ETV Bharat / sports

రోహిత్ ఖాతాలో మరో రికార్డు - కెప్టెన్​గా అత్యధిక సిక్స్​లు బాదిన టాప్-5 బ్యాటర్స్ వీరే - Rohith Sharma Sixes Record

ROHITH SHARMA MOST SIXES RECORD : కెప్టెన్​గా అత్యధిక సిక్సులు బాదిన బ్యాటర్​గా రోహిత్ శర్మ నిలిచాడు. శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో రోహిత్ ఈ ఫీట్​ను అందుకున్నాడు. ఈ క్రమంలో కెప్టెన్​గా అత్యధిక సిక్సులు కొట్టిన టాప్-5 బ్యాటర్స్ ఎవరో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

source Getty Images and Associated Press
ROHITH SHARMA MOST SIXES RECORD (source Getty Images and Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Aug 3, 2024, 8:39 PM IST

ROHITH SHARMA MOST SIXES RECORD : టీమ్​ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన హిట్టింగ్ స్టైల్​తో క్రికెట్​లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తనదైన స్టైలిష్ షాట్లు, హిట్టింగ్​తో ప్రేక్షకులను తెగ అలరిస్తాడు. వీలుచిక్కినప్పుడల్లా బంతిని గ్రౌండ్ బయటకి పంపిస్తుంటాడు. అయితే ఈ దిగ్గజ బ్యాటర్ శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్​లో కెప్టెన్​గా వ్యవహరించి అత్యధిక సిక్సర్ల బాదిన బ్యాటర్​గా రోహిత్ నిలిచాడు. శ్రీలంక జరిగిన మొదటి వన్డేలో ఈ ఫీట్​ను హిట్​ మ్యాన్ టచ్​ చేశాడు. ఈ క్రమంలో కెప్టెన్లుగా ఉండి అత్యధిక సిక్స్​లు కొట్టిన టాప్- 5 బ్యాటర్స్ గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Top 5 Most Sixes By a Captain :
1. రోహిత్ శర్మ (234 సిక్సర్లు)
శ్రీలంకతో శుక్రవారం జరిగిన మ్యాచులో రోహిత్ శర్మ 47 బంతుల్లో 58 పరుగులు చేశాడు. అందులో 7 ఫోర్లు, మూడు సిక్స్​లు ఉన్నాయి. దీంతో రోహిత్ కెప్టెన్​గా అత్యధిక సిక్స్​లు కొట్టిన బ్యాటర్​గా ఇంగ్లాండ్ బ్యాటర్​ ఇయాన్ మోర్గాన్ రికార్డును బద్దలు కొట్టాడు. సారథిగా 134 ఇన్సింగ్ ల్లోనే 234 సిక్స్​లు బాదాడు.

2. ఇయాన్ మోర్గాన్ (233 సిక్సర్లు)
ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్ ఇయాన్ మోర్గాన్ 11 ఏళ్ల పాటు ఆ జట్టుకు కెప్టెన్​గా వ్యవహరించాడు. ఆ సమయంలో 180 ఇన్సింగ్స్​లో 233 సిక్సర్లను బాదాడు ఈ లెఫ్ట్ హ్యాండర్. 2019 వన్డే ప్రపంచ కప్​లో ఆఫ్గానిస్థాన్​తో జరిగిన ఓ మ్యాచులో మోర్గాన్ ఏకంగా 17 సిక్సర్లు బాదడం విశేషం.

3. ఎంఎస్ ధోనీ (211 సిక్సర్లు)
భారత మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మొత్తం 211 సిక్సర్లు బాదాడు. ధోనీ కెప్టెన్​గా వ్యవహరించిన 2007-2018 మధ్య కాలంలో 330 ఇన్నింగ్స్​లో ఈ బౌండరీలను కొట్టాడు.

4. రికీ పాంటింగ్ (171 సిక్సర్లు)ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్ తాను కెప్టెన్​గా వ్యవహరించిన 10 ఏళ్ల కాలంలో 171 సిక్సర్లు కొట్టాడు. 236 ఇన్సింగ్స్​లో ఈ ఫీట్​ను నమోదు చేశాడు. అయితే పాటింగ్ తన కెరీర్​లో ఎక్కువగా ఫోర్లు కొట్టాడు.5. బ్రెండన్ మెక్ కల్లమ్ (170 సిక్సర్లు)న్యూజిలాండ్ మాజీ ప్లేయర్ బ్రెండన్ మెక్ కల్లమ్ కెప్టెన్​గా 140 ఇన్నింగ్స్​లో 170 సిక్సర్ల బాదాడు. దాదాపు ఏడేళ్ల పాటు బ్రెండన్ కివీస్​కు కెప్టెన్​గా వ్యవహరించాడు.

'నేను, విరాట్​ కలిసినప్పుడు అలా చేస్తుంటాం' - కోహ్లీతో బంధంపై ధోనీ కామెంట్స్ - Dhoni Kohli

ఛాంపియన్స్ ట్రోఫీకి ఇది ప్రాక్టీస్ కాదు- మేం ప్రతీది సీరియస్​గా తీసుకుంటాం: రోహిత్ - India Srilanka Series 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.