India Squad For Last 3 Tests vs England: ఇంగ్లాండ్‌తో జరగనున్న ఆఖరి మూడు టెస్టు మ్యాచ్‌లకు భారత జట్టును శనివారం బీసీసీఐ ప్రకటించింది. ఈ మ్యాచ్‌లకు కూడా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరం కానున్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల ఆటకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న విరాట్ నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఇక స్టార్ ప్లేయర్లు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాను చివరి మ్యాచ్‌లకు ఎంపిక చేసింది.
కానీ, వారు గాయాల నుంచి కోలుకొని పూర్తి ఫిట్నెస్ సాధిస్తేనే బరిలోకి దిగే ఛాన్స్ ఉంటుంది. గాయం కారణంగా శ్రేయస్ అయ్యర్ జట్టుకు దూరమయ్యాడు. ఇక ఇషాన్ కిషన్, మహ్మద్ షమికి మరోసారి నిరాశే మిగిలింది. యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తన స్థానాన్ని నిలబెట్టుకోగా, బౌలర్ ఆకాశ్ దీప్ తొలిసారి టీమ్ఇండియాకు ఎంపికయ్యాడు. తదుపరి మ్యాచ్‌లో ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్ తుదిజట్టులో చోటు దక్కించుకునే ఛాన్స్ ఉంది.
మిగిలిన 3 టెస్టుల షెడ్యూల్
- మూడో టెస్టు- ఫిబ్రవరి 15-19- రాజ్‌కోట్
- నాలుగో టెస్టు- ఫిబ్రవరి 23-27- రాంచీ
- ఐదో టెస్టు- మార్చి 07- 11- ధర్మశాల
Ind vs Eng Test Seires 2024: ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇరుజట్లు 1-1తో సమంగా నిలిచాయి. హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ నెగ్గగా, విశాఖపట్టణం వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో టీమ్ఇండియా గెలుపొందింది. ఇక ఇరుజట్లు మూడో మ్యాచ్‌పై దృష్టి సారించాయి. రాజ్‌కోట్‌లో జరగనున్న మ్యాచ్‌లో నెగ్గి సిరీస్‌లో పైచేయి సాధించాలని రెండు జట్లు ఆశిస్తున్నాయి.
ఆఖరి 3 టెస్టులకు టీమ్ఇండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, కెఎల్ రాహుల్*, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), కెఎస్ భరత్ (వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా*, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, ఆకాష్ దీప్.
ఇంగ్లాండ్‌తో సిరీస్ - గుబులు పుట్టిస్తున్న కోహ్లీ డెసిషన్!