IND W Vs WI W T20 2024: వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం ముంబయి వేదికగా జరిగిన తొలి టీ20లో టీమ్ఇండియా 49 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. భారత్ నిర్దేశించిన 196 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో విండీస్ ఓవర్లన్నీ ఆడి 146-7 స్కోర్‌కే పరిమితమైంది.
డియాండ్రా డాటిన్ (52 పరుగులు : 28 బంతుల్లో; 4x4, 3x6) దూకుడుగా ఆడింది. క్వీనా జోసెఫ్ (49 పరుగులు : 33 బంతుల్లో; 5x4, 3x6) కూడా రాణించినా, మిగతా ప్లేయర్ల నుంచి సహకారం లభించలేదు. టీమ్ఇండియా బౌలర్లలో టిటాస్ సాధు 3, దీప్తి శర్మ , రాధా యాదవ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. సూపర్ హాఫ్ సెంచరీ (73 పరుగులు) తో అదరగొట్టిన జెమీమాకు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు' లభించింది.
For her explosive knock of 73 off just 35 deliveries in the 1st innings, Jemimah Rodrigues becomes the Player of the Match 👏👏
— BCCI Women (@BCCIWomen) December 15, 2024
Scorecard ▶️ https://t.co/0G6LQ3gSPB#TeamIndia | #INDvWI | @IDFCFirstbank | @JemiRodrigues pic.twitter.com/GvcELBjkkM
అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన (54 పరుగులు : 33 బంతుల్లో; 7x4, 2x6) సూపర్ ఫామ్‌ని కొనసాగిస్తూ హాఫ్ సెంచరీ సాధించింది. వన్‌డౌన్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ (73 పరుగులు : 35 బంతుల్లో 9x4, 2x6) రఫ్పాడించింది. మరో ఓపెనర్ ఉమా ఛెత్రి (24 పరుగులు : 4x4), రిచా ఘోష్ (20 పరుగులు: 14 బంతుల్లో ; 2x4, 1x6), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (13*: 11 బంతుల్లో; 1x4) ఆకట్టుకున్నారు. విండీస్ బౌలర్లలో కరిష్మా 2, డియాండ్రా డాటిన్ ఒక వికెట్ పడగొట్టారు.
తాజా విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇరు జట్ల మధ్య డిసెంబర్ 17న రెండో టీ20 జరగనుంది. ఈ మ్యాచ్‌కు కూడా నవీ ముంబయి డీవై పాటిల్ స్టేడియం వేదిక కానుంది.