Teamindia Next Schedule Zimbabwe to ICC champions Trophy : 2024 టీ20 ప్రపంచ కప్ 2024 గెలిచాక విరాట్ కోహ్లీ, రోహిత్, జడేజా టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో చాలా మంది యంగ్ ప్లేయర్‌లకు తమ సత్తా నిరూపించుకునే అవకాశం లభించనుంది. అయితే టీమ్ఇండియా నెక్ట్స్ వరుస షెడ్యూల్స్‌తో బిజీ కానుంది. 2025 ఫిబ్రవరిలో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ వరకు ఫుల్ బిజీగా ఉండనుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు ఆడబోయే షెడ్యూల్ వివరాలను తెలుసుకుందాం.
- జింబాబ్వేలో భారత పర్యటన
జులై 6 నుంచి ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్‌ల T20I సిరీస్ కోసం జింబాబ్వేలో భారత్ పర్యటించనుంది. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో యంగ్ టీమ్ బరిలో దిగనుంది. - శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్
జులై 27 నుంచి శ్రీలంకలో భారత్ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ సిరీస్‌లో టీ20ల్లో ఆడకపోయినప్పటికీ వన్డే కోహ్లీ, రోహిత్ ఆడే అవకాశం ఉంటుంది. - భారత్‌లో పర్యటించనున్న బంగ్లాదేశ్
సెప్టెంబర్, అక్టోబర్‌లో బంగ్లాదేశ్ రెండు టెస్ట్ మ్యాచ్‌లు, మూడు టీ20ల సిరీస్ కోసం భారత్‌లో పర్యటించనుంది. ఈ టెస్ట్ సిరీస్ 2023-2025 ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కౌంట్ అవుతుంది. ఈ సిరీస్ రెండు జట్లకు కీలకం కానుంది.— BCCI (@BCCI) July 2, 2024
- ఇండియాకి కివీస్
2024 అక్టోబర్, నవంబర్‌లలో మూడు టెస్ట్ మ్యాచ్‌ల కోసం న్యూజిలాండ్ భారత్‌ను సందర్శించనుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించడానికి ఈ రెండు జట్లకు ఈ సిరీస్ ఎంతో కీలకం. - భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా
2024 నవంబర్‌లో భారత్, దక్షిణాఫ్రికా నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతాయి. టీ20 ప్రపంచ కప్ ఫైనల్ తర్వాత మళ్లీ ఈ రెండు జట్లు ఈ సిరీస్ కోసం తొలిసారి తలపడుతాయి. - బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ
2024 నవంబరు నుంచి జనవరి 2025 వరకు ఐదు టెస్టుల సిరీస్ కోసం భారత్ ఆస్ట్రేలియా వెళ్తుంది. కీలక బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ కోసం తలపడుతాయి. - ఇంగ్లాండ్ టూర్ ఆఫ్ ఇండియా
2025 జనవరి, ఫిబ్రవరిలో ఇంగ్లాండ్ ఐదు T20Iలు, మూడు వన్డేల కోసం భారత్ పర్యటనకు రానుంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఈ సిరీస్ రెండు జట్లకు కీలకం కానుంది. - ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ
2025 ఫిబ్రవరి, మార్చిలో పాకిస్థాన్‌లో జరుగుతున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాల్గొంటుంది. అయితే భారత్ పాక్ వెళ్లడంపై ఇంకా స్పష్టత రాలేదు.📸📸 Recapping #TeamIndia's glorious day in Barbados! 👏👏@JayShah | #T20WorldCup pic.twitter.com/7clXYLLMM4
— BCCI (@BCCI) July 2, 2024
టీ20కు రిటైర్మెంట్ - మరి కోహ్లీ, రోహిత్ నెక్ట్స్ ప్లాన్ ఏంటి? - Kohli Rohith T20 Retirement