Team India Cricketers Favourite Holiday Destination : కఠినమైన వ్యాయామాలు, తీరికలేని మ్యాచ్‌లు, వాణిజ్య ప్రకటనలు, నిరంతర ప్రయాణాలు, ప్రతి క్రికెటర్ జీవితం దాదాపు ఇలాగే ఉంటుంది. కుటుంబంతో సరదాగా బయటకు వెళదాం అంటే ఎక్కడ అభిమానులు చూస్తారో అని టెన్షన్. అందుకే ఎప్పుడూ బిజీగా ఉండే మన టాప్ క్రికెటర్లు కాస్త ఖాళీ దొరికినా తమకి నచ్చిన ప్రదేశాలకు పయనం అవుతారు. కింగ్ కోహ్లీ నుంచి హిట్ మ్యాచ్ రోహిత్ వరకు నచ్చిన ప్రదేశాలు ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.
1. విరాట్ కోహ్లీ - క్వీన్స్‌లాండ్, బార్సిలోనా
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి కాస్త ఖాళీ దొరికినా ఫామిలీతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తాడు. భార్య పిల్లలతో కలిసి న్యూజిలాండ్‌లోని క్వీన్స్‌లాండ్‌కు గానీ, స్పెయిన్‌లోని బార్సిలోనాకు గానీ వెళ్లిపోతాడు. లాక్‌డౌన్ సమయంలో భారతీయ క్రికెటర్లు పాల్గొన్న ఓ ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్లో కోహ్లీ ఈ విషయాన్ని స్వయంగా చెప్పాడు.
2. రోహిత్ శర్మ - స్పెయిన్, యూరప్
టీమ్ఇండియా కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌ని ఇష్టపడతాడు. క్రికెట్ తర్వాత రోహిత్ శర్మ అభిమానించే ఆట ఫూట్ బాల్. గతంలో ఒకసారి రోహిత్ 'లా లిగా' ఫుట్‌బాల్ లీగ్‌లో భాగంగా రియల్ మాడ్రిడ్-బార్సిలోనా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ను కుటుంబంతో కలిసి వీక్షించాడు.
3. కేఎల్ రాహుల్ - గ్రీస్, స్పెయిన్
టీమ్ఇండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ సమయం దొరికిందంటే చాలు గ్రీస్ లేదా స్పెయిన్‌కు వెళ్లటానికి ఇష్టపడతాడు.
4. హార్దిక్ పాండ్య - లండన్
హార్డ్ హిట్టింగ్ ఇండియన్ ఆల్-రౌండర్ లండన్‌ను ఇష్టపడతాడు. ఐపీఎల్ 2024లో ముంబయి ఇండియన్స్ ఘోర పరాభవం, భార్య నటాషా స్టాంకోవిచ్‌తో విడాకులు తీసుకున్నాడనే కథనాల తర్వాత కూడా టీ20 ప్రపంచకప్ 2024లో ఆడేందుకు డైరెక్ట్‌గా యూఎస్ వెళ్లకుండా.. లండన్‌కు వెళ్లాడు. అక్కడ కాస్త విశ్రాంతి తీసుకొనే అమెరికాకు వెళ్లి భారత జట్టుతో కలిశాడు.
5. సచిన్ తెందూల్కర్ - ముస్సోరీ
ఇక మన మాస్టర్ బ్లాస్టర్‌కు విపరీతంగా నచ్చే ప్రాంతం ముస్సోరీ. ఉత్తరాఖండ్‌లోని ఈ ప్రసిద్ధ పర్యాటక ప్రదేశానికి తన కుటుంబంతో కలిసి తరచుగా వెళతాడు మన క్రికెట్ గాడ్. హిల్ స్టేషన్‌తో పాటూ బీచ్‌లు కూడా ఇష్టపడే సచిన్ కు గోవా అన్నా మక్కువే.
6. శిఖర్ ధావన్ - ఆస్ట్రేలియా
శిఖర్ ధావన్ తన జీవితంలో ఎక్కువ భాగం ఆస్ట్రేలియాలో గడపటం వల్ల, ఆ దేశం అతడికి ఇష్టమైన హాలిడే స్పాట్‌గా ఉండిపోయిందట. 2018లో ఓ సోషల్ ట్రావెల్ ప్లాట్‌ఫామ్‌తో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపాడు.
7. జస్ప్రీత్ బుమ్రా - న్యూజిలాండ్
ఇక మన బూమ్ బూమ్ బుమ్రాకు కూడా విరాట్ కోహ్లీ లాగా న్యూజిలాండ్ అంటేనే ఇష్టం. టీ 20 ప్రపంచకప్‌లో బంతితో నిప్పులు చెరిగి భారత్ వరల్డ్ కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు జస్ప్రీత్ బుమ్రా.
8. సూర్యకుమార్ యాదవ్ - గ్రీస్
టీ20 ప్రపంచకప్ 2024లో టీమ్ఇండియా జైత్ర యాత్ర కొనసాగించటంలో ముఖ్యపాత్ర పోషించిన సూర్యకుమార్ యాదవ్‌కు గ్రీస్ అంటే ఇష్టం.
9. ఇషాన్ కిషన్ - బార్సిలోనా, స్పెయిన్
ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్ తరపున ఆడిన డ్యాషింగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ స్పెయిన్‌లోని బార్సిలోనా తన ఫేవరెట్ ప్లేస్ అని చెప్పాడు.