ETV Bharat / sports

లక్ష్యసేన్ రివర్స్​​ షాట్- ఈ షట్లర్ స్కిల్​కు అడియెన్స్​ ఫిదా- వీడియో వైరల్​ - Paris Olympics 2024 - PARIS OLYMPICS 2024

Lakshya Sen Back Shot: భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్‌ ఒలింపిక్స్‌లో బుధవారం జొనాథన్ (ఇండోనేసియా)తో జరిగిన మ్యాచ్​లో నెగ్గి ప్రీ క్వార్టర్ ఫైనల్స్​కు దూసుకెళ్లాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఆడిన ఓ షాట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Lakshya Sen Olympics
Lakshya Sen Olympics (Source: Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 31, 2024, 7:44 PM IST

Lakshya Sen Back Shot: కొందరు ప్లేయర్లు క్రీడల్లో అద్భుత విన్యాసాలతో ఆకట్టుకుంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్‌గా మారుతుంటాయి. తాజాగా పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత స్టార్ షట్లర్‌ లక్ష్యసేన్‌ తన టెక్నిక్​తో అక్కడున్న ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేశాడు. లక్ష్య ఆడిన షాట్‌ చూసి ప్రేక్షకులంతా ఒక్కసారిగా షాకయ్యారు. నెట్‌లో ప్రత్యక్షమైన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

నివ్వెరపోయిన పారిస్‌!
ప్రపంచ నెం.4వ ర్యాంక్ షట్లర్ జోనథన్ క్రిస్టీ (ఇండోనేసియా)తో బుధవారం లక్ష్యసేన్ తలపడ్డాడు. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్​లో లక్ష్య తన స్కిల్స్​తో ఆందర్నీ ఆకట్టుకున్నాడు. తొలి సెట్​లో 19-18తో ఆధిక్యంలో ఉన్న దశలో ప్రత్యర్థి క్రిస్టీ నుంచి వేగంగా వచ్చిన కాక్​కు లక్ష్య నమ్మశక్యం కాని రీతిలో బదులిచ్చాడు. తనవైపు వచ్చిన కాక్​ను రివర్స్​ షాట్​ (Behind The Back Recovery Shot)తో అవతలి కోర్ట్​​లోకి పంపించాడు. లక్ష్యసేన్‌ ఆడిన ఈ షాట్ సెన్సేషనల్​గా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్​ అవుతోంది.

అసాధారణ పోరాటం
ఆసియా క్రీడల్లో గోల్డ్‌ మెడల్‌ విజేత లక్ష్య సేన్‌, క్రిస్టీతో జరిగిన తొలి సెట్‌లో అద్భుతంగా పోరాడాడు. ప్రారంభంలో క్రిస్టీ 8-2 ఆధిక్యంలో నిలిచాడు. అనంతరం లక్ష్యసేన్‌ గట్టి పోటీ ఇచ్చాడు. క్రిస్టీ కూడా దీటుగా స్పందించాడు. అయితే ఏ దశలోనూ లక్ష్యసేన్‌ ఆధిక్యం పెరగనివ్వలేదు. చివరికి ఓపెనింగ్ సెట్‌ గెలుచుకోవడానికి మూడు పాయింట్ల దూరంలో క్రిస్టీ నిలిచిపోయాడు. 16-18 వద్ద ఉన్నప్పుడు లక్ష్య వరుసగా 5 పాయింట్లు గెలిచి సెట్‌ గెలిచాడు.

లక్ష్యసేన్ రెండో సెట్‌లో జొనాథన్ క్రిస్టీని బోల్తా కొట్టించాడు. కఠినమైన తొలి సెట్‌ గెలిచిన కాన్ఫిడెన్స్‌, ప్రేక్షకుల సపోర్ట్‌తో మరింత దూకుడుగా ఆడాడు. ఏ కదశలోనూ క్రిస్టీ ప్రమాదకరంగా నిపించలేదు. లక్ష్యసేన్‌ రెండో సెట్‌లో భారీ ఆధిక్యంతో గెలిచాడు. ఈ గేమ్‌ విజయంతో లక్ష్య సేన్‌ ప్రీ- క్వార్టర్‌ఫైనల్స్‌కి చేరుకున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.