Ind vs Sa Final Weather Report: 2024 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఎదురుచూస్తోంది. వెస్టిండీస్ బర్బడోస్ వేదికగా శనివారం భారత్- సౌతాఫ్రికా టైటిల్ పోరులో తలపడనున్నాయి. అయితే ఈ కీలకమైన మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించే అవకాశం ఉందని అక్కడి వాతావారణ శాఖ అంచనా వేసింది. శుక్రవారం కూడా అక్కడ భారీగా వర్షం కురిసినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరలయ్యాయి. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు. అయితే క్రికెట్ ఫ్యాన్స్‌కు ఓ గుడ్‌న్యూస్.
అయితే శనివారం ఉదయం బర్బడోస్ వాతావరణం పొడిగా ఉంది. దీనికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్లేయర్లంతా గ్రౌండ్లోకి దిగి ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక మ్యాచ్ సమయానికి కూడా పెద్దగా వర్షం అంతరాయం కలిగించకపోవచ్చని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అయితే మ్యాచ్ మధ్యలో చిన్న చిరుజల్లులతో కూడిన వర్షం రావొచ్చని, అయినా అది ఆటకు పెద్దగా ఇబ్బంది కలిగించదని అక్కడి వాతావరణ శాఖ చెబుతోంది. ఈ లెక్కన ఇవాళే పూర్తి స్థాయిలో మ్యాచ్ జరిగేందుకే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
A GOOD BRIGHT MORNING IN BARBADOS. 🔅
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 29, 2024
- Hopefully no interruptions in the match. (Vimal Kumar). pic.twitter.com/Nbl0M15Kcn
Keshav Maharaj remembering Lord Rama before entering the Barbados field. 🌟pic.twitter.com/pP6iEzgsfO
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 29, 2024
Captain Rohit Sharma and Rahul Dravid assessing the Barbados pitch. pic.twitter.com/6D96gpzYnM
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 29, 2024
హిస్టరీలో తొలిసారి
ఈ టోర్నీ ఫైనల్లో భారత్- సౌతాఫ్రికా తలపడనున్నాయి. అయితే ప్రస్తుత టోర్నమెంట్లో ఈ రెండు జట్లు కూడా ఓటమి అనేదే లేకుండా ఫైనల్ దాకా వచ్చాయి. సౌతాఫ్రికా ఆడిన 8మ్యాచ్‌ల్లో ఎనిమిదింట్లో నెగ్గగా, టీమ్ఇండియా 8 ఆడగా 7 నెగ్గింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఇలా ఐసీసీ ఈవెంట్లలో అజేయంగా ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి.
THE CURRENT WEATHER OF BARBADOS. 🌟
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 29, 2024
- A big game loading. (Vipul Kashyap).pic.twitter.com/fnwI16GQVe
తుదిజట్లు అంచనా
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా
సౌతాఫ్రికా: క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), రీజా హెండ్రిక్స్, ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడా, అన్రిచ్ నోకియా, తబ్రైజ్ షంసీ