ETV Bharat / sports

భారత్ x పాక్: టీ20 వరల్డ్​కప్​లో దాయాదుల చరిత్ర- 2007 నుంచి ఎలా సాగిందంటే? - T20 World Cup 2024

Ind vs Pak T20 World Cup: క్రికెట్‌ హిస్టరీలో భారత్ వర్సెస్‌ పాకిస్థాన్‌ మ్యాచ్‌కి ఉన్న క్రేజు వేరు. ఇప్పుడు మరోసారి 2024 టీ20 వరల్డ్‌కప్‌లో రెండు జట్లు తలపడుతున్నాయి. ఇంతకీ ఇప్పటి వరకు జరిగిన టీ20 వరల్డ్‌ కప్‌ మ్యాచుల్లో ఎవరిది పైచేయో తెలుసా?

Ind vs Pak T20
Ind vs Pak T20 (Source: Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 8, 2024, 6:58 PM IST

Ind vs Pak T20 World Cup: 2024 టీ20 వరల్డ్‌కప్‌లో ఆసక్తికర పోరుకు సమయం ఆసన్నమైంది. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్‌ క్రికెట్ స్టేడియంలో ఆదివారం భారత్ పాకిస్థాన్‌ను ఢీకొట్టనుంది. కాగా, ఈ టోర్నీలో టీమ్‌ఇండియా, ఐర్లాండ్‌పై 8 వికెట్ల తేడాతో గెలిచి ఘనంగా బోణీ కొట్టింది. మరోవైపు పాకిస్థాన్ అనూహ్యంగా యూఎస్‌ఏ చేతిలో ఓడిపోయింది.

దీంతో పాక్ ఆత్మస్థైర్యం దెబ్బతింది. మరోవైపు తొలి మ్యాచ్​లోనే నెగ్గిన భారత్ రెట్టింపు ఉత్సాహంతో బరిలోకి దిగనుంది. అయితే 2008 నుంచి పాక్‌- భారత్‌ మధ్య దైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. ఐసీసీ ఈవెంట్స్‌లో మాత్రమే పోటీ పడుతున్నాయి. కాగా, 2007లో ప్రారంభమైన టీ20 వరల్డ్​కప్​లో భారత్- పాకిస్థాన్ ఇప్పటిదాకా అనేకసార్లు తలపడ్డాయి. మరి ఈ దాయాదుల పోరులో ఎవరిది పైచేయి, ఇరుజట్ల మధ్య గల చరిత్రను తెలుసుకుందాం.

భారత్​దే పైచేయి: ఇప్పటివరకు 8 టీ20 ప్రపంచకప్‌లలో పాక్‌- భారత్‌ 7 సార్లు తలపడ్డాయి. వీటిల్లో టూమ్ఇండియా ఏకంగా 5 మ్యాచ్​ల్లో విజయం సాధించింది. పాకిస్థాన్‌ కేవలం ఒక్క మ్యాచ్‌లో గెలిచింది. ఒక మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. ప్రారంభ టీ20 వరల్డ్‌కప్‌ (2007)లో మ్యాచ్‌ డ్రా అవ్వగా, బౌల్‌ అవుట్‌లో 3-0తో ఇండియా గెలిచింది.

  • 2007 టీ20 ప్రపంచకప్: తొలి టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ పాకిస్థాన్‌తో రెండుసార్లు తలపడింది. మొదటి మ్యాచ్‌ టై అయింది. బౌల్ అవుట్ ద్వారా భారత్ మ్యాచ్‌ను గెలుచుకుంది. తర్వాత ఫైనల్స్‌లో పోటీపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత్ 5 పరుగుల తేడాతో విజయం సాధించి తొలిసారి టీ20 ఛాంపియన్‌గా నిలిచింది.
  • 2012 టీ20 ప్రపంచకప్: 2012లో శ్రీలంకలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ సూపర్‌ 8 స్టేజ్‌లో పాకిస్థాన్‌తో తలపడింది. భారత్‌ 8 వికెట్ల తేడాతో సునాయాసంగా విజయం సాధించింది.
  • 2014 టీ20 ప్రపంచకప్: 2014 టీ20 ప్రపంచకప్‌లో సూపర్‌ 8లో భారత్, పాక్‌ ఢీకొన్నాయి. మరోసారి పాకిస్థాన్‌పై 7 వికెట్ల తేడాతో భారత్‌ ఈజీ విక్టరీ అందుకుంది. అయితే భారత్ ఫైనల్లో శ్రీలంక చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది.
  • 2016 టీ20 ప్రపంచకప్: 2016 T20 ప్రపంచ కప్‌కి ఇండియా ఆతిథ్యం ఇచ్చింది. గ్రూప్ స్టేజ్‌లో ఈడెన్ గార్డెన్స్‌లో పాక్‌, భారత్‌ పోటీపడ్డాయి. ఈ మ్యాచ్‌లో మరోసారి ఇండియా ఆధిపత్యం ప్రదర్శించింది, 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
  • 2021 టీ20 ప్రపంచకప్: టీ20 వరల్డ్‌ కప్‌లో 2021లో మొదటిసారి పాకిస్థాన్‌ గెలిచింది. బాబర్‌ అజామ్‌ కెప్టెన్సీలోని పాక్‌ ఇండియాపై 10 వికెట్ల తేడాతో గెలిచింది.
  • 2022 టీ20 ప్రపంచకప్: 2022 టీ20 ప్రపంచ కప్‌లో భారత్‌, పాక్‌ మధ్య ఉత్కంఠ పోరు జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 159 పరుగులు చేసింది. ఛేజింగ్‌కి దిగిన భారత్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే కోహ్లి- పాండ్యా పార్ట్‌నర్‌షిప్‌ భారత్‌ను తిరిగి ఆటలోకి తీసుకువచ్చింది. 18 బంతుల్లో 48 పరుగులు చేయాల్సి ఉండగా, కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. చివరి బాల్‌కి సిక్స్‌ కొట్టి ఇండియాకి ఘన విజయం అందించాడు.

2024 టీ20 వరల్డ్​కప్​
2024 టీ20 ప్రపంచ కప్‌లో జూన్ 9న ఆదివారం రాత్రి 8:00 గంటలకు న్యూయార్క్‌లోని నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో పాకిస్థాన్‌తో భారత్ తలపడుతుంది. భారతదేశంలో డిస్నీ + హాట్‌స్టార్‌ యాప్‌, వెబ్‌సైట్‌లో లైవ్‌ చూడవచ్చు. టీవీలో అయితే స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్స్‌లో లైవ్‌ అందుబాటులో ఉంటుంది.

విరాట్ ఫిట్​నెస్ మంత్ర- కోహ్లీ డైట్ ఏంటో తెలుసా? - Virat Kohli Fitness Mantra

సౌరభ్ ఒక్కడే కాదండోయ్- వీళ్లూ క్రికెట్​లో రాణిస్తున్న ఇంజినీర్లే! - T20 world Cup

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.