Abhishek Sharma 100 T20: టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ జింబాబ్వే పర్యటనలో రెండో టీ20లో రప్ఫాడించాడు. తొలి టీ20లో డకౌటైన అభిషేక్ ఈ మ్యాచ్‌లో కసితీరా బాదేశాడు. ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోస్తూ 46 బంతుల్లోనే సెంచరీ నమోదు చేశాడు. అభిషేక్ ధాటికి జింబాబ్వే బౌలర్లు నిలువలేకపోయారు. ఫలితంగా అంతర్జాతీయ క్రికెట్లో ఆడిన రెండో మ్యాచ్‌లోనే అభిషేక్ ప్లేయర్ 'ఆఫ్ ది మ్యాచ్'గా ఎంపికయ్యాడు.
అయితే మ్యాచ్ అనంతరం అభిషేక్ మాట్లాడాడు. తన బ్యాట్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ మ్యాచ్‌లో అతడు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాట్‌తో ఆడినట్లు మ్యాచ్ తర్వాత చెప్పాడు. గిల్ బ్యాట్‌తోనే శతకం సాధించానని అభిషేక్ అన్నాడు. అంతేకాదు, తాను ఎప్పుడైనా కమ్‌బ్యాక్ ఇవ్వాల్సి వస్తే ఎలాంటి మొహమాటం లేకుండా గిల్ బ్యాట్ అడిగేస్తానని అభిషేక్ తెలిపాడు.
'ఇవాళ నేను గిల్ బ్యాట్‌తో అడాను. ఇంతకుముందు కూడా చాలా సార్లు గిల్ బ్యాట్ ఉపయోగించాను. అండర్- 14నుంచి అలా గిల్ బ్యాట్‌తో ఆడుతున్నా. నేను ఏప్పుడైనా కమ్‌బ్యాక్ ఇవ్వాల్సి వస్తే గిల్ బ్యాట్‌తో ఆడడమే నాకు చివరి ఆప్షన్. అందుకే మొహమాటం లేకుండా గిల్‌ను బ్యాట్ అడిగేస్తా. తొలి టీ20లో డకౌటయ్యా. మరుసటి రోజే రెండో మ్యాచ్ ఉండడంతో కమ్‌బ్యాక్ గురించి ఆలోచించడానికి టైమ్ లేదు. జస్ట్ ఫ్లోలో వెళ్లిపోయా' అని అభిషేక్ అన్నాడు. అయితే అభిషేక్, గిల్ కొన్నేళ్లుగా డొమెస్టిక్ క్రికెట్లో కలిసి ఆడుతున్నారు. దీంతో వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది.
Two extremely special phone 📱 calls, one memorable bat-story 👌 & a first 💯 in international cricket!
— BCCI (@BCCI) July 8, 2024
𝗗𝗢 𝗡𝗢𝗧 𝗠𝗜𝗦𝗦!
A Hundred Special, ft. Abhishek Sharma 👏 👏 - By @ameyatilak
WATCH 🎥 🔽 #TeamIndia | #ZIMvIND | @IamAbhiSharma4 pic.twitter.com/0tfBXgfru9
ఇక మ్యాచ్ విషయానికొస్తే, టీమ్ఇండియా 100 పరుగుల భారీ తేడాతో ఆతిథ్య జట్టును చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో అభిషేక్‌తోపాటు రుతురాజ్ గైక్వాడ్ (77*), రింకూ సింగ్ (48*) రాణించడం వల్ల టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానకి 234పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో జింబాబ్వే 18.4 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్ తలో 3, రవి బిష్ణోయ్ 2, సుందర్ 1 వికెట్ దక్కించుకున్నారు.
ABHISHEK SHARMA HUNDRED MOMENT. 🤯
— Johns. (@CricCrazyJohns) July 7, 2024
- 6,6,6 when Abhishek was batting on 82* 🔥 pic.twitter.com/0OubKlnauI
ఎంతైనా ఛాంపియన్లు ఛాంపియన్లే!: సికిందర్ రజా
నిన్న చెత్త రికార్డు- నేడు ఊచకోత- అభిషేక్ శర్మ గట్టి రివెంజ్!