 5 నెగ్గింది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ 8 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. సీఎస్కే 7 మ్యాచ్‌ల్లో 4 విజయాలు అందుకుంది. లఖ్‌నవూ కూడా చెన్నైతో సమానమే అయినా నెట్‌ రన్‌ రేటుతో ఐదో స్థానానికి పరిమితం అయింది.
  • ప్రధాన పోరు వీరి మధ్యే
    ప్లే ఆఫ్స్‌ బెర్తుల కోసం రాజస్థాన్‌, కోల్‌కతా, సన్‌రైజర్స్‌, చెన్నై, లఖ్‌నవూ మధ్యనే ప్రధాన పోటీ ఉండే అవకాశం ఉంది. ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటే గుజరాత్, ముంబయి, దిల్లీల్లో ఏదో ఒక జట్టు ప్లే ఆఫ్స్‌ ఛాన్స్‌కి పోటీ పడవచ్చు. గుజరాత్‌ 8 మ్యాచ్‌లలో 4 విజయాలతో 8 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. ముంబయి 8 మ్యాచ్‌లలో 3 గెలుపులతో, 6 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. దిల్లీ 8 గేమ్‌లలో 3 విజయాలతో 6 పాయింట్లతో ఎనిమిదో పొజిషన్‌లో ఉంది.

ఈ సీజన్‌ లీగ్‌ దశలో ఇంకా 32 మ్యాచ్‌లు మిగిలున్నాయి. పాయింట్స్‌ టేబుల్‌లో 9వ స్థానంలో పంజాబ్‌ కింగ్స్‌, పదో స్థానంలో ఆర్సీబీ ఉన్నాయి. ఈ రెండు టీమ్‌లకు దాదాపు ప్లేఆఫ్స్‌ అవకాశం లేనట్లు భావించవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరికొన్ని మ్యాచ్‌లు పూర్తయితే ప్లే ఆఫ్స్‌ బెర్తులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

  • ఆరెంజ్‌, పర్పుల్‌ క్యాప్‌ ఎవరివి?
    ఇప్పటికి బ్యాటింగ్, బౌలింగ్‌లో ఇండివిడ్యువల్‌ ప్లేయర్‌ల పర్‌ఫార్మెన్స్‌లో కోహ్లి, బుమ్రా టాప్‌లో ఉన్నారు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఓపెనర్‌ విరాట్‌ ఈ సీజన్‌లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లలో 63.17 యావరేజ్‌తో 379 పరుగులు చేశాడు. ఆరెంజ్‌ క్యాప్‌ హోల్డర్‌గా కొనసాగుతున్నాడు. ముంబయి ఇండియన్స్‌ స్టార్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా 8 మ్యాచ్‌లలో 13 వికెట్లు పడగొట్టాడు. పంజాబ్‌ కింగ్స్‌ బౌలర్‌ హర్షల్‌ పటేల్‌ కూడా 13 వికెట్లతో బుమ్రాతో సమంగా ఉన్నాడు. ఇద్దరూ పర్పుల్‌ క్యాప్‌ షేర్‌ చేసుకుంటున్నారు.
  • అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ - విరాట్‌ కోహ్లీ (113)
  • అత్యధిక సెంచరీలు - బట్లర్‌ (2)
  • అత్యధిక హాఫ్‌ సెంచరీలు - రియాన్‌ పరాగ్‌, శాంసన్‌, క్లాసెన్‌, డికాక్‌ (3)
  • అత్యధిక యావరేజ్​ - రవీంద్ర జడేజా (141)
  • అత్యధిక స్ట్రైక్ రేట్​ - రొమారియో షెపర్డ్‌ (280.00)
  • అత్యధిక సిక్సర్లు - క్లాసెన్‌ (26)
  • అత్యధిక బౌండరీలు - ట్రవిస్‌ హెడ్‌ (39)

బౌలింగ్​లో

  • అత్యధిక వికెట్లు-13 (బుమ్రా, చహల్‌, హర్షల్‌)
  • అత్యధిక బౌలింగ్‌ సగటు - లఖ్​నవూ పేసర్‌ మయాంక్‌ యాదవ్‌ (9.0)
  • అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు - సందీప్‌ శర్మ (5/18) బుమ్రా,యశ్‌ ఠాకూర్‌, సందీప్‌ శర్మ ఈ ముగ్గురు చెరోసారి ఐదు వికెట్ల ప్రదర్శన జేశారు

ఫీల్డ్​ అంపైర్​తో గొడవ - కోహ్లీకి గట్టి షాకిచ్చిన ఐపీఎల్ బాసులు! - IPL 2024 RCB VS KKR

దిల్లీ క్యాపిటల్స్​కు బిగ్​ షాక్​ - ఆ స్టార్ ఆల్​రౌండర్ దూరం - IPL 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.