India Tour Of Zimbabwe : సొంతగడ్డపై ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడుతున్న రోహిత్ సేన త్వరలో జింబాబ్వేతో టీ20 ఆడేందుకు ఆ దేశానికి పయనమవ్వనుంది. జూన్ 1 నుంచి 29 వరకు అమెరికా, వెస్టిండీస్ దేశాల్లో టీ20 వరల్డ్ కప్-2024 జరగనుంది. అక్కడికి వెళ్లాక తర్వాత జింబాబ్వేతో టీమ్ఇండియా ఆడనుంది.
ఈ నేపథ్యంలో బీసీసీఐ తాజాగా ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం జూన్‌లో జరగనున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ తర్వాత భారత జట్టు నేరుగా జింబాబ్వేకు వెళ్లనుంది. అక్కడ జులై 6 నుంచి 14 దాకా జరగనున్న సిరీస్‌లో పాల్గొననుంది. జింబాబ్వేలోని హరారే వేదికగా 5 టీ20 మ్యాచ్ లు జరగనున్నాయి. జులై 6, 7, 10, 13, 14 తేదీల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి.
మరోవైపు ఇదే విషయం గురించి జింబాబ్వే క్రికెట్ చైర్మన్ తవెంగ్వా ముకుహ్లానీ ట్వీట్ చేశారు. టీమ్ఇండియాకు ఆతిథ్యమిస్తున్నందుకు తమకు ఎంతో సంతోషంగా ఉందంటూ చెప్పుకొచ్చారు.
" ఈ ఏడాది మా దేశంలో జరిగే అతిపెద్ద అంతర్జాతీయ ఈవెంట్ ఇదే. టీమ్ఇండియాకు ఆతిథ్యమిస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. మా దేశ పర్యటనకు ఒప్పుకున్నందుకు బీసీసీఐకి మా హృదయపూర్వక ధన్యవాదాలు." అంటూ చైర్మెన్ తవెంగ్వా ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
India Vs Zimbabwe T20 Record : ఇక 8 ఏళ్ల తర్వాత జింబాబ్వేలో టీమ్ఇండియా పర్యటించడం ఇదే తొలిసారి. అయితే 2016లో చివరిసారిగా సిరీస్ ఆడగా, అందులో భారత జట్టు 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక ఇప్పటివరకు మూడు సార్లు జింబాబ్వే పర్యటనకు వెళ్లిన టీమ్ఇండియా, అందులో రెండు సార్లు విజయం సాధించింది. 2015 లో జరిగిన సిరీస్ 1-1 తో డ్రాగా ముగిసింది. అయితే ఇక్కడ మొత్తం 7 టీ20 మ్యాచ్‌లు జరగ్గా, అందులో 5 టీ20ల్లో విజయం సాధించింది. మరో రెండు టీ20 ల్లో ఓటమిని చవి చూసింది.
వరల్డ్ కప్‌నకు అర్హత సాధించిన శ్రీలంక.. రేసు నుంచి జింబాబ్వే ఔట్