T20 World Cup Matches Screening: 2024 టీ20 వరల్డ్‌కప్ మజా మూడు వారాల్లో ప్రారంభం కానుంది. ఈ మేరకు ఐసీసీ టోర్నీ ఏర్పాట్లను వేగవంతం చేస్తోంది. వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న ఈ టోర్నీ కోసం యావత్ క్రీడా ప్రపంచం ఆత్రుతగా ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలో భారత అతిపెద్ద సినిమా ఆపరేటర్ కంపెనీ 'పీవీఆర్ సినిమాస్' (PVR Cinemas) క్రికెట్ ఫ్యాన్స్‌కు కొత్త అనుభూతినిచ్చేందుకు ప్లాన్ చేస్తోంది.
ప్రపంచకప్ టోర్నీలో పలు కీలక మ్యాచ్‌లు సిల్వర్ స్క్రీన్‌పై లైవ్ స్ట్రీమింగ్ చేయాలని భావిస్తోంది. దీనిపై పీవీఆర్ సినిమాస్ యాజమాన్యం ఐసీసీతో చర్చలు జరుపుతున్నట్లు కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ నితిన్ సూద్ ఓ సందర్భంలో చెప్పారు. 'ప్రేక్షకులకు ఎల్లప్పుడు దగ్గరగా ఉండాలన్నదే మా లక్ష్యం. గతేడాది భారత్‌లో జరిగిన వన్డే వరల్డ్‌కప్‌నకు భారీగా ప్రేక్షకుల మద్దతు లభించింది. ఇప్పుడు జరగనున్న టీ20 టోర్నీ, వన్డే ఫార్మాట్ కంటే తక్కువ సమయంలో ముగుస్తుంది. దీంతో గతేడాది వన్డే ప్రపంచకప్‌తో పోలిస్తే, టీ20 మ్యాచ్‌లకు ఎక్కువ ఆదరణ లభిస్తుందని నమ్ముతున్నాం. టీ20 మ్యాచ్‌ను బిగ్ స్క్రీన్‌పై చూసేందుకు కచ్చితంగా భారీ సంఖ్యలో ఆడియెన్స్ వస్తారు' అని నితిన్ అభిప్రాయపడ్డారు.
అయితే భారత్‌లో ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలు, ఐపీఎల్ టోర్నీ జరుగుతున్న కారణంగా పెద్ద సినిమాల రిలీజ్లు ఆగిపోయాయి. పలు ఇండస్ట్రీల భారీ బడ్జెట్ సినిమాలన్నీ జూన్ తర్వాతే విడుదల కానున్నాయి. దీంతో వేసవి సెలవులు ఉన్నప్పటికీ ఇండియన్ బాక్సాఫీస్ కాస్త నెమ్మదించింది. థియేటర్లకు వెళ్లేందుకు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అందుకే వరల్డ్‌కప్ మ్యాచ్‌ల ప్రదర్శనతో ఆడియెన్స్‌ను మళ్లీ థియేటర్లకు రప్పించాలని ఇలా ప్లాన్ చేస్తున్నారు.
ఇక జూన్ 2 నుంచి 29 వరకు ఈ టోర్నీ జరగనుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి టోర్నీలో 20 దేశాలు పాల్గొంటున్నాయి. వీటిని నాలుగు గ్రూపులుగా విభజించి మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. టీమ్ఇండియా స్టార్లు ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి ఇదే చివరి వరల్డ్‌కప్ అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో టోర్నీకి మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్ జూన్ 5న ఐర్లాండ్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. ఇక 9న పాకిస్థాన్‌తో తలపడనుంది.
రెండో సెమీస్‌కు రిజర్వ్ డేను తొలిగించిన ఐసీసీ - T20 world cup 2024
హెడ్‌కోచ్ రేస్‌లో లక్ష్మణ్, లాంగర్?- ఉండాల్సిన ఆ అర్హతలివే! - Team India New Head Coach