India Vs Pakistan Test cricket : పాకిస్థాన్‌తో తటస్థ వేదికపై టెస్ట్ క్రికెట్ ఆడటంలో తనకు ఎటువంటి అభ్యంతరం లేదని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. పాక్ బౌలింగ్ లైనప్ బాగుంటుందని, ఆ జట్టుతో టెస్టు ఆడితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని రోహిత్ పేర్కొన్నాడు.
2008 ముంబయి దాడుల తర్వాత రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక టెస్టు క్రికెట్ సిరీస్ జరగలేదు. కేవలం ఐసీసీ ఈవెంట్లలో మాత్రమే ఈ రెండు జట్లు పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయంపై రోహిత్ స్పందించాడు. క్లబ్ ప్రెయిరి ఫైర్ అనే యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై మాట్లాడాడు. ఇంగ్లండ్ లేదా ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఇండోపాక్ మ్యాచ్‌లను నిర్వహించేందుకు తమకు ఎటువంటి ఇబ్బంది లేదని అన్నాడు.
మరోవైపు భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌ల కోసం ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (CA) ఇప్పటికే తమ ఆసక్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. CA క్రికెట్ ఆపరేషన్స్ మేనేజర్, పీటర్ రోచ్ ఈ విషయంపై అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఎక్సైటింగ్ మ్యాచ్‌లు అభిమానులకు అందించాలనే ఆసక్తిని హైలైట్ చేశారు. క్రికెట్‌ను ఇష్టపడే ప్రతి దేశం భారత్, పాకిస్థాన్‌లు తమ మైదానాల్లో పోటీపడడాన్ని చూడటానికి ఇష్టపడతాయని పేర్కొన్నారు. భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌ని నిర్వహించడానికి ఉన్న ఆసక్తిని స్పష్టం చేశారు.
సిరీస్ నిర్వహించే అవకాశాలను పరిశీలించడానికి బీసీసీఐ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మధ్య చర్చలు సులభతరం చేయడానికి క్రికెట్ ఆస్ట్రేలియా సుముఖతను రోచ్ ప్రస్తావించారు. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, నిక్ హాక్లీ, రోచ్ అభిప్రాయాలతో ఏకీభవించారు. అవకాశం వస్తే మార్క్యూ మ్యాచ్‌ను హోస్ట్ చేయడానికి ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు.
అయితే క్రికెట్ ఆస్ట్రేలియా భారత్- పాకిస్థాన్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి ఆసక్తిగా ఉన్నప్పటికీ, ఇది ద్వైపాక్షిక సిరీస్ అని, అది జరిగేలా చేయడం సంబంధిత క్రికెట్ సంస్థలపై ఆధారపడి ఉందంటూ హాక్లీ పేర్కొన్నాడు. దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఈ సిరీస్‌ను నిజం చేయడానికి చర్చలకు మద్దతు ఇవ్వడానికి, సులభతరం చేయడానికి క్రికెట్ ఆస్ట్రేలియా సిద్ధంగా ఉందంటూ తెలిపారు.
పాక్ బోర్డు కీలక నిర్ణయం- కెప్టెన్‌గా మళ్లీ బాబర్! - Babar Azam Captain
పాకిస్థాన్‌లోనే 2025 ఛాంపియన్స్ ట్రోఫీ- భారత్ రియాక్షన్‌పై ఉత్కంఠ!