ETV Bharat / sports

తిరుగులేని భారత్- నాలుగో విజయంతో సెమీస్​కు - Asian Championship 2024

author img

By ETV Bharat Sports Team

Published : Sep 12, 2024, 4:11 PM IST

Asian Championship 2024 India: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2024లో భారత్ సెమీస్​కు దూసుకెళ్లింది. వరుసగా నాలుగో విజయంతో టోర్నీలో సెమీస్ బెర్తు దక్కించున్న తొలి జట్టుగా నిలిచింది.

Asian Championship 2024
Asian Championship 2024 (Source: Associated Press)

Asian Championship 2024 India: ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ హాకీలో భారత్‌ విజయ పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదుతున్న భారత్, అదే ఊపులో కొరియాను మట్టికరిపించి టోర్నీలో సెమీఫైనల్స్​కు దూసుకెళ్లింది. సౌత్ కొరియాతో గురువారం జరిగిన మ్యాచ్​లో భారత్ 3-1 తేడాతో విక్టరీ కొట్టింది. దీంతో టోర్నమెంట్​లో సెమీస్ చేరిన తొలి జట్టుగా భారత ఘనత సాధించింది.

టీమ్ఇండియాలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (9వ నిమిషం, 43వ నిమిషం) రెండు గోల్స్​తో అదరగొట్టగా, అరైజీత్ సింగ్ (8వ నిమిషం) ఒక గోల్ సాధించాడు. అటు ప్రత్యర్థి జట్టు నుంచి గోల్‌ను జిహున్ యాంగ్ (30వ నిమిషం) ఒక్కడే గోల్ సాధించాడు. ఇక శనివారం టోర్నీలోనే హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. సెప్టెంబర్ 14న భారత్- పాకిస్థాన్ పోటీపడనున్నాయి.

కాగా, ఈ టోర్నమెంట్​లో భారత్ అదరగొడుతోంది. ప్రతి మ్యాచ్​లో ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యం చలాయిస్తూ విజయాలు నమోదు చేస్తుంది. తొలి మ్యాచ్‌లో చైనాపై (3-0), రెండో మ్యాచ్‌లో జపాన్‌పై (5- 1), మూడో మ్యాచ్​లో మలేసియా (8-1) తేడాతో భారీ విజయాలు నమోదు చేసింది. చైనాపై సుఖ్‌జిత్ సింగ్ (14వ నిమిషం), ఉత్తమ్ సింగ్ (27వ నిమిషం), అభిషేక్ (32వ నిమిషం) ఫీల్డ్ గోల్స్‌ చేసి సత్తాచాటగా, జపాన్​తో మ్యాచ్​లో అభిషేక్ (2వ నిమిషం), సంజయ్ (17వ నిమిషం), ఉత్తమ్ సింగ్ (54వ నిమిషం), సుఖ్​జీత్ (60వ నిమిషం) రాణించారు.

ఇక మలేసియాపై ఏకంగా రాజ్‌కుమార్ పాల్ హ్యాట్రిక్ గోల్స్ చేశాడు. అతడు తొలి మూడు క్వార్టర్స్‌లో హ్యాట్రిక్‌తో అదరగొట్టాడు. రాజ్‌కుమార్ 3వ నిమిషం, 25వ నిమిషం, 33వ నిమిషం బంతిని నెట్స్‌లోకి పంపాడు. అత్యుత్తమ ఆట తీరుతో ఈ విజయంలో రాజ్‌కుమార్ కీలక పాత్ర పోషించాడు. కాగా, టోర్నీలో మొత్తం ఆరు జట్లు రౌండ్‌ రాబిన్‌ ఫార్మాట్లో పోటీపడుతున్నాయి. ఇందులో టాప్-4లో ఉన్న టీమ్స్ సెమీఫైనల్​కు అర్హత సాధిస్తాయి. టోర్నీలో సెప్టెంబర్ 16న సెమీస్, సెప్టెంబర్ 17న ఫైనల్ మ్యాచ్​లు జరగనున్నాయి.

ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్ హ్యాట్రిక్ - 8-1తో మలేసియాపై గ్రాండ్ విక్టరీ - 2024 Asian Champions Trophy

ఛాంపియన్స్​ ట్రోఫీ: భారత్ రెండో విజయం- 5-1తో జపాన్ చిత్తు - Asian Champions Trophy

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.