India vs England 3rd Test Day 3: రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్టులో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 71.1 ఓవర్లలో 319 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్కు తొలి ఇన్నింగ్స్‌లో 126 పరుగుల ఆధిక్యం లభించింది. ఓపెనర్ బెన్ డకెట్ (153 పరుగులు) సూపర్ సెంచరీతో రాణించాడు. ఓలి పోప్ (39), కెప్టెన్ బెన్ స్టోక్స్ (41) ఫర్వాలేదనిపించారు. భారత్ బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 4, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా చెరో రెండు, జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్ దక్కించుకున్నారు.
ఓనర్నైట్ స్కోర్ 207-2తో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ మరో 112 పరుగులు జోడించి ఏకంగా ఎనిమిది వికెట్లు కోల్పోయింది. మూడో రోజు తొలి సెషన్లో టీమ్ఇండియా పేసర్ సిరాజ్ ప్రత్యర్థి జట్టును అద్భుతంగా కట్టడి చేశాడు. జో రూట్ (18), జానీ బెయిర్ స్టో (0), ఫోక్స్ (13), రెహాన్ అహ్మద్ (6), టామ్ హర్ల్టీ (9), మార్క్ వుడ్ (4*), జేమ్స్ అండర్సన్ (1) పరుగులు చేశారు.
అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌటైంది. 326-5తో రెండో రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ అదనంగా మరో 119 పరుగులు జోడించింది. జడేజా ఓవర్నైట్ స్కోర్ 110కి కేవలం 2 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అరంగేట్ర బ్యాటర్ ధ్రువ్ జురెల్ (46 పరుగులు) హాఫ్ సెంచరీ మిస్ అయ్యాడు. ఇక ఆఖర్లో రవిచంద్రన్ అశ్విన్ (37), జస్ప్రీత్ బుమ్రా (26) రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 4, రెహన్ అహ్మద్ 2, జో రూట్, జేమ్స్ అండర్సన్, టామ్ హార్ల్టీ తలో వికెట్ దక్కించుకున్నారు.
అశ్విన్ @500: ఈ మ్యాచ్లో టీమ్ఇండియా స్పిన్నర్ అశ్విన్ అరుదైన ఘనత అందుకున్నాడు. టెస్టుల్లో 500 వికెట్లు పడగొట్టిన తొమ్మిదో బౌలర్గా నిలిచాడు. ఇంగ్లాండ్ బ్యాటర్ జాక్ క్రాలీని ఔట్ చేసిన అశ్విన్ ఈ మైలురాయి అందుకున్నాడు. దీంతో టెస్టుల్లో 500 వికెట్లు పడగొట్టిన రెండో భారత బౌలర్గా రికార్డు కొట్టాడు. అశ్విన్ కంటే ముందు అనిల్ కుంబ్లే (619) ఈ ఘనత సాధించాడు.
జైస్వాల్ సూపర్ క్యాచ్ - మెరుపు వేగంతో ఇంగ్లాండ్ వికెట్ డౌన్
మూడో టెస్టు నుంచి వైదొలిగిన అశ్విన్ - తల్లి కోసం చెన్నైకి పయనం