ETV Bharat / sports

టీమ్ఇండియాకు ఇద్దరు కెప్టెన్లు ? - ఆ స్టార్ క్రికెటర్​కు పగ్గాలు! - India Tour Of Srilanka

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 16, 2024, 9:09 AM IST

India Tour Of Srilanka : టీ20 సిరీస్​లో విజయం సాధించిన టీమ్ఇండియా త్వరలో శ్రీలంకకు పర్యటించనుంది. ఈ నేపథ్యంలో రానున్న సిరీస్​ కోసం భారత జట్టుకు ఇద్దరు కెప్టెన్లను నియమించే పనిలో ఉన్నారట సెలక్టర్లు. ఇంతకీ వారెవరంటే?

India Tour Of Srilanka
Team India (Associated Press)

India Vs Srilanka Tour : టీ20 ప్రపంచకప్ తర్వాత టీమ్ఇండియా మంచి జోష్​లో ఉంది. ఇటీవలే యంగ్ ప్లేయర్లు కూడా జింబాబ్వే సిరీస్​లో విజయం సాధించింది కూడా తమకు ప్లస్ పాయింట్​గా నిలవడం వల్ల రానున్న మ్యాచుల్లో మరింత మెరుగ్గా పెర్ఫామ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రానున్న శ్రీలంక టూర్​ కోసం తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అక్కడ టీమ్ఇండియా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. జులై 26 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుండగా, ఆగస్టు 1 నుంచి వన్డే సిరీస్‌ మొదలవ్వనుంది.

ఇక ఈ సిరీస్​కు టీమ్ఇండియా కెప్టెన్‌గా ఎవరు రానున్నారన్న విషయంపై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇందులో భాగంగా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా పేరు గట్టిగా వినిపిస్తోంది. టీ20 ఫార్మాట్​కు రోహిత్ శర్మ వీడ్కోలు పలికిన నేపథ్యంలో హార్దిక్​కు ఆ పగ్గాలు అందజేస్తారని క్రికెట్ వర్గాల మాట.

అయితే టీ20 ప్రపంచకప్‌లో హార్దిక్ అత్యద్భుతంగా ఆడి జట్టుకు కీలక ఇన్నింగ్స్ అందించాడు. ఆ టోర్నీకి భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గానూ పాండ్యా వ్యవహరించాడు. గతంలోనూ టీమ్ఇండియాకు సారధిగా ఉన్న అనుభవం ఉంది. దీంతో కెప్టెన్సీ లిస్ట్​లో హార్దిక్​ పేరు ముందున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్​దే ఫైనల్ నిర్ణయం అని టాక్ నడుస్తోంది.

ఇదిలా ఉండగా, వన్డే కెప్టెన్సీ విషయంలోనూ సందిగ్ధత నెలకొంది. ఈ ఫార్మాట్​కు కేఎల్ రాహుల్​కు పగ్గాలు అందజేయాలనుకున్నప్పటికీ, బీసీసీఐ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదట. ఇక శ్రేయాస్ అయ్యర్ ఈ సిరీస్​లో కమ్​ బ్యాక్ ఇచ్చే ప్లాన్స్​లో ఉన్నందున అతడికి కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వనున్నట్లు సమాచారం.

తాజాగా ఈ టూర్‌కు సంబంధించిన వివరాలను బీసీసీఐ అనౌన్స్​ చేసింది. టీ20 మ్యాచ్‌లన్నీ పల్లెకెలెలో సాయంత్రం 7 గంటలకు, వన్డే మ్యాచ్‌లు కొలంబోలో మధ్యాహ్నం 2.30 గంటలకు జరగనున్నాయని తెలిపింది. అయితే త్వరలోనే జట్లను ప్రకటించనున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఇక భారత కోచ్‌గా గౌతమ్‌ గంభీర్ ప్రయాణం కూడా ఈ సిరీస్‌తోనే మొదలవుతుంది.

టీ20 వరల్డ్​కప్​లో శ్రీలంక ఫెయిల్​ - అప్పుడు కోచ్, ఇప్పుడు కెప్టెన్ రాజీనామా

భారత్ x శ్రీలంక - టీ20, వన్డే సిరీస్‌ షెడ్యూల్ ఇదే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.