India vs Pakistan T20 World Cup 2024 : ఇంగ్లాండ్ సిరీస్ తర్వాత టీమ్ఇండియా మెయిన్ ఫోకసంతా ఇప్పుడు పొట్టి ప్రపంచకప్‌పై పడింది. ఇక వరల్డ్ కప్‌లాగే దీనికి కూడా క్రికెట్ లవర్స్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. దేశ విదేశాల నుంచి ఈ మ్యాచ్‌లు చూసేందుకు క్రికెట్ అభిమానులు స్టేడియాలకు బారులు తీస్తుంటారు. దీంతో మేనేజ్మెంట్ కూడా ఇప్పటికే ఈ టోర్నీ కోసం సన్నాహకాలు ప్రారంభించింది.
ఇదిలా ఉండగా, భారత్ పాకిస్థాన్ మ్యాచ్ కోసం క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌కు క్రేజ్ ఎలా ఉంటుందో మరోసారి నిరూపితమైంది. టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా జూన్ 9న జరగనున్న భారత్, పాక్ మ్యాచ్ టికెట్ల ధరలు చూసి సగటు అభిమాని షాకవ్వగా తప్పదు. ఆన్లైన్లో ఇటీవలే మేనేజ్మెంట్ ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లను విడుదల చేసింద. సుమారు 6 డాలర్ల (రూ. 497) నుంచి 400 డాలర్ల (రూ. 33 వేలు) మేరకు టికెట్లు అందుబాటులో ఉన్నాయి. అయినా కూడా ఈ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. గత నెల 22న ఐసీసీ తమ అధికారిక వెబ్‌సైట్లలో ఈ టికెట్లను రిలీజ్ చేయగా కొద్ది సేపటికే మేనేజ్మెంట్ సోల్డ్ అవుట్ బోర్డును పెట్టాల్సి వచ్చింది.
మరోవైపు ఇదే టికెట్లను పలు రీసేల్ వెబ్‌సైట్స్‌లో రూ. 33 లక్షల నుంచి ఏకంగా రూ. 1.84 కోట్లుకు అమ్ముతున్నట్లు సమాచారం. బేస్ ప్రైస్ రూ. 1.4 కోట్లు కాగా, ట్యాక్స్‌లు మాత్రే రూ. 45 లక్షల మేర ఉందట. ఇదిలా ఉండగా, తక్కువ ధరతో కూడిన టికెట్లకు కూడా డిమాండ్ బాగా పెరిగిందట. ఒక్కో టికెట్ కనీసం రూ. లక్ష మేర పలుకుతోందని సమాచారం.
ఇక వెస్టిండీస్-అమెరికా సంయుక్తంగా అతిథ్యం ఇవ్వనున్న ఈ టీ20 వరల్డ్‌కప్ షెడ్యూల్‌ను ఐసీసీ ఇటీవలే విడుదల చేసింది. జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న ఈ పోరులో మొత్తం 9 వేదికలపై 55 మ్యాచ్‌లు జరగనున్నాయి. టోర్నీలో పాల్గొనే జట్లను నాలుగు గ్రూప్‌లుగా డివైడ్ చేశారు. గ్రూప్-ఏలో భారత్, యూఎస్, పాకిస్థాన్, కెనడా, ఐర్లాండ్ జట్లు ఉండగా, గ్రూప్ బీలో ఇంగ్లాండ్, నమీబియా, ఆస్ట్రేలియా, స్కాట్లాండ్, ఒమన్ ఉన్నాయి. ఇక గ్రూప్ సీలో న్యూజిలాండ్, వెస్టిండీస్, అఫ్గానిస్థాన్, ఉగాండ, పపువా న్యూ గినియాులు ఉన్నాయి. ఇక గ్రూప్ డిలో శ్రీలంక, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్ జట్లు ఉన్నాయి.
2024లో టోర్నీలే టోర్నీలు- క్రికెట్ ఫ్యాన్స్‌కు ఫుల్ పండుగ- కంప్లీట్ ఇయర్ షెడ్యూల్ ఇదే!
పొట్టి వరల్డ్ కప్- భారత్ X పాక్ మ్యాచ్ డేట్ ఫిక్స్! ఎప్పుడంటే?