India Vs Bangladesh T20 World Cup 2024 : టీ20 ప్రపంచ కప్‌లో వరుస విజయాలు సాధిస్తూ టీమ్ఇండియా తమ జోరును కొనసాగిస్తోంది. తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన సూపర్-8 పోరులోనూ అద్భుతమైన విజయం సాధించి దూసుకెళ్లింది. అయితే టీమ్ఇండియా గత కొంత కాలంగా ప్రతి మ్యాచ్ తర్వాత 'బెస్ట్ ఫీల్డర్' అవార్డును అందజేయడం ఆనవాయితీగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ మ్యాచ్ తర్వాత కూడా డ్రెస్సింగ్ రూమ్‌లో 'బెస్ట్ ఫీల్డర్ మెడల్ సెరిమనీ' జరిగింది. అయితే ఈ సారి ఓ దిగ్గజ క్రికెటర్ అతిథిగా వచ్చి ఆ మెడల్‌ను విన్నర్‌కు బహుకరించారు. ఇంతకీ ఆయన ఎవరంటే?
"బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో టీమ్‌కు సవాల్ ఎదురైంది. కానీ ప్లేయర్లందరూ అద్భుతమైన ఎఫెర్ట్స్ పెట్టారు. చివరి వరకూ పట్టు వదల్లేదు. క్యాచ్‌లను అందుకోవడమే కాకుండా గ్రౌండ్లోనూ యాక్టివ్‌గా ఆడారు. ఇప్పుడు మెడల్ కోసం ముగ్గురు (సూర్యకుమార్ యాదవ్, కెప్టెన్ రోహిత్ శర్మ, అక్షర్ పటేల్) పోటీ పడ్డారు" అంటూ భారత ఫీల్డింగ్ కోచ్ దిలీప్ పోటీదారుల పేర్లను రివీల్ చేశారు. అంతే కాకుండా ఈ మెడల్‌ను విన్నర్‌కు అందజేసేందుకు ఓ ప్రము వ్యక్తి రానున్నారని తెలిపారు. ఆయన మాదజీ స్టార్ క్రికెటర్ వివ్ రిచర్డ్స్.
ఇక డ్రెస్సింగ్ రూమ్‌లోకి రిచర్డ్స్ రాక చూసిన భారత క్రికెటర్లందరూ నిల్చుని ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. వివ్ కూడా వారందరినీ ఎంతో ఆప్యాయంగా పలకరించారు. ఆ తర్వాత సూర్యకుమార్‌కు మెడల్‌ను అందజేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.
"ఫీల్డింగ్‌లో మాకు మహ్మద్ సిరాజ్ ఇన్స్పిరేషన్. అద్భుతమైన స్కిల్స్ అతడి సొంతం. తొలి మ్యాచ్‌లోనే సిరాజ్ మాకందరికీ ఒక బెంచ్‌మార్క్ పెట్టాడు. ఇలాంటి మెడల్ మా అందరికీ తప్పకుండా మరింత స్ఫూర్తిగా నిలుస్తుంది. సంతోషంగా ఉన్నాను" అంటూ సూర్య ఎమోషనలయ్యాడు.
ఇక మెడల్‌ను అందించిన తర్వాత వివ్ రిచర్డ్స్ కూడా టీమ్ఇండియా గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ విండీస్ రేసులో లేకపోతే నేను మీకే సపోర్ట్ చేస్తానంటూ చెప్పారు.
"మీ అందరికి కంగ్రాజ్యూలేషన్స్.చాలా బాగా ఆడారు. అన్ని విభాగాల్లో ఆధిపత్యాన్ని కనబరిచారు. జట్టు చాలా బలంగా కనిపిస్తోంది. ఒకవేళ (నవ్వుతూ) విండీస్ గనుక రేసులో లేకపోతే నేను మీకే సపోర్ట్ చేస్తాను. రిషభ్ పంత్‌ను ఇలా చూడటం నాకు చాలా ఆనందంగా ఉంది. గడ్డు పరిస్థితిని ఎదుర్కొని మరీ వచ్చావు. ఇంతటి టాలెంట్‌ను కొద్దికాలం పాటు మిస్ అయ్యాం కదా. తప్పకుండా భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరతావు" అంటూ రిచర్డ్ పంత్‌తో పాటు ప్లేయర్లను అభినందించారు.
ఒక్క విజయం- గ్రాండ్ సెలబ్రేషన్స్- పీక్స్‌లో అఫ్గాన్ ఆటగాళ్ల సంబరాలు - T20 World Cup 2024
ఇంట్రెస్టింగ్గా వరల్డ్‌కప్ సెమీస్ రేస్- భారత్‌కు ఛాన్స్ ఎంతంటే?