ETV Bharat / sports

చేజారిన వన్డే సిరీస్- మూడో మ్యాచ్​లోనూ భారత్ ఓటమి - Ind vs SL ODI Series

Ind vs SL 3rd ODI 2024: శ్రీలంక పర్యటనలో భారత్ వన్డే సిరీస్ కోల్పోయింది. మూడు వన్డేల సిరీస్​ను ఆతిథ్య శ్రీలంక 2-0 తేడాతో దక్కించుకుంది.

Ind vs SL
Ind vs SL (Source: Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Aug 7, 2024, 8:23 PM IST

Updated : Aug 7, 2024, 8:54 PM IST

Ind vs SL 3rd ODI 2024: శ్రీలంక పర్యటనలో భారత్ వన్డే సిరీస్ కోల్పోయింది. మూడు వన్డేల సిరీస్​లో భాగంగా బుధవారం జరిగిన ఆఖరి మ్యాచ్​లో శ్రీలంక 110 పరుగుల తేడాతో నెగ్గింది. శ్రీలంక నిర్దేశించిన 249 పరుగుల లక్ష్య ఛేదనలో టీమ్ఇండియా 26 ఓవర్లలో 138 స్కోర్ వద్ద ఆలౌటైంది. కెప్టెన్ రోహిత్ శర్మ (35 పరుగులు) ఫర్వాలేదనిపించాడు. శ్రీలంక బౌలర్లలో దునిత్ వెల్లలగే 5, వాండర్సే 2, మహీషా తీక్షణ 2, అశిత ఫెర్నాండో 1 వికెట్ దక్కించుకున్నారు. ఈ విజయంతో శ్రీలంక 2-0 తేడాతో వన్డే సిరీస్​ దక్కించుకుంది.

240 పరుగుల లక్ష్య ఛేదనను టీమ్ఇండియా ధీటుగానే ప్రారంభించింది. 7 ఓవర్లకే స్కోర్ 50 పరుగులు దాటింది. రోహిత్ శర్మ మరోసారి ధనాధన్ బ్యాటింగ్​తో ఇన్నింగ్స్​ ప్రారంభించాడు. అయితే ఐదో ఓవర్లో శుభ్​మన్ గిల్ (6 పరుగులు) సిరీస్​లో వరుసగా ముూడోసారి విఫలమయ్యాడు. ఇక ధాటిగా ఆడుతున్న రోహిత్ కూడా 7.1 వద్ద క్యాచౌట్​గా వెనుదిరిగాడు. తర్వాత మిగతా బ్యాటర్లెవరూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు.

వరుసగా రిషభ్ పంత్ (6 పరుగులు), విరాట్ కోహ్లీ (20 పరుగులు), అక్షర్ పటేల్ (2 పరుగులు), శ్రేయస్ అయ్యర్ (8 పరుగులు), రియాన్ పరాగ్ (15 పరుగులు) త్వరత్వరగా ఔటయ్యారు. దీంతో భారత్ 100 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. దీంతో అప్పుడే టీమ్ఇండియా ఓటమి దాదాపు ఖరారైంది. అయితే చివర్లో వాషింగ్టన్ సుందర్ (30 పరుగులు) పోరాడి ఓటమి అంతరాన్ని తగ్గించాడు. చివర్లో కుల్దీప్ (6 పరుగులు) వెనుదిరగడంతో 138 స్కోర్ వద్ద భారత్ ఇన్నింగ్స్ ముగిసింది.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 248-7 పరుగులు చేసింది. ఓపెనర్లు పాతుమ్ నిస్సంక (45), అవిష్క ఫెర్నాండో (95), కుశాల్ మెండీస్ (59) రాణించారు. చివర్లో కామిందు మెండీస్ (23*) ఆకట్టుకున్నాడు. ఇక టీమ్ఇండియా బౌలర్లలో రియాన్ పరాగ్ 3, కుల్దీప్ యాదవ్, సిరాజ్, అక్షర్ పటేల్, సుందర్ తలో వికెట్ దక్కించుకున్నారు.

27 ఏళ్లకు
కాగా, ఈ సిరీస్​లో తొలి మ్యాచ్​ డ్రా గా ముగియగా, తర్వాత రెండు వన్డేల్లోనూ ఆతిథ్య శ్రీలంక విజయం సాధించింది. దీంతో దాదాపు 27 ఏళ్ల తర్వాత టీమ్ఇండియాపై శ్రీలంక వన్డే సిరీస్​ నెగ్గింది. ఇక ఇదే పర్యటనలో జరిగిన టీ20 సిరీస్​ను టీమ్ఇండియా కైవసం చేసుకుంది.

T20 వరల్డ్​కప్​పై బంగ్లా అల్లర్ల ఎఫెక్ట్- టోర్నమెంట్ ఆ దేశానికి షిఫ్ట్​! - Womens T20 World Cup 2024

టీమ్ఇండియా - ఈ మూడు సమస్యలకు చెక్ పెట్టకుంటే 27 ఏళ్ల తర్వాత అదే రిపీట్! - India Vs Sri Lanka 3rd ODI

Last Updated : Aug 7, 2024, 8:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.